breaking news
printing error
-
ఇంటర్ పరీక్షల్లో గందరగోళం
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష పేపర్ ముద్రణ లోపం విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన రెండో సంవత్సరం ఇంగ్లిష్ పేపర్లో ఈ తప్పులు తీవ్ర గందరగోళం సృష్టించాయి. దీంతో.. విద్యార్థులు 25 నిమిషాల సమయాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది. ఉ.9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, అరగంట తర్వాత గుర్తించిన విద్యార్థులకు ఏం చేయాలో అర్థం కాలేదు. అనంతరం సమస్యను ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లడంతో వారు విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల విభాగం దృష్టికి తీసుకెళ్లారు. వివరాలివీ..ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు బుధవారం ఇంగ్లిష్ పరీక్ష ప్రారంభమైంది. ప్రశ్నపత్రంలోని 8వ ప్రశ్నగా ‘అడ్వరై్టజ్‌మెంట్ చదివి కింద ప్రశ్నలకు సమాధానాలు రాయాలి’ అంటూ ఒక్క మార్కు ప్రశ్నలు ఐదు ఇచ్చారు. అయితే, ప్రశ్నపత్రంలో ఇచ్చిన అడ్వరై్టజ్‌మెంట్ ముద్రణ సరిగ్గా లేకపోవడంతో అందులో ఏముందో ఎవరూ గుర్తించలేని పరిస్థితి తలెత్తింది. పుస్తకంలోని ప్రింట్‌ను ఫొటో తీసుకుని నేరుగా ముద్రించడంతో అక్షరాలు కనిపించక విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వివిధ జిల్లాల్లో అధికారులు ఇది గుర్తించి విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మాస్టర్ ప్రశ్నపత్రాన్ని అన్ని కాలేజీలకు పంపి సమస్యను సరిచేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కనిపించని అంశాలను కొన్నిచోట్ల బోర్డుపై రాసి వివరించగా, మరికొన్ని జిల్లాల్లో ప్రశ్నపత్రంలోని అంశాలను ఇన్విజిలేటర్లు విద్యార్థులకు చదివి వినిపించారు. అలాగే, 13వ ప్రశ్నగా ‘ఫిల్ ఇన్ ది బ్లాంక్స్’ కింద పోస్టాఫీస్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్‌పై అవగాహన కోసం ఇచ్చింది కూడా విత్‌డ్రా ఫారం ఫొటోను ముద్రించడంతో అందులో ఏముందో గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విభాగంలో 10 అర మార్కు ప్రశ్నలు (5 మార్కులు) ఇచ్చారు.ఇలా ఈ రెండు ప్రశ్నల ముద్రణా లోపంతో దాదాపు 25 నిమిషాల సమయం వృధా అయిందని, అదనపు సమయం కూడా ఇవ్వలేదని విద్యార్థులు వాపోయారు. ఇక శనివారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పేపర్‌ను సైతం విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఆలస్యంగా ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. కాగా, ఈ తప్పులపై సమగ్ర విచారణ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ముద్రణ సరిగ్గాలేని రెండు ప్రశ్నలకు సంబంధించి విద్యార్థులందరికీ పూర్తి మార్కులు వేయాలని అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, అధ్యక్షుడు శిఖరం నరహరి, ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. -
ప్రింటింగ్ తప్పు.. వీసా హోల్డర్స్ గుండెల్లో గుబేలు
అసలకే ట్రంప్ ఇచ్చే షాక్‌లతో గుండెలు గుబేలుమంటున్న వీసా హోల్డర్స్ కు, అక్కడి అధికారులు మరో ఝలక్ ఇచ్చారు. వీసా జారీలో తప్పుడు ప్రింటింగ్ వేయడంతో దేశీయ టెక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక్కసారిగాలో గుబులు ప్రారంభమైంది. వీసా ప్రాసెసింగ్ సెంటర్స్ ఆధీనంలో పనిచేసే అమెరికా వీసా ప్రింటింగ్ ప్రెస్, పొరపాటున హెచ్1బీ కు బదులుగా 1బీ1 అని ప్రింట్ చేసింది. చాలామంది వీసాహోల్డర్స్ పిటిషన్లలో హెచ్1బీ బదులుగా 1బీ1ను ఆమోదిస్తున్నట్టు పేర్కొంది. దీంతో అమెరికా ప్రయాణించాలనుకునే వారిలో ఆందోళన ప్రారంభమైంది. హెచ్1బీకి అప్లయి చేస్తే 1బీ1 రావడమేమిటని తలలు పట్టుకున్నారు. ఇటీవలే సస్పెండ్ అయిన ప్రీమియం ప్రాసెసింగ్ ప్రొగ్రామ్ ను రెన్యూవల్ చేపించుకోవడానికి అప్లయి చేసిన విదేశీ పాస్ పోర్టు హోల్డర్స్ ఈ తప్పుడు ప్రింటింగ్ ను గుర్తించారు. వారితో పాటు మిగతా అభ్యర్థులు గుర్తించి, యూఎస్సీఐఎస్ ని సంప్రదించడం ప్రయత్నించారు. కానీ వారు తమ గోడును వినిపించుకోలేదని హెచ్1బీ వీసా హోల్డర్స్ పేర్కొంటున్నారు. వీసా జారీలో తప్పుడు ప్రింటింగ్ వీసా ఆఫీసర్ క్షమించరాని నేరమని, పిటిషనర్ కాని వారి తరుఫున లాయర్ కాని ఫోన్ చేసిన ఎలాంటి స్పందన ఉండట్లేదని మరో వీసా హోల్డర్ ఆవేదన వ్యక్తంచేశారు. 1బీ1 వల్ల అమెరికా వెలుపల ప్రయాణించాలంటే చాలా కష్టమని పేర్కొన్నారు. ఈ తప్పుడు స్టాంపింగ్ తో స్వదేశానికి ప్రయాణించాంటే వీలుపడదని చెప్పారు. ఈ ఏడాది 3న ప్రారంభించిన ఆరు నెలల ప్రీమియం ప్రాసెసింగ్ ప్రొగ్రామ్ ను ట్రంప్ కార్యాలయం సస్పెండ్ చేసింది. హెచ్1బీ వీసాలను దాదాపు 60 శాతం మంది అప్లయి్ చేశారు. మొత్తం లక్షా 20వేల మంది హెచ్1వీసా హోల్డర్స్ అమెరికాలోఉన్నారు. వారిలో ఎక్కువ మంది టెక్ వర్గానికి చెందినవారే.