breaking news
pulmonary problems
-
కారు ప్రమాదం, కోమాలోకి వెళ్లిన నటి
Actress Anne Heche In Coma After Car Crash: ప్రముఖ హాలీవుడ్ నటి, దర్శకురాలు అన్నే హెచే కోమాలోకి వెళ్లారు. ఇటీవల లాస్ ఏంజిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో అన్నే హెచే తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఊపిరితిత్తులకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 'ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఎక్కువగా కాలడంతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ఇందుకోసం మెకానికల్ వెంటిలేషన్ అవసరం ఉంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆమె స్పృహలోకి రాలేదు. ఇప్పటికీ కోమాలోనే ఉంది' అని వైద్యులు పేర్కొన్నారు. ఆమె త్వరగా కోరుకోవాలని అన్నే హెచే కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. అలాగే ఇలాంటి సమయంలో ఆమె వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరారు. కాగా 53 ఏళ్ల అన్నే హెచే గ్యారేజీ నుంచి తన బ్లూ మినీ కూపర్ కారును బయటకు తీసే క్రమంలో ఓ ఇంటిని ఢీ కొట్టింది. దీంతో కారు క్రాష్ అయి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు ఆమెను బయటకు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 'అనెదర్ వరల్డ్' అనే టీవీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది అన్నే హెచే. 1987 నుంచి 1991 వరకు వచ్చిన ఈ షోలో విక్కీ హడ్సన్, మార్లే లవ్ అనే కవలలుగా నటించినందుకు గానూ ఎమ్మీ అవార్డ్ అందుకుంది. అలాగే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాతో కలిసి 'క్వాంటికో' సిరీస్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంది. చదవండి: మంటల్లో చిక్కుకున్న ప్రియాంక చోప్రా సహానటి.. నా వయసు 21, న్యాయం చేయగలనా?: హీరోయిన్ తొలి సినిమాకే నాగ చైతన్య అంత డిమాండ్ చేశాడా? -
ఫోన్ ముందు దగ్గితే చాలు..
మీకు న్యుమోనియా లేదా ఆస్థమా లాంటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయా? వాటి తీవ్రత ఎంత ఉందో డాక్టర్ వద్దకు వెళ్లకుండానే తెలుసుకోవాలనుందా? అయితే సింపుల్‌గా మీ స్మార్ట్ ఫోన్ తీసుకుని దాని ఎదురుగా ఒకసారి దగ్గితే చాలు.. మీకు ఎలాంటి సమస్యలున్నాయో ఇట్టే తెలిసిపోతుంది. ఆస్ట్రేలియాకు చచెందిన డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రొవైడర్ ఈ యాప్‌ను తయారుచేశారు. 'రెస్ యాప్' అనే ఈ యాప్‌ను 524 మంది పిల్లలపై ప్రయోగించి చూశారు. ఈ ప్రయోగాలలో 89 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చినట్లు యాప్ డెవలపర్లు తెలిపారు. పేషెంట్లు దగ్గినప్పుడు వారి శ్వాసను గమనించి, వాళ్లకు న్యుమోనియా, ఆస్థమా, బ్రాంకియోలిటిస్, సీఓపీడీ లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని వెంటనే గుర్తిస్తుంది. దీనికి ఇంకా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంది. అది అయిన తర్వాత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.