breaking news
PSCs standing committee
-
మరో ‘పరీక్ష కుంభకోణం’: సమాధానాలు దిద్దకుండానే ఉద్యోగాలు!
తిరువనంతపురం: స్టేట్ ప్లానింగ్ బోర్డులోని చీఫ్ లెవెల్ పోస్టుల భర్తీకి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్సీ) నిర్వహించిన నియామక పరీక్షలో జరిగిన అక్రమాలపై ‘విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో’ (విఏసిబి) చేత దర్యాప్తు జరిపించాలని కేరళ ప్రభుత్వం యోచిస్తోంది. పీఎస్సీ అంతర్గతంగా జరుపుతున్న విచారణపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.రాజ్యాంగబద్ధమైన పీఎస్సీపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించడంలో ఏవైనా చట్టపరమైన చిక్కులు ఉన్నాయా అనే కోణంలో హోంశాఖ న్యాయ సలహా కోరింది. తదుపరి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్లానింగ్ బోర్డు పరిధిలోని మూడు విభాగాల పోస్టుల కోసం నిర్వహించిన ఈ ఉమ్మడి పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో 10 సమాధానాలను అసలు పరిశీలించనే లేదని పీఎస్సీ స్వయంగా అంగీకరించింది. అప్పటికే రెండు పోస్టులకు సంబంధించిన ర్యాంక్ జాబితాలు విడుదలై, ఇద్దరు అభ్యర్థులు విధుల్లో చేరిపోవడం గమనార్హం.కేరళ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో దాఖలైన ఒక ఫిర్యాదుతో ఈ ఘోర తప్పిదం వెలుగుచూసింది. దీంతో పరీక్ష రాసిన 200 మందికి పైగా అభ్యర్థుల సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసి, ర్యాంక్ జాబితాలను సవరిస్తామని పీఎస్సీ ప్రకటించినప్పటికీ, ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దీనితో పాటు ఫిషరీస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, కేఏఎస్ వంటి పలు ఇతర నియామకాలపై కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందడంతో, వాటన్నింటినీ విజిలెన్స్ దర్యాప్తునకు అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.ఇది కూడా చదవండి: ఎన్కౌంటర్లో ఇద్దరు బిష్ణోయ్ గ్యాంగ్ షూటర్లు హతం -
పీఎస్సీల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఘంటా
పీఎస్సీల నేషనల్ కాన్ఫరెన్స్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ల నేషనల్ కాన్ఫరెన్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (టీఎస్పీఎస్సీ) ఘంటా చక్రపాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వివిధ రాష్ట్రాల్లోని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అమలు చేసే విధానపరమైన నిర్ణయాలను రూపొందించే పీఎస్సీల అత్యున్నత నిర్ణాయక కమిటీ ఇది. గుజరాత్లో రెండ్రోజులుగా జరిగిన పీఎస్సీల నేషనల్ కాన్ఫరెన్స్ సమావేశంలో రెండో రోజైన ఆదివారం ఈ ఎన్నిక జరిగింది. ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. దేశంలోని పబ్లిక్ సర్వీసు కమిషన్లను డిజిటలైజేషన్ వైపు నడిపించిన ఘనత ఘంటా చక్రపాణికే దక్కుతుందని యూపీఎస్సీ చైర్మన్ ఫ్రొఫెసర్ డేవిడ్ రీడ్ సిమ్లే పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో గ్రూప్–1, గ్రూప్–2కు కామన్ సిలబస్ విధానం అమలుకు చర్యలు చేపట్టిన చక్రపాణికి అభినందనలు తెలిపారు. టీఎస్పీఎస్సీ అమలు చేస్తున్న సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని ఇతర రాష్ట్రాల పీఎస్సీలు అమలు చేసేలా చర్యలు చేపట్టాలని గుజరాత్ గవర్నర్ ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ అభినందనలు.. పీఎస్సీల నేషనల్ కాన్ఫరెన్స్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా ఎన్నికైన చక్రపాణికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందనలు తెలిపారు. చక్రపాణిని చైర్మన్‌గా యూపీఎస్సీ చైర్మన్, ఇతర రాష్ట్రాల పీఎస్సీల చైర్మన్లు ఎన్నుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు చక్రపాణికి మెసేజ్ పంపించారు. ఇది అన్ని రాష్ట్రాల పీఎస్సీలకు టీఎస్పీఎస్సీ నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని వివరించారు.


