breaking news
purushottaman
-
చైనా అమ్మాయితో నగరి అబ్బాయి ప్రేమ.. హిందూ సంప్రదాయంలో పెళ్లి
నగరి: చిత్తూరు జిల్లా నగరి అబ్బాయికి చైనా దేశానికి చెందిన అమ్మాయితో ప్రేమ వివాహం జరిగింది. నగరి మున్సిపాలిటీ పరిధి కొత్తపేటకు చెందిన వీఎన్ కృష్ణన్, లత దంపతుల కుమారుడు వీకే పురుషోత్తమన్ బీఈ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి చైనాలోని బెల్జింగ్లోని బీఎండబ్ల్యూ గ్రూప్ ఆసియా లిమిటెడ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. బెల్జింగ్కు చెందిన వాంగ్ డిసెంగ్, యాంగ్ కనియింగ్ దంపతుల కుమార్తె డబ్ల్యూ.మింగ్ మింగ్ అదే కంపెనీలో ఫైనాన్షియల్ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తోంది. ఈ యువతితో కృష్ణన్‌కు పరిచయం ఏర్పడి..అది కాస్తా ప్రేమగా మారింది. తల్లిదండ్రుల సమ్మతితో పెళ్లి చేసుకోవాలని ఇరువురు నిర్ణయించుకుని తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. సంప్రదాయ వ్యవహారాల అడ్డు తొలగించుకునే విషయంలో ఇరువురు విజయం సాధించారు. కృష్ణన్ తల్లి, బంధువుల కోరిక మేరకు నగరిలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరపడానికి వధువు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దీంతో చైనా నుంచి నగరికి వచ్చిన అమ్మాయికి వరుని తరఫు వారు హిందూ సంప్రదాయం ప్రకారం నలుగు పెట్టి, చీరకట్టి పెళ్లికూతురిలా ముస్తాబు చేసి స్థానిక ఏజేఎస్ కల్యాణ మండపంలో వివాహం జరిపించారు. -
మోడీ వచ్చాక ఆరో వికెట్!!
నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కారణాలు ఏవైనా ఇప్పటికి వరుసపెట్టి ఆరుగురు గవర్నర్లు రాజీనామా చేశారు. మరికొందరు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. తాజాగా.. తనను నాగాలాండ్ గవర్నర్‌గా బదిలీ చేసినందుకు తీవ్రంగా అసంతృప్తి చెందిన మిజొరాం గవర్నర్ పురుషోత్తమన్ తన పదవికి రాజీనామా చేసిపారేశారు. ఈయనతో కలిపి రాజీనామా చేసిన గవర్నర్ల సంఖ్య ఆరుకు చేరుకుంది. వీళ్లంతా యూపీఏ హయాంలో నియమితులైనవాళ్లే. తనను ఏమాత్రం సంప్రదించకుండానే, తన అభిప్రాయం తెలుసుకోకుండానే తనను బదిలీ చేశారన్నది పురుషోత్తమన్ ఆక్రోశం. కేరళలలో ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన ఈ 86 ఏళ్ల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు 2011లో గవర్నర్ అయ్యారు. వాస్తవానికి మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి నుంచి చాలామంది గవర్నర్లకు ఇక చాలు.. దిగిపొండి అంటూ ఫోన్లు వెళ్లాయి. పదవీకాలం చివరకు వచ్చేసినవాళ్లను మాత్రం ఉండమన్నారు. ఈ జాబితాలో గుజరాత్ గవర్నర్ కమలా బేణీవాల్ ఒకరు. మోడీ సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు, గవర్నర్‌కు చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఆమెకు పదవీకాలం కేవలం నాలుగు నెలలే ఉన్నా, ఆమెను మిజొరాం గవర్నర్‌గా బదిలీ చేశారు. ఇక కేరళ గవర్నర్‌గా ఉన్న షీలా దీక్షిత్.. రాజీనామా చేసేందుకు నిరాకరించారు. ప్రధాన మంత్రిని, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన తర్వాత.. వాళ్లెవరూ తనను రాజీనామా చేయాలని కోరలేదని షీలా అన్నారు. ఇక గోవా, పశ్చిమబెంగాల్ గవర్నర్లు వాంఛూ, ఎంకే నారాయణన్ మాత్రం అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణంలో సీబీఐ ప్రశ్నించడంతో వాళ్లిద్దరూ టపటపా రాజీనామాలు చేసి పారేశారు. కానీ ఇదే కేసులో సీబీఐ ప్రశ్నించిన మరో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాత్రం ఇంకా రాజీనామా నిర్ణయం ఏమీ తీసుకోలేదు. ఆయన ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇక, వీళ్లందరికంటే ముందు ఉత్తరప్రదేశ్ గవర్నర్ బీఎల్ జోషి, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శేఖర్ దత్, నాగాలాండ్ గవర్నర్ అశ్వనీకుమార్ రాజీనామాలు చేశారు. కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్, త్రిపుర గవర్నర్ దేవానంద్ కొన్వర్ మాత్రం వాళ్ల పదవీకాలం ముగిసేవరకు ఉన్నారు.