breaking news
Purity App
-
బంగారం స్వచ్ఛమైనదా.. కాదా? ఈ యాప్ ద్వారా తెలుసుకోండి!
బంగారం అంటే అందరికి ఇష్టమే, కావున ఎక్కువ మంది బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే కొనుగోలు చేసిన బంగారం స్వచ్ఛమైనదా, నకిలీదా అని గుర్తించడం అంత సులభం కాదు. కాబట్టి కొంతమంది దుకాణదారులు కొనుగోలుదారులను ఎక్కువగా మోసం చేసే అవకాశం ఉంది. అలాంటి మోసాలకు చెక్ పెట్టడానికి ఒక మొబైల్ యాప్ అందుబాటులో ఉంది, ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బంగారం రేట్లు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ కొనుగోలుదారుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల బంగారు ఆభరణాల అమ్మకాలకు సంబంధించి కొన్ని ప్రకటనలు చేసింది. ఇందులో భాగంగానే విక్రయదారుడు తప్పకుండా హాల్ మార్క్ కలిగి ఉన్న గోల్డ్ మాత్రం అమ్మాలని సూచించింది. ఈ రూల్స్ 2023 ఏప్రిల్ 01 నుంచి అమలులోకి వచ్చాయి. (ఇదీ చదవండి: చాట్‌జీపీటీపై నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?) బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కేర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మనం కొనే బంగారం స్వచ్ఛమైనదా? కాదా? అని తెలుసుకోవచ్చు. అయితే హాల్‌మార్కింగ్ నంబర్లో కొన్ని మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఆభరణం భారత ప్రమాణాలకు అనుకూలంగా ఉండేలా తయారు చేయాలనీ కేంద్రం స్పష్టం చేసింది. మొబైల్ యాప్ ద్వారా బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా? బంగారు ఆభరణాలపైన హాల్‌మార్క్ యూనిక్యూ ఐడెంటిఫికేషన్ (HUID) అనేది తయారీ సంస్థలే ముద్రిస్తుంటాయి. కావున బంగారం కొనేటప్పుడు ఆ HUID నెంబర్ యాప్‌లో ఎంటర్ చేయగానే ఆ నెంబర్ సరైందా.. కాదా? అనేది ఇట్టే తెలిసిపోతుంది. అంతే కాకుండా అది ఎప్పుడు, ఎవరు తాయారు చేశారనే విషయాలు కూడా తెలుస్తాయి. (ఇదీ చదవండి: ఉద్యోగం వదిలి అద్దె భూమిలో వ్యవసాయం.. కోట్లు గడిస్తూ కాలర్ ఎగరేస్తున్నాడు!) నిజానికి 2021 జులైకి ముందు బిఐఎస్ లోగో, హాల్‌మార్కింగ్ సంఖ్య, బంగారం స్వచ్ఛత వంటివి ముద్రించేవారు. వెండి ఆభరణాలకు కూడా ఇలాంటి గుర్తులు ఉండేవి. ఆ తరువాత కేవలం బిఐఎస్ లోగో, గోల్డ్ ఫ్యూరిటీ, ఆరంకెల HUID మాత్రం ముద్రించారు. ప్రస్తుతం మార్కెట్లో 14, 18, 20, 22, 23, 24 క్యారెట్స్ గోల్డ్ అందుబాటులో ఉంది. వెండికి కూడా స్వచ్ఛత ప్రమాణాలు ఉన్నాయి. -
నగరాన్ని టాప్‌లో నిలబెడుదాం
స్వచ్ఛ సర్వేక్షన్పై 12 వరకు విస్తృతంగా ప్రచారం చేయండి పౌర స్పందనతోనే మెరుగైన ర్యాంకు మేయర్ నన్నపునేని నరేందర్ వరంగల్ అర్బన్ : స్వచ్ఛత యాప్ డౌన్లోడ్, స్వచ్ఛ సర్వేక్షన్ 1969 టోల్‌ఫ్రీ కాల్లో పౌరులందరినీ భాగస్వామ్యం చేసి వరంగల్‌ను టాప్‌టెన్‌లో నిలబెడుదామని మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. ఈ మేరకు శనివారం గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, కారోబార్లు, ఉద్యోగులతో మేయర్ వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసి స్వచ్ఛ సర్వేక్షన్–2017 పోటీల వివరాలను వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పోటీ పడుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా చారిత్ర క ఓరుగల్లు ఖ్యాతిని దేశ వ్యాప్తంగా ఇనుమడింప చేయాలన్నారు. ఈనెల 12 వ తేదీ వరకు ఆండ్రాయిడ్ మొబైల్ కలిగిన ప్రతి పౌరుడు స్వచ్ఛత యాప్ డౌన్లోడు చేసుకునే విధంగా చూడాలన్నారు. అంతేకాకుండా మొబైల్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ 1969 మిస్డ్ కాల్ చేసి, 1 నెంబరుతో ఫీడ్ బ్యాక్ ఇచ్చే విధంగా చూడాలన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఝాన్సీ లక్ష్మి, మిర్యాల్ కార్ దేవేందర్, దామోదర్ యాదవ్, డిప్యూటీ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.