promises Narendra Modi
-
హామీలు తప్ప అమలేదీ?
న్యూఢిల్లీ: కేంద్రంలో మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. మోదీ సర్కార్ 3.0కు రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ‘హామీ వర్సెస్ వాస్తవం’ పేరిట మంగళవారం ఒక డాక్యుమెంట్ విడుదల చేసింది. మోదీ ప్రభుత్వం నుంచి గత 12 ఏళ్లుగా అనేక హామీలు, భారీ ప్రకటనలు, గొప్ప మాటలు, వార్తా శీర్షికలు వెలువడినప్పటికీ వాస్తవానికి ప్రజల జీవితాల్లో అర్థవంతమైన మార్పు తెచ్చేలా వాటిలో ఒక్కటీ ఆచరణలోకి రాలేదని విమర్శించింది. ఏఐసీసీ రీసెర్చ్ డిపార్టుమెంట్ రూపొందించిన ఈ 75 పేజీల పత్రాన్ని కాంగ్రెస్ నేతలు రాజీవ్ గౌడ, అమితాబ్ దూబే విడుదల చేశారు. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, విదేశాంగ విధానం, ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పు, వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి, సామాజిక రంగం, పౌర స్వేచ్ఛ, మైనారిటీల హక్కులు, చట్టాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏడాదికి 12 రాయితీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చి వాటిని 4 సిలిండర్లకు కుదించారని మండిపడ్డారు. మహిళలను, వారి కుటుంబాలను దగా చేశారని ఆరోపించారు. భారత్‌ను ప్రపంచ ఉపాధి కల్పన కేంద్రంగా మారుస్తామంటూ వాగ్దానం చేశారని తెలిపారు. వాస్తవానికి ప్రతి పది మంది గ్రాడ్యుయేట్లలో నలుగురు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని చెప్పారు. పట్టణ ప్రాంత యువతలో నిరుద్యోగిత రేటు 18.4 శాతంగా ఉందన్నారు. నిరుద్యోగులైన గ్రాడ్యుయేట్లలో 7 శాతం మంది మాత్రమే ఏడాదిలోపు శాశ్వత వేతన ఉద్యోగాన్ని పొందుతున్నారని చెప్పారు. -
వాణిజ్యంలో కొత్త అధ్యాయం
* భారత్‌లో సరళతరం కావాలి: ఒబామా * అనువైన పరిస్థితులు కల్పిస్తాం: మోదీ * భారత్ వృద్ధికి తోడ్పాటుపై అమెరికా అధ్యక్షుడు ఒబామా భరోసా * 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, రుణాలు ఇస్తామని వెల్లడి * భారత్ వ్యాపారాల ద్వారా అమెరికాలో ఉద్యోగాల కల్పన * మేధోహక్కులు పరిరక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ * కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 శాతం పెరిగిన అమెరికా పెట్టుబడులు * భారత్-అమెరికా వ్యాపారవేత్తల సదస్సులో ప్రసంగించిన ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్, అమెరికా మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి. పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు భరోసా కల్పించారు. భారత్ వృద్ధికి తోడ్పాటు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హామీ ఇచ్చారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఇరుదేశాల వ్యాపారవర్గాల సమావేశంలో వారిద్దరూ ప్రసంగించారు. ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరిగే దిశగా భారత్‌లో నియంత్రణ విధానాలు సరళతరం కావాలని ఒబామా అభిప్రాయపడ్డారు. పన్నుల విధానాలు స్థిరంగా ఉండాలని, మేధోహక్కులపరమైన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. అమెరికాలో భారత్ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని, భారత్ వ్యాపారాలు అక్కడ అనేక ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడి ప్రసంగానికి స్పందనగా భారత్ ప్రధాని మాట్లాడుతూ పెట్టుబడులను స్వాగతించే, ప్రోత్సహించే పరిస్థితులను కల్పిస్తామన్నారు. ఇన్వెస్టర్లకు ఇబ్బందికరంగా మారిన రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ (గత లావాదేవీలకు తాజాగా పన్నువేయడం) తదితర అంశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని, గతంలో జరిగిన కొన్ని తప్పిదాలను సరిచేశామని మోదీ చెప్పారు. త్వరలోనే మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్త్తామన్నా రు. అలాగే భారీ ప్రాజెక్టులు ఎలాంటి అడ్డంకులు లేకుండా త్వరితగతిన పూర్తయ్యేలా తాను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు.


