breaking news
private space
-
600వ సారి నింగిలోకి
వాషింగ్టన్: ఆధునిక ప్రైవేట్ అంతరిక్ష రంగంలో తనను మించిన విశ్వసనీయ రాకెట్ మరోటి లేదని ఫాల్కన్–9 రాకెట్ నిరూపించుకుంది. అమెరికా స్థానికకాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్‌ఫోర్స్ బేస్ ప్రయోగ కేంద్రం నుంచి ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఫాల్కన్–9 రకం రాకెట్‌ను ప్రయోగించడం ఇది 600వసారి. దీంతో అధునిక అంతరిక్ష రంగంలో అత్యధిక సార్లు ఉపయోగించిన రాకెట్ రకంగా ‘ఫాల్కన్’ చరి త్రకెక్కింది. అమెరికా ప్రభుత్వ నేషనల్ రీకనా యిసెన్స్ ఆఫీస్(ఎన్‌ఆర్‌ఓఎల్)105 మిషన్‌లో భాగంగా ఈ రాకెట్‌ను స్పేస్‌లాంచ్ కాంప్లెక్స్–4ఈ నుంచి ప్రయోగించారు. అమెరికా నిఘా, సైనిక, పౌర అవసరాలు తీర్చే డజన్ల కొద్దీ కృత్రిమ ఉపగ్రహాలను దిగువ భూ కక్ష్యలోకి ఎన్‌ఆర్‌ఓఎల్ మిషన్ ద్వారా నేషనల్ రీకనాయిసెన్స్ ఆఫీస్.. స్పేస్ఎక్స్ భాగస్వామ్యంతో నింగిలోకి పంపిస్తోంది.2010లో మొదలైన ప్రస్థానం2010 జూన్ 4వ తేదీన తొలిసారిగా ఫాల్కన్ రకం రాకెట్లను ఉపయోగించారు. ఆరోజు డ్రాగన్ వ్యోమనౌకను ఇది తొలిసారిగా విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. ఫాల్కన్ రాకెట్లు ఏ మేరకు విజయవంతమవుతాయనే అనుమానాలు తొలినాళ్లలో ఉండేవి. ఆనాటి దశ నుంచి ప్రతి వారం ఒక ఫాల్కన్‌ను ప్రయోగించే విశ్వసనీయ దశకు ఫాల్కన్ రాకెట్లు చేరుకున్నాయి. 600వసారి వినియోగం అనే ఘటన కేవలం ప్రయోగంగా కాకుండా అందుబాటులోకి వచ్చిన అద్భుతమైన సాంకేతిక సాధనంగా పరిణమించిందని సంస్థ యాజమాన్యం పేర్కొంది. ఫాల్కన్ రాకెట్ల ప్రస్థానంలో 2015 ఏడాది అత్యంత కీలకఘట్టంగా చెప్పొచ్చు. ఆ ఏడాదిలో ఫాల్కన్‌ను తయారుచేసిన స్పేస్ఎక్స్ కంపెనీ ఆర్బిటల్–తరగతి బూస్టర్ సాయంతో రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించాక తిరిగి నిట్టనిలువుగా ల్యాండింగ్ చేసే సాహసం చేసింది. ఆ తర్వాత కేవలం మూడేళ్లకే ఫాల్కన్ హెవీ రాకెట్ టెస్లా రోస్టర్‌ను నింగిలోకి విజయవంతంగా తీసుకెళ్లింది. తర్వాత డెమో–2 మిషన్ ద్వారా 2020లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వ్యోమగాములను తీసుకెళ్లిన తొలి ప్రభుత్వేతర సంస్థగా స్పేస్ఎక్స్ రికార్డులకెక్కింది. ఈ ప్రయోగానికి సైతం ఫాల్కన్ రాకెట్‌నే ఉపయోగించారు. దీంతో వ్యోమగాములను ఐఎస్ఎస్కు చేర్చేందుకు విదేశీ రాకెట్లపై ఆధారపడే సంస్కృతికి చరమగీతం పాడిన ట్లయింది. ఈ ఘటన తర్వాత క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ వంటి ప్రయోగాల్లో ఫాల్కన్–9 రాకెట్ల వినియోగం అనేది సర్వసాధా రణమైంది. దీంతో 2020 తర్వాతి నుంచి వ్యోమగాముల అంతరిక్ష ప్రయాణాలకు ఫాల్కన్ వారి స్పేస్ఎక్స్ అనేది ప్రైమరీ ట్యాక్సీగా మారిపోయింది. ఆ తర్వాత ఫాల్కన్–9 విజయాల శాతం ఏకంగా 99 శాతం దాటడం విశేషం. దీంతో అత్యంత సురక్షితమైన అంతరిక్ష వాహకంగా ఫాల్కన్–9 చరిత్రలోనే తన పేరిట రికార్డ్‌ను లిఖించుకుంది. -
స్థలం ప్రైవేట్‌ది.. సోకు కార్పొరేషన్‌ది...
- ప్రైవేట్ స్థలంలో దర్జాగా రోడ్డు నిర్మాణానికి శ్రీకారం - కార్పొరేషన్ చర్యతో విస్తుపోయిన స్థల యజమాని - ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆగిన నిర్మాణ పనులు చిట్టినగర్ : కంచే చేను మేసిన చందంగా అక్రమ ఆక్రమణలు అడ్డుకోవాల్సిన కార్పొరేషన్ అధికారులే ప్రైవేట్ స్థలాన్ని కబ్జా చేసేందుకు సిద్ధమయ్యాయి. ఏకంగా అక్కడ రోడ్డు నిర్మాణానికి వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. పనులు ప్రారంభించేందుకు కూడా సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న స్థల యజమాని పనులను అడ్డుకోవడంతో చేసిన తప్పిదాన్ని గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. లంబాడీపేట రాజీవ్‌శర్మనగర్‌లో పోతిన ఆదినారాయణ, పోతిన వెంకటేశ్వరరావు 1983లో 2020 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. చుట్టుపక్కల భారీ భవనాలు నిర్మాణాలు జరిగాయి. ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందడంతో పోతిన ఆదినారాయణ స్థలంలో నుంచి రోడ్డు నిర్మాణం చేసేలా స్థానికులు పావులు కదిపారు. అధికార పార్టీ నేతలను ఒప్పించి గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేట్ స్థలంలో రోడ్డు నిర్మించేలా కార్పొరేషన్లో ఫైల్ కదిలించారు. దీంతో సుమారు రూ.4 లక్షల అంచనాలతో 9 అడుగుల వెడల్పు, 180 అడుగుల పొడుగుతో రెండు వైపుల రోడ్డు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రెండు రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా రోడ్డుసైడ్ డ్రైయిన్ నిర్మాణానికి గోతులు తీయడంతో పాటు రాత్రికి రాత్రి కంకరను తోలించారు. శుక్రవారం సాయంత్రం స్థల యజమాని ఆదినారాయణతో పాటు ఆయన కుమారుడు వెంకటేశ్వరరావుకు విషయం తెలియడంతో హుటాహుటిన స్థలం వద్దకు చేరుకున్నారు. అసలు పనులు ఎవరి ఆమోదంతో చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల స్థలాలను కార్పొరేషన్ కబ్జా చేయడంతో వెంటనే అధికారులను ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. పనుల గురించి ఏఈ సుబ్రహ్మణ్యాన్ని ఫోన్లో ప్రశ్నించగా స్థానికుల డిమాండ్ మేరకు పనులు జరుగుతున్నాయని పొంతన లేని సమాధానమిచ్చారు. దీంతో విషయాన్ని సర్కిల్-1 ఈఈ ఉదయ్‌కుమార్‌కు వివరించారు. దీంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించిన ఆయన వెంటనే పనులను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి రోడ్డు నిర్మాణంతో పాటు రోడ్డుకు తమ కుటుంబీకుల పేరు పెట్టేందుకు కార్పొరేషన్‌తో పాటు స్థానిక నేతలకు భారీగానే డబ్బు ముట్టచెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. కార్పొరేషన్ అత్యుత్సాహం పశ్చిమంలోని పలు డివిజన్లలో రోడ్డు నిర్మాణం కోసం ఎన్నో ప్రాంతాల వాసులు ఎదురు చూస్తుండగా కార్పొరేషన్ అధికారులు ఈ రోడ్డు నిర్మాణానికే ఎందుకు ఆసక్తి కనబర్చారో ప్రశ్నార్థకంగా మారింది. రోడ్డు నిర్మిస్తున్న స్థలం ప్రైవేట్ వ్యక్తులకు చెందినదేనని కార్పొరేషన్ రికార్డుల్లో ఉన్నప్పటికీ ఎవరి ప్రయోజనాల కోసం రోడ్డు నిర్మిస్తున్నారో వేయి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం కార్పొరేషన్ రోడ్డు ఉన్నంత వరకు గతంలోనే అండర్ గ్రౌండ్ డ్రైయినేజీ పైపులు ఏర్పాటు చేయడమే కాకుండా రోడ్డు చివరి భాగంలో మ్యాన్‌హోల్స్ ఏర్పాటు చేశారు. తాజాగా వందలాది గజాల స్థలాన్ని ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేస్తుండటంతో ప్రయివేటు వ్యక్తుల స్థలాలకు ప్రభుత్వ శాఖల నుంచే ముంపు ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కలికిరిలో ‘ఎర్ర’దొంగలు!
నర్సరీలో ఎర్రచందనం చెట్ల నరికివేత జిల్లా అధికారుల జాబితాలో కలికిరివాసుల పేర్లు {పైవేట్ భూముల్లోనూ చె ట్లు నరికిన వైనం కలికిరి, న్యూస్‌లైన్: సీఎం సొంత మండలమైన కలికిరిలో ఎర్రదొంగలు పడ్డారు. పీలేరు- కలికిరి మార్గమధ్యంలో అటవీశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సామాజిక వనవిభాగం కార్తీకవనంతో పాటు మరికొన్ని ప్రైవేట్ భూముల్లో ఎర్రచందనం చె ట్లు నరికి గుట్టుచప్పుడు కాకుండా తరలించేశారు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం కార్తీకవనంలో నాలుగు చెట్లు నరికారు. వీటిలో రెండు చెట్ల దుంగలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. మరో రెండు చెట్లను నరికి అక్కడే వదిలేశారు. మదనపల్లె మార్గంలోని సాయిరాం డాబాకు వెనుకవైపున ఓ ప్రైవేట్ స్థలంలో ఉన్న ఎర్రచందనం చెట్టును నరికి దుంగలు తీసుకెళ్లారు. ఈ రెండు చోట్లా ఒకేరోజు ఎర్రచందనం చెట్లు నరికి అపహరించుకుపోయినట్లు సమాచారం. దీన్ని బట్టిచూస్తే స్థానికంగా ఉన్నవారే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎర్రావారిపాళెం మండ లం నుంచి కేవీపల్లె మండలం మీదుగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో కలికిరి మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్నట్లు వినికిడి. వారిపేర్లు జిల్లా పోలీస్ యంత్రాంగం వద్ద ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అడవిని వదిలి..పొలాలపై పడ్డారు ఇటీవల అధికారులు విస్తృత దాడులు చేస్తున్నారు. శేషాచలం అడవుల్లో గస్తీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఎర్రచందనం దొంగలు పొలాలు, నర్సరీల వద్ద ఉన్న చెట్లపై పడ్డారు.


