breaking news
Puli Movie
-
విజయ్‌తో సినిమా.. ఆస్తులన్నీ అమ్ముకున్నా: నిర్మాత
దళపతి విజయ్(Vijay)పై ఆయన మాజీ మేనేజర్, ‘పులి’ నిర్మాత పీటీ సెల్వకుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘పులి’ సినిమాతో తాను భారీగా నష్టపోతే.. ఆయన రెమ్యునరేషన్ మాత్రం డబుల్ అయిందన్నారు. సినిమా కోసం ఆస్తులన్నీ అమ్ముకున్న తనకు.. ఈ రోజు వరకు విజయ్ నుంచి ఓదార్పు మాట రాలేదన్నారు. విజయ్ హీరోగా చింబు దేవన్ దర్శకత్వంలో 2015లో పులి అనే సినిమాను వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎస్ కే టీ స్టూడియోస్ బ్యానర్ పై శిబు తమీన్స్, పీటీ సెల్వకుమార్ నిర్మించారు. అప్పటి వరకు వచ్చిన తమిళ సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. విజయ్ తో పాటు కిచ్చా సుదీప్, అతిలోక సుందరి శ్రీదేవి, హన్సిక వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై..తొలి రోజే డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. దీంతో నిర్మాలతకు, బయ్యర్లుకు భారీ నష్టాలు వచ్చాయి. అయితే చాలా కాలం తర్వాత నిర్మాత సెల్వకుమార్ ఈ సినిమాపై స్పందించారు.రిలీజ్‌కి ముందే కుట్ర..ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని సినిమాను విడుదల చేశాం. రిలీజ్‌కి ఒక్క రోజు ముందు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడి చేశారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. నా పక్కన ఉన్నవారే కుట్ర చేశారు. సినిమా విడుదల కాదనే వార్తలను వ్యాప్తి చేశారు. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న అవమానం, ఒత్తిడి వర్ణనాతీతం. నా 27 ఏళ్ల కష్టార్జితం మొత్తం ఈ ఒక్క సినిమా కోసమే ఖర్చు చేశా. నా కలలతో ముందుకు సాగాలని కోరుకున్నాను. కానీ ఆ కష్టార్జితం నాశనమైంది.మధ్యలో బయటకు వచ్చేశారుఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమాను థియేటర్స్‌కి తీసుకొచ్చాం. తొలి రోజు నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. స్టోరీ, గ్రాఫిక్స్ వర్క్‌పై ఫ్యాన్స్ సైతం ఫైర్ అయ్యారు. తీవ్ర ఆందోళనకు గురయ్యాను. ప్రేక్షకులు మధ్యలోనే థియేటర్స్ నుంచి బయటకు వెళ్లడం కళ్లారా చూశాను. అప్పుడు నా స్థానంలో ఇంకా ఎవరైనా ఉంటే కచ్చితంగా ఆత్మహత్య చేసుకునే వాళ్లు.విజయ్ దూరం పెట్టాడు.. సినిమా అపజయం చెందడంతో విజయ్ నన్ను దూరం పెట్టేశాడు. సినిమా రిలీజ్ తర్వాత ఐదారు రోజుల పాటు విజయ్‌తో మాట్లాడే అవకాశం రాలేదు. ఈ అపజయం విజయ్ కెరీర్‌పై కొంచెం కూడా పడలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన పారితోషికం డబుల్ అయింది. పులి చిత్రానికి రూ. 25 కోట్లు తీసుకున్న విజయ్.. ఆ తర్వాత చిత్రానికి రూ. 45 కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకున్నాడు. కానీ వాళ్లు మాత్రం నన్ను దేశ ద్రోహిగా, వైఫల్యం చెందిన వ్యక్తిగానే చూశారు. కొన్ని విషయాలను బయటపెట్టలేను కానీ.. పులి సినిమాతో నా 27 ఏళ్ల కల, కృషి నాశనం అయ్యాయి’ అని ఓ ఈవెంట్లో సెల్వకుమార్ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు. -
థియేటర్లో తొలిసారి సినిమా చూస్తున్నా!
థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం అనేది పెద్ద విషయమంటారా? మనలాంటి సామాన్యులకు కాదేమో గానీ, సెలబ్రిటీలకు మాత్రం నిజంగా అది పెద్ద విషయమే. థియేటర్‌కు వెళ్లారంటే ఒక్కసారిగా అభిమానులు గుమిగూడటం, దాంతో వాళ్లు థియేటర్లకు వెళ్లి సినిమా చూడటం అంటే పెద్ద పండగలాగే భావిస్తారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. శ్రుతిహాసన్ తాను నటించిన 'పులి' సినిమాను చెన్నైలో థియేటర్‌కు వెళ్లి చూస్తోందట. తాను ఇలా థియేటర్‌కు వెళ్లి చూడటం ఇదే తొలిసారి అని కూడా ఆమె చెప్పింది. ఈ ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది కమల్ కూతురు. Watching puli in the theatres for the first time !!!! All the very best sweetheart 😚😚😚😚 https://t.co/fa7p65qleb — khushbusundar (@khushsundar) October 1, 2015 -
పులి.. ఆగిపోయింది!
తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన పులి సినిమా గురువారం విడుదల కావాల్సి ఉన్నా, అది విడుదల కాలేదు. సినిమా తెలుగు, హిందీ డబ్బింగ్ వెర్షన్ల విడుదల కూడా అనుమానంలోనే పడింది. బుధవారం తెల్లవారుజాము నుంచి పులి హీరో, హీరోయిన్లు, దర్శక నిర్మాతల అందరి ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయడం వల్లే విడుదల ఆగిపోయిందా అని కోలీవుడ్ టాక్. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలను తెల్లవారుజామున 4 గంటలకు, 5 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తారు. కానీ గురువారం ఇవేవీ ప్రదర్శించలేదు. సినిమా విడుదల కాకపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ధర్మపురి, సేలంలో థియేటర్ల వద్ద అభిమానులు ఆందోళన చేశారు. మదురైలో బస్సులను ధ్వంసం చేశారు. ప్రీమియర్ షోలను ఎందుకు ఆపేయమన్నారో తమకు కూడా తెలియట్లేదని, సినిమా విడుదల విషయంలో క్యూబ్ సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నామని ఓ థియేటర్ యజమాని తెలిపారు. సినిమాను డిజిటల్‌గా స్ట్రీమింగ్ చేసే క్యూబ్ సంస్థకు పులి నిర్మాతలు ఇంకా కొంత సొమ్ము చెల్లించలేదని, ఆ విషయం సెటిల్ కాగానే విడుదలకు అనుమతి రావొచ్చని తెలుస్తోంది. మరోవైపు ఐటీ దాడుల కారణంగా ఎగ్జిబిటర్లకు చెల్లింపులు చేయడానికి ఆదాయపన్ను అధికారుల నుంచి అనుమతి రావాల్సి ఉందని, అందువల్లే సినిమా ఆగిందని కూడా చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు, 9 గంటలకు ప్రదర్శించాల్సిన షోలను కూడా థియేటర్లు రద్దు చేసుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత అనుమతి రావచ్చని, అయితే అది కూడా కచ్చితంగా వస్తుందని చెప్పలేమని అంటున్నారు. అమెరికా కెనడాలలో కూడా ప్రీమియర్ షోలను రద్దు చేసినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అట్మస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ తెలిపింది. చింబు దేవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి, శ్రుతిహాసన్, హన్సిక లాంటి పెద్ద హీరోయిన్లు నటించారు. -
హీరోలు, హీరోయిన్లు, నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు
-
హీరోలు, హీరోయిన్లు, నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు
సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చెన్నై నగరంలో పలువురు టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు, దర్శకులు, నిర్మాతల ఇళ్లలో బుధవారం తెల్లవారుజామునే ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. విజయ్ హీరోగా నటించిన పులి సినిమా గురువారం విడుదల కానున్న నేపథ్యంలో ఈ దాడులు మొదలైనట్లు తెలుస్తోంది. మొత్తం 32 చోట్ల ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది. తమిళ సూపర్‌స్టార్ విజయ్ సహా.. పులి సినిమా హీరోయన్లు హన్సిక, శ్రుతిహాసన్ ఇళ్ల మీద కూడా దాడులు జరిగాయి. బాహుబలి సినిమాకు దీటుగా ఈ సినిమాను రూపొందించామని, దానికంటే ఎక్కువ కలెక్షన్లు రాబడతామని నిర్మాత ప్రకటించారు. దాంతో నిర్మాత ఇళ్లు, కళ్యాణమండపాలు, కార్యాలయాలలో సోదాలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు ఈమధ్య కాలంలో పెద్ద సినిమాల్లోను, హిట్ సినిమాల్లోను నటిస్తున్న సమంత, నయనతార తదితర హీరోయిన్ల ఇళ్ల మీద కూడా సోదాలు జరుగుతున్నాయి. కొంతమంది దర్శకుల ఇళ్ల మీద కూడా దాడులు జరిగాయి. ప్రధానంగా రోబో-2 సినిమా తీస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రముఖ దర్శకుడు శంకర్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకు పేరొందిన ఏజీఎస్ ఫిలింస్ సంస్థ ఏడాదికి దాదాపు 200-300 కోట్ల వరకు ఖర్చుపెడుతోంది. దాంతో ఆ సంస్థకు చెందిన నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. -
అతిలోక సుందరి రాణీ సౌమ్యాదేవి!
మహారాణి పాత్రలు చేయాలంటే పాలనురుగు లాంటి మేని ఛాయ, శిల్పం లాంటి శరీరాకృతి, దొండపండు లాంటి అధరాలు, మీనాల్లాంటి కళ్లు... ఇలా ఆపాదమస్తకం సౌందర్యం ఉట్టిపడాలి. అచ్చంగా శ్రీదేవిలా అన్నమాట. అందుకే, ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న ఈ జగదేక సుందరిని మహారాణి పాత్రకు తీసుకున్నారు దర్శకుడు శింబుదేవన్. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విజయ్ హీరోగా ఆయన రూపొందిస్తున్న ‘పులి’ చిత్రంలో రాణీ సౌమ్యాదేవిగా శ్రీదేవి నటిస్తున్నారు. దాదాపు పధ్నాలుగేళ్ల విరామం తర్వాత శ్రీదేవి ‘ఇంగ్లిష్ వింగ్లిష్’లో నటించారు. ఈ చిత్రం విడుదలైన ఈ మూడేళ్లల్లో శ్రీదేవికి ఎన్నో అవకాశాలు వచ్చినా, చివరకు ఈ రాణీ సౌమ్యాదేవి పాత్రనే అంగీకరించారు. ఈ పాత్రలో శ్రీదేవి ఎలా ఉంటారో ఈ ఫస్ట్ లుక్‌లో చూడొచ్చు. నిజంగానే రాణీలా ఉన్నారు కదూ! -
'పులి' కోసం పాట పాడిన విజయ్
చెన్నై: తమిళనటుడు విజయ్ మరోసారి గొంతు సవరించుకున్నాడు. తన చిత్రం 'పులి' కోసం పాట పాడాడు. తన గత చిత్రాలు తుపాకీ, తలైవాల్లోనూ పాటలు పాడాడు. 'పులి సినిమా కోసం విజయ్ పాడిన పాట రికార్డింగ్ పూర్తైంది. ఈ పాట చాలా బాగా వచ్చింది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు శింబుదేవన్ కోరిక మేరకు విజయ్ పాట పాడాడు' అని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ పాటను వైరముత్తు రాశారు. ఫాంటసీ డ్రామాతో రూపొందుతున్న 'పులి' సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విజయ సరసన శృతి హాసన్, హన్సిక నటిస్తున్నారు. సీనియర్ నటి శ్రీదేవి, కన్నడ నటుడు సుదీప్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.