breaking news
Psy
-
ఆ ఒక్క పాటతో అన్ని వందల కోట్లు వచ్చాయా?
ఒకప్పుడు ప్రపంచాన్ని ఊపేసిన ఆ పాట.. 14 ఏళ్లు గడిచినా యూట్యూబ్‌లో తన జోరు కొనసాగిస్తోంది. భాషతో సంబంధం లేకుండా కోట్లాది మందిని అలరించిన ఆ సాంగ్ తాజాగా మరో రికార్డు సృష్టించింది. ఒకప్పుడు యూట్యూబ్‌లో బిలియన్ వ్యూస్ అందుకున్న తొలి వీడియోగా చరిత్ర సృష్టించిన అదే పాట.. ఇప్పుడు 6 బిలియన్ మార్క్‌ను అందుకుని తన సత్తా చాటింది. అంతటి ఆదరణ పొందిన ఈ పాట.. సింగర్ పీఎస్‌వైకి ఎంత ఆదాయాన్ని తెచ్చిపెట్టిందన్నదే ఇప్పుడు ఆసక్తికరం.దక్షిణ కొరియా పాప్ స్టార్ పీఎస్వై పాడిన ‘గంగ్నమ్ స్టైల్’ తాజాగా 6 బిలియన్ వ్యూస్ దాటి మరో సెన్సేషన్‌గా మారింది. 2012 జులైలో విడుదలైన ఈ పాట.. అదే ఏడాది డిసెంబర్లో యూట్యూబ్‌లో ఫస్ట్ బిలియన్ వ్యూస్ సాధించిన తొలి వీడియోగా చరిత్ర సృష్టించింది. 2013లో ఈ పాటకు సుమారు 1.23 బిలియన్ యూట్యూబ్ వ్యూస్ ఉన్న సమయంలో.. గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నికేష్ అరోరా ఈ వీడియోకు 8 మిలియన్ డాలర్లకుపైగా యాడ్ రెవెన్యూ వచ్చినట్లు వెల్లడించారు. అప్పటి లెక్కల ప్రకారం 8 మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ.50 కోట్లకుపైనే.6 బిలియన్ల వ్యూస్‌తో రెవెన్యూ ఎంతంటే..తాజాగా ‘గంగ్నమ్ స్టైల్’ 6 బిలియన్ వ్యూస్ దాటింది. 2023 డిసెంబర్లో 5 బిలియన్ మార్క్ చేరుకున్న ఈ వీడియో.. మరో బిలియన్ వ్యూస్ సాధించడానికి రెండేళ్ల ఏడు నెలల సమయం తీసుకుంది. అంటే.. విడుదలై దాదాపు 14 ఏళ్లు గడిచినా ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదన్నమాట.యాడ్ ఆదాయ రేటును కేవలం సూచికగా తీసుకుని 6 బిలియన్ వ్యూస్‌కు వర్తింపజేస్తే.. యూట్యూబ్ ప్రకటనల ద్వారా వచ్చే మొత్తం దాదాపు రూ.250–300 కోట్ల స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే యూట్యూబ్ ప్రకటన రేట్లు, ప్రేక్షకులు ఉన్న దేశాలు, మానిటైజేషన్, యాడ్ వీక్షణలు తదితర అంశాల ఆధారంగా ఈ ఆదాయం మారుతుంది. ఇతర ఆదాయ మార్గాలను కూడా కలిపి చూస్తే.. ఎంత లేదన్నా ‘గంగ్నమ్ స్టైల్’ ద్వారా మొత్తం సంపాదన సుమారు రూ.800 కోట్లకుపైగా ఉండొచ్చన్నది అంచనా.ఆ మొత్తం మొత్తం పీఎస్వైకే దక్కుతుందా?‘గంగ్నమ్ స్టైల్’కు యూట్యూబ్ మాత్రమే ఆదాయ వనరు కాదు. డిజిటల్ డౌన్లోడ్లు, మ్యూజిక్ స్ట్రీమింగ్, లైసెన్సింగ్, ప్రకటనలు, ఇతర వాణిజ్య ఒప్పందాలు కూడా ఉన్నాయి. 2013లోనే ఈ పాట డిజిటల్ డౌన్లోడ్లు, ప్రకటనలు, ఆన్-డిమాండ్ సేవల ద్వారా అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టినట్లు అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.అయితే యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయం మొత్తం పీఎస్‌వైకి దక్కదు. ప్లాట్‌ఫామ్ వాటాతో పాటు మ్యూజిక్, వీడియో హక్కుదారులు, రికార్డ్ లేబుల్, ఇతర భాగస్వాములకు కూడా ఆదాయం పంచబడుతుంది. అయినప్పటికీ.. అన్ని ఆదాయ మార్గాలను కలిపి చూస్తే పీఎస్‌వైకి ఈ పాట ద్వారా భారీ మొత్తమే దక్కినట్లు చెప్పొచ్చు. ఆ పాట ఎలా పుట్టిందంటే..‘గంగ్నమ్ స్టైల్’ పుట్టుక వెనుక దక్షిణ కొరియాలోని గంగ్నమ్ ప్రాంత జీవనశైలే ప్రధాన ప్రేరణ. గంగ్నమ్లో పుట్టి పెరిగిన పీఎస్వై.. అక్కడి ఉన్నతవర్గాల జీవనశైలి, వారి ఫ్యాషన్, హంగూ ఆర్భాటాలను తనదైన శైలిలో పాటగా మలిచారు. యూ జంగ్ హ్యుంగ్తో కలిసి సాహిత్యం రాయడంతో పాటు మ్యూజిక్‌ను రూపొందించిన పీఎస్వై.. సరదా పదాలు, వ్యంగ్యభరితమైన భావన, ఆకట్టుకునే బీట్‌ను జోడించారు. ఇక గుర్రపు స్వారీని తలపించే డ్యాన్స్ స్టెప్ పాటకు ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఇలా పెద్దగా అంచనాలు లేకుండా రూపొందిన ఈ పాట.. ప్రపంచ సంగీత చరిత్రనే మార్చేసే సంచలనంగా మారింది.ప్రపంచాన్ని ఊపేసిన గుర్రపు స్టెప్పు2012లో విడుదలైన ‘గంగ్నమ్ స్టైల్’ కొరియన్ భాషలో ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. పీఎస్వై వేసిన ప్రత్యేకమైన గుర్రపు స్వారీ తరహా డ్యాన్స్ పాటకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. అమెరికా బిల్బోర్డ్ హాట్ 100లో ఈ పాట ఏడు వారాల పాటు రెండో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా యూట్యూబ్ చరిత్రలో 1 బిలియన్ వ్యూస్ అందుకున్న తొలి వీడియోగా ‘గంగ్నమ్ స్టైల్’ నిలిచింది. ఈ పాట తర్వాత.. పీఎస్వై నుంచి ఆ స్థాయి ఆల్బమ్ రాలేదు. కానీ, అప్పటి నుంచి ఆయన టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియా క్రేజ్ లేని రోజుల్లోనే.. యూట్యూబ్‌తో గంగ్నమ్ స్టైల్ సంచనాలు సృష్టించడం, ఇప్పుడు 6 బిలియన్ వ్యూస్‌తో మరో మైలురాయిని అందుకోవడం.. క్రేజ్‌ను ఏదీ అడ్డుకోలేదని నిరూపించింది. -
ప్రపంచాన్ని ఊపేసిన ఈ పాట గుర్తుందా?
ఎంటర్టైన్మెంట్ ఎల్లలు లేనిది. భాష తెలియకపోయినా.. కంటెంట్‌ను ఆస్వాదించడమే అందరికీ తెలిసింది. కానీ, ఒక పాటను అంతలా ఆదరించడం.. ఆస్వాదించడం కనిపించింది అప్పుడే. ఆ పాట అతని జీవితాన్ని మలుపు తిప్పింది. కే-పాప్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేసింది. హుషారెత్తించే మ్యూజిక్‌తో గ్లోబ్ మొత్తాన్ని చిందులేయించింది. యూట్యూబ్‌లో తొలిసారి మిలియన్లైకులతో గిన్నిస్ బుక్ రికార్డు.. అంతకు మించి ఫస్ట్ బిలియన్ వ్యూస్ పూర్తి చేసుకున్న తొలి ఘనతకు దక్కించుకుంది గంగ్నమ్ స్టైల్. ఇవాళ్టికి ఈ సెన్సేషన్ సాంగ్ రిలీజ్ అయ్యి సరిగ్గా తొమ్మిదేళ్లు పూర్తయ్యింది. సాక్షి, వెబ్‌డెస్క్: కొరియా పాప్సాంగ్ గంగ్నమ్ స్టైల్.. జులై 12న టీజర్ రిలీజ్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా జులై 15న ఆడియోతో పాటు ఒకేసారి యూట్యూబ్‌లో అప్లోడ్ అయ్యింది. అప్పటికే సౌత్ కొరియాలో సింగర్ సై(పార్క్ జెయ్ సాంగ్)కు కొద్దిపాటి ఫేమ్ ఉంది. అయితే రిలీజ్ తర్వాత పాటకు మిక్స్డ్ రివ్యూస్ దక్కాయి. కానీ, నెమ్మదిగా గంగ్నమ్ స్టైల్ మత్తు గ్లోబ్ మొత్తానికి ఎక్కేసింది. సిగ్గుపడే మగవాళ్ల నోట సైతం ‘సెక్సీ లేడీ’ అనే పదం వచ్చేలా చేసి.. హుషారెత్తించింది ఈ పాట. 9 years ago today, Psy's first teaser for 'Gangnam Style' was released. pic.twitter.com/dMWShXGGpW — On This Day in K-Pop (@thisdayinkpop) July 12, 2021 డబుల్ మీనింగ్, కానీ.. ‘ఒప్ప గంగ్నమ్ స్టైల్..’ గగ్నమ్ అనేది సౌత్ కొరియాలో ఒక జిల్లా. కొరియన్ పాప్ సింగర్ సై పుట్టి, పెరిగింది అక్కడే. అందుకే అక్కడి ఆడవాళ్ల లైఫ్ స్టైల్ గురించి చెప్పడానికే ఆ ఆల్బమ్‌ను కంపోజ్ చేశాడు. ఒప్ప అంటే.. పెద్దన్న, తోపు అనే అర్థాలు వస్తాయి. అక్కడి ఆడవాళ్లను, ముఖ్యంగా తన కంటికి నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్చేసేందుకు చేసే ప్రయత్నాల్ని.. తన విరహా వేదనను వివరిస్తూ సాగే పాట అది. అందుకే అక్కడి ఉన్నతవర్గాలకు చెందిన ఆడవాళ్లకు ఆ పాటను అంకితం చేశాడు. అయితే ఆ పాట లిరిక్స్ పక్కా డబుల్ మీనింగ్. విజువల్‌లో అది స్పష్టంగా కనిపిస్తుంది కూడా. కానీ, అర్థాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేకుండానే.. దానిని సూపర్ హిట్ చేసేశారు జనాలు. అప్పటిదాకా హిందీ, ఇంగ్లీష్, డీజే రీమిక్స్ సాంగ్స్‌తో హోరెత్తిన న్యూఇయర్ వేడుకల్లో కొత్త జోష్ నింపింది గగ్నమ్ స్టైల్. ముఖ్యంగా గుర్రపు స్వారీ స్టెప్పులకు ప్రపంచం మొత్తం ఫిదా అయ్యింది. 30 దేశాల్లో ఛార్ట్‌బస్టర్ దక్షిణ కొరియా వయా అమెరికా నుంచి ప్రపంచం మొత్తం గంగ్నమ్ స్టైల్ పాకింది. రిలీజ్ అయిన అన్ని దేశాల్లోనూ ఈ పాట పెద్ద హిట్ అయ్యింది. గుర్రపుస్వారీ డ్యాన్స్‌ను ప్రపంచం మొత్తం ఆస్వాదించింది. కొరియా పాప్ మ్యూజిక్ సత్తా ఏంటో ఆ టైంలోనే చాటిన ఈ సాంగ్.. చాలామందికి ఇది కొరియన్ ఆల్బమ్ అని తెలియకుండానే ఎక్కేసింది. పిల్లల దగ్గరి నుంచి పెద్దల దాకా, సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరినీ ఊపేసింది. అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ సైతం స్టెప్పులేయగా, అప్పటి యూఎన్ఏ సెక్రటరీ బాన్ కీ మూన్ ఐక్యత కోసం ఈ పాటను ప్రచార గీతంగా ఉపయోగించాలని పిలుపు ఇచ్చారంటే అతిశయోక్తి కాదు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఆ టైంలో.. ‘‘కొరియన్ వేవ్‌లో ప్రపంచమంతా కొట్టుకుపోతోంద’ని సరదాగా వ్యాఖ్యానించాడు. జకోవిచ్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ ఇలా.. ఇలా ఆటగాళ్లు, మరెందరో స్టార్లు సైతం చిందులేశారు. సాంగ్ ఆఫ్ యూట్యూబ్ కొరియా పాప్ సింగర్ పార్క్ జెయ్ సాంగ్(సై)(43), యూ జంగ్ హ్యుంగ్ రాసిన సాంగ్. మ్యూజిక్ కూడా వాళ్లదే. చో సూ హ్యున్ డైరెక్షన్. గుర్రపు స్వారీ, కంగారు, పాండా స్టెప్పులను కలగలిపి లీ జు సన్స్టెప్పులు కంపోజ్ చేశాడు. కొరియన్ చెస్ గేమ్ జంగ్గీ తరహాలో మూమెంట్స్.. ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. ఇక ఈ పాటలో బుడ్డోడు వాంగ్ మిన్వూ, నటుడు యూ జయ్ సుక్, నోహ్ హోంగ్ హుల్, ట్రైన్లో కనిపించే నటి హ్యునా.. ఇలా అందరూ కలిసి పాటను రిచ్‌గా మార్చేశారు. మొదటిరోజు ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి. #GangnamStyle #PSY #9YearsofGangnamStyle pic.twitter.com/vLuSxgOwID — ashwik (@ursashwik) July 14, 2021 సౌత్ కొరియా గావోన్ ఛార్ట్ నుంచి ఆగష్టు నాటికి యూట్యూబ్ టాప్ 100 లిస్ట్‌కి అటుపై బిల్బోర్డ్ హాట్ 100 కి చేరింది. సెప్టెంబర్ నాటికి కేవలం ఐదు మిలియన్ల మార్క్‌కు చేరింది. కానీ, ఆ తర్వాత విధ్వంసం మొదలైంది. డిసెంబర్ 21 నాటికి గంగ్నమ్ స్టైల్ బిలియన్ మార్క్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 4 బిలియన్ల వ్యూస్‌కి పైగా.. ఓవరాల్ టాప్ పొజిషన్ సాంగ్ లిస్ట్‌లో ఎనిమిదో పొజిషన్లో కొనసాగుతోంది గంగ్నమ్స్టైల్. పేరడీలు, మిగతా వెర్షన్లు ఇవన్నీ లెక్కేస్తే ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న డెస్పాసిటోను ఎనిమిదేళ్ల క్రితమే గంగ్నమ్ స్టైల్ దాటేసినట్లే లెక్క. సై ఏం చేస్తున్నాడు ‘సై సిక్స్రూల్స్’ పేరుతో రిలీజ్ చేసిన ఆల్బమ్‌లో మొదటి పాటే గంగ్నమ్ స్టైల్. 2012లో సై ఒక వైరల్ స్టార్. కానీ, ఆ ఫేమ్‌ను సై కొనసాగించలేకపోయాడు. కారణం.. సై మిగతా పాప్ సింగర్స్లాగా కాదు. అభిమానం ఎక్కడుంటే.. వెతుక్కుంటూ వెళ్లి మరీ ఉచితంగా ప్రదర్శనలిచ్చేవాడు. బ్రాండ్లు, ప్రమోషన్, సంపాదన కోసం ఏనాడూ పెద్దగా ఆలోచించేవాడు కాదు. గంగ్నమ్స్టైల్ తర్వాత సైకి దక్కిన పాపులారిటీతో ఒక గ్లోబల్ సెలబ్రిటీగా మారిపోయే అవకాశం దక్కినా.. దానికి ఆయన మొగ్గు చూపించలేదు. ఆ తర్వాత నాలుగైదు పాప్ సాంగ్స్ కంపోజ్ చేసినప్పటికీ.. తర్వాత కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో రియాలిటీ షోలను నిర్వహిస్తున్నాడు. పీ నేషన్ పేరుతో కంపెనీ స్థాపించి..కొత్తవాళ్లకు అవకాశం ఇస్తున్నాడు. మామూలుగా సై(43) ప్లేస్‌లో వేరే ఎవరు ఉన్నా.. ప్రదర్శనల కోసం, యూట్యూబ్ రికార్డుల కోసం, డబ్బు కోసం పాకులాడేవాళ్లేమో!. -
మళ్లీ వచ్చేసిన 'ఓపెన్ గంగ్నమ్ స్టైల్'..
సై గుర్తున్నాడు కదా? 2012లో 'గంగ్నమ్ స్టైల్' పాటతో ప్రపంచవ్యాప్తంగా సునామీ సృష్టించిన ఈ కొరియన్ పాప్ సూపర్‌స్టార్ మరోసారి తనదైన డాన్సింగ్ స్టెపులతో ముంచెత్తాడు. తాజాగా అతను రూపొందించిన 'డాడీ' పాట.. యూట్యూబ్‌లో విశేషంగా ఆకట్టుకుంటోంది. సై మార్కు డాన్సులతో కొంత విచిత్రంగా, మరికొంత వినూత్నంగా ఉన్న 'డాడీ' పాటను యూట్యూబ్‌లో 24 గంటల్లోనే 42లక్షలమందికిపైగా వీక్షించారు. విలియమ్ తీసిన 'ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై మమ్మ' పాటకు 'మేల్' వెర్షన్‌గా సై 'డాడీ' పాటను రూపొందించాడు. ఇందులో సై శిశువుగా, స్కూల్ విద్యార్థిగా, సల్సా డ్యాన్సర్‌గా వినూత్న అవతారాల్లో యానిమేటెడ్ లుక్‌తో కనిపిస్తాడు. ప్రసవ సన్నివేశంతో ఈ పాట ప్రారంభమవుతుంది. సంగీతం మొదలవ్వడంతో సై ముఖంతో కూడిన ఓ శిశువు జన్మిస్తాడు. దాంతో 'ఐ గాట్ ఇట్ ఫ్రమ్ డ్యాడీ' పాట మొదలవుతుంది. ఈ శిశువు పెద్దవాడై తన డ్యాన్స్ స్టెప్పులతో స్కూల్ విద్యార్థినులను, టీచర్‌ను, అమ్మాయిలను ఎలా ఆకర్షించి బుట్టలో వేసుకుంటాడు అనే థీమ్‌తో పాట సాగుతుంది. అంతేకాకుండా ఇందులో సై బాలుడిగా, తండ్రిగా, తాతగా త్రిపాత్రభినయంతో స్టెప్పులు వేసి ఉర్రూతలూగిస్తాడు. సై తీసిన డ్యాన్సింగ్ థ్రిల్లర్ 'గంగ్నమ్ స్టైల్'ను యూట్యూబ్‌లో 2.46 కోట్లమంది వీక్షించారు. పాప్ చరిత్రలోనే భారీ హిట్లలో ఒకటిగా నిలిచింది ఈ పాట. ఆ తర్వాత సై తీసిన పాప్ సాంగ్ కావడంతో సహజంగానే 'డ్యాడీ'కి కూడా భారీగానే హిట్లు వస్తున్నాయి. అయితే ఇది కూడా 'గాంగ్నమ్ స్టైల్' స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందా? అనేది వేచి చూడాలి. -
గంగ్నామ్ 'సై' కారుకు యాక్సిడెంట్
లండన్: ఓపెన్ గంగ్నామ్ స్టైల్ అనే పాట మీకు గుర్తుండే ఉందికదా.. ఇప్పటికీ పార్టీల్లో, పెళ్లిల్లో, ఇతర సాంస్కృతిక కార్యకలాపాల్లో ఈ పాట లేదంటే అక్కడ హుషారే లేదన్నట్లు. అంత కిర్రాక్ పాటను పాడి అందరి గుండెల్లో నిలిచిపోయిన దక్షిణ కొరియా పాప్ సింగర్ 'సై' ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చైనాలో ఆయన ప్రయాణిస్తున్న కారు రోల్స్ రాయస్ వేగంగా ఓ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆయన వాహనం ముందుభాగం దెబ్బతిన్నది. అయితే, సైకి మాత్రం ఎలాంటి గాయాలవలేదని తెలిసింది. గురువారం మధ్యాహ్నం తూర్పు చైనాలోని విమానాశ్రయం నుంచి జిజియాంగ్లోని ఓ హోటల్‌కు వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం నెలకొంది. ఓ బార్లో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు సై అక్కడికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.


