breaking news
Prompt treatment
-
పది నిమిషాల్లో చేరుకోవాలి!
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల బాధితులకు సత్వర చికిత్స అందించే లక్ష్యంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పది నిమిషాల్లోపు ప్రమాద స్థలానికి చేరుకోవాలని, లేదంటే రూ.పదివేల జరిమానా విధిస్తామని అంబులెన్సు సరీ్వసులను హెచ్చరించింది. ఈ నిబంధన ప్రమాద స్థలికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని అంబులెన్సులకు వర్తిస్తుందని తెలిపింది. అంతేకాకుండా... అంబులెన్సులు టికెట్‌ను అంగీకరించిన గంటలోపు బాధితులను సమీప ఆసుపత్రులకు తీసుకు రావాలని స్పష్టం చేసింది. ఈ గడువును ఉల్లంఘించినా ఒక్కో ఘటనకు రూ.పదివేల జరిమానా తప్పదని తెలిపింది. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రమాద స్థలం పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే దూరాన్ని బట్టి చేరుకోవాల్సిన సమయాన్ని పెంచుతామని జీపీఎస్ డేటా/ఐఎంఎస్ కేర్ డ్యాష్‌బోర్డ్ ద్వారా ధ్రువీకరిస్తామని ఎన్హెచ్ఏఐ వివరించింది. ఎన్హెచ్ఏఐ పరిధిలో సుమారు 50,000 కిలోమీటర్ల రహదారులను కవర్ చేస్తూ దాదాపు 3,000 అంబులెన్స్‌లు, 1,000 పెట్రోలింగ్ వాహనాలు, క్రేన్లు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్సులు టికెట్ తిరస్కరించినా రూ.10 వేల జరిమానా విధిస్తామని తెలిపింది. ఎన్హెచ్ఏఐతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం అంబులెన్సులు అన్ని పరికరాలు, మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపింది. లేకపోతే రూ.10 వేల జరిమానా విధిస్తామని పేర్కొంది. -
ఏడాదికి రూ.1 దానం చేయండి
బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి వినూత్న విజ్ఞప్తి బెంగళూరు:రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సత్వర చికిత్స అందించడానికి వీలుగా నగరంలోని బీజీఎస్ గ్లోబల్ ఆసుపత్రి వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. అందులో భాగంగా బెంగళూరులోని ప్రజలకు ఏడాదికి రూ.1 దానం చేయాల్సిందిగా సంస్థ వైస్ చైర్మన్ వెంకటరామణ్ణ కోరారు. ప్రపంచ అంబులెన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర అదనపు కమిషనర్ (ట్రాఫిక్) దయానందతో కలిసి ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సత్వర చికిత్స అందించడానికి వీలుగా ఁగ్రీన్ఛానల్ అడ్మిషన్* పేరుతో తమ సంస్థలో నాలుగు నెలల క్రితం వినూత్న పథకాన్ని ప్రారంభించామన్నారు. ప్రమాద బాధితులు చికిత్స కోసం తమ ఆస్పత్రిలో చేరితే ఎలాంటి విచారణ, ప్రవేశరుసుము లేకుండా చికి త్స అందిస్తామన్నారు. పేదలు, నిరుపేదల శస్త్రచికిత్స కు అయ్యే ఖర్చులో వైద్యుల ఫీజును తమ సంస్థ పూర్తి గా భరిస్తుందన్నారు. ఇక మందులు ఇతరత్ర అవసరాల కోసం ధన్వంతరీ మెడికల్ ఫండ్ నుంచి అందిస్తున్నామన్నారు. గ్రీన్‌ఛానల్ అడ్మిషన్లో ఇప్పటి వరకూ 134 మందికి శస్త్రచికిత్సలు అందించామన్నారు. ప్రసు ్తతం బెంగళూరులో దాదాపు 1.20 కోట్ల మంది ప్రజలు ఉన్నారని ఒక్కొక్కరు ఏడాదికి రూ.1 అందించినా రో డ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి గ్రీన్‌ఛానల్ అడ్మిష న్ ద్వారా సత్వర చికిత్స అందించడానికి వీలవుతుందన్నారు. రూ.1 కంటే ఎక్కువ మొత్తాన్ని కూడా దానం చేయవచ్చునన్నారు. (కెనరాబ్యాంక్ అకౌంట్‌నంబర్-సీఎన్. నం.28902010000 08) మొదట తమ సంస్థ లో ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి తర్వాత నగరంలోని మిగిలిన వైద్య సంస్థల సహకారాన్ని కూడా తీసుకుంటామని వెంకటరామణ్ణ తెలిపారు.


