breaking news
prevents
-
వాంతులను అరికట్టే స్మార్ట్‌వాచ్‌ను.. ఎప్పుడైనా వాడారా!
ఇప్పటి వరకు చాలా స్మార్ట్‌వాచ్‌లు వాడుకలోకి వచ్చాయి. వీటిలో కొన్ని గుండెలయ, రక్తపోటు, శ్వాసతీరు, నిద్రలో ఇబ్బందులు వంటివి ఎప్పటికప్పుడు కనిపెడుతూ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు సమాచారం అందిస్తాయి. తాజాగా అమెరికన్ కంపెనీ ‘ఎమిటెర్మ్’ వాంతులను అరికట్టే యాంటీనాసీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొందరికి బస్సులు, కార్లు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు వికారం మొదలై వాంతులవుతాయి. ఓడల మీద సుదూర ప్రయాణాలు చేసే వారికి, విమానాల్లో ప్రయాణించే వారిలో కొందరికి కూడా ఈ సమస్య ఉంటుంది.మరీ సున్నితమైన వారికి గాలిలో తేడా వచ్చినా, సరిపడని వాసనలు సోకినా వికారం, వాంతులు మొదలవుతాయి. ఇలా మొదలయ్యే వికారం, వాంతుల నివారణకు రకరకాల మందులు వాడుతుంటారు. ఇకపై మందులతో పని లేకుండా ఈ స్మార్ట్ వాచ్ ధరిస్తే చాలు, ఎలాంటి పరిసరాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వికారం, వాంతులు దరిచేరవని తయారీదారులు చెబుతున్నారు. ఈ స్మార్ట్ వాచ్ ‘ఎక్స్ప్లోర్’, ‘ఫ్యాషన్’ అనే రెండు మోడల్స్‌లో దొరుకుతోంది. ‘ఎక్స్ప్లోర్’ మోడల్ ధర 139.99 డాలర్లు (రూ.11,752), ఫ్యాషన్ మోడల్ ధర 86.99 డాలర్లు (రూ.7,302) మాత్రమే!ఈ ప్యాచ్‌ను అతికించుకుంటే చాలు..ఇది బయో వేరబుల్ ప్యాచ్. దీనిని జబ్బ మీద అతికించుకుంటే చాలు, ఒంట్లోని చక్కెర స్థాయి ఎంత ఉందో ఎప్పటికప్పుడు యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్‌కు తెలియజేస్తుంది. దీనిని జబ్బకు తగిలించుకుంటే, ఒంట్లోని చక్కెర స్థాయిని తెలుసుకోవడానికి వేలికి సూది గుచ్చుకుని, నెత్తుటి చుక్కలు బయటకు తీయాల్సిన పనే ఉండదు. బ్రిటిష్ కంపెనీ ‘అబాట్’ ఈ బయో వేరబుల్ ప్యాచ్‌ను ‘లింగో టీఎం’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. డయాబెటిస్తో బాధపడే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ద్వారా చక్కెర స్థాయిలోని హెచ్చుతగ్గులు ఎప్పడికప్పుడు తెలుస్తుండటం వల్ల ఆహార విహారాల్లోను, వైద్యులను సంప్రదించి మందుల మోతాదుల్లోను మార్పులు చేసుకోవడం తేలికవుతుంది. ఇందులోని సెన్సర్‌ను రెండు వారాలకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది. దీని ధర 89 పౌండ్లు (రూ.9,538) మాత్రమే! -
ధర్మం అంటే..? మంచిమాట
ప్రకృతి ఎలా ప్రవర్తించాలి, ప్రాణికోటి ఎలా ప్రవర్తించాలో తెలియజేసేదే ధర్మం. అది మార్పు చెందే ప్రసక్తే ఉండదు. మనిషికి ఆధ్యాత్మికోన్నతి అందించేదే ధర్మం. మానవ ధర్మాల్లో ముఖ్యమైనవి– నిగ్రహం, ప్రేమ, సంతృప్తి, త్యాగం, అలాగే మనిషిని దహింప జేసేవి– అత్యాశ, ద్వేషం, పరదూషణ, పగ. మనిషి ఆధ్యాత్మిక కర్మలను ధర్మబద్ధంగా ఆచరించినప్పుడే తనను, సమాజాన్ని, ఇతరప్రాణుల్ని, ప్రకృతిని, ప్రపంచాన్ని రక్షించగలుగుతాడు. ధర్మం అనేది లేకపోతే పై వాటికి రక్షణ లేదు. మానవునికి ధర్మాచరణ ముఖ్యం, తాను జీవిస్తున్న సమాజ భద్రతకు, తన జీవన క్రమశిక్షణకు మానవుడు విధిగా ఆచరించవలసిన కొన్ని విశేష ధర్మాలను భాగవతం చెప్పింది. సత్యనిష్ఠ, దయాగుణం, తపస్సు, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, త్యాగం, నిజాయితీ, నిష్కపటం, ఓర్పు, వినయం మొదలైనవి ప్రతి వ్యక్తి పాటించవలసిన ఉత్తమ ధర్మాలు. ఇవి వ్యక్తిగతంగా తనకే గాక తాను జీవిస్తున్న సమాజానికి, సర్వమానవాళికి కూడా శ్రేయస్సును కలిగిస్తాయి. మానవులకు, జంతువులకు, వస్తువులకు పరమాత్మ ధర్మాలను నిర్దేశించాడు. వినయం, సహనం, ఆచారం, పరాక్రమం మనిషికి సంస్కారం అందించే సాధనాలు. తనకు నచ్చని అంశాలను పరులమీద రుద్దకుండా చేయటం ధర్మం. తన దారిలో ఎవరి మాట వినకుండా ముందుకు నడవడం అధర్మం. అగ్ని వేడిని, నీరు చల్లదనాన్ని అందిస్తాయి. సింహం గర్జిస్తుంది. అటు ఇటూ పరుగెత్తుతూ చపలత్వాన్ని ప్రదర్శించడం లేడి లక్షణం. ఈ రకంగా ప్రతిదీ తన ధర్మాన్ని పాటింపజేయడం కేవలం పరమాత్మ సృజన. ఆయన సంకల్పం లేనిదే మానవ ధర్మం మృగ్యమే. ప్రతి పనిలో మనిషి అభివృద్ధిని ఆశిస్తాడు. అది సాధించాలంటే కఠోర సాధన అవసరం. సాధనే ధర్మం. అది మనిషిని పతనం కానివ్వకుండా కాపాడుతుంది. ధర్మాచరణ వ్యక్తి మనఃస్థితిని బట్టి ఆధారపడి వుంటుంది. తన వ్యక్తిగత ధర్మాన్ని విడిస్తే అది అభివృద్ధిని నిరోధిస్తుంది. అటువంటి వ్యక్తికి సుఖ సంతోషాలు, శాంతి లభించవు. ప్రతి వ్యక్తి ధర్మాన్ని రక్షించాలి. ప్రతి పనినీ ధర్మబద్ధంగా చేయాలి. ధర్మాచరణను కొనసాగించాలి. ‘ధర్మో రక్షతి రక్షితః’. ధర్మాన్ని ఎవరు రక్షిస్తాడో, అట్టి వ్యక్తిని ధర్మమే కాపాడుతుంది. ధర్మానికి హాని చేసేవాడిని ధర్మమే హతమారుస్తుంది. కొలిమిద్వారా పుట్టిన వేడివల్ల ఇనుము వేడెక్కుతుంది. బంగారం శుద్ధి అవుతుంది. అట్లే ధర్మాచరణ వ్యక్తిని, మనసును శుద్ధిపరుస్తుంది. ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండేలా చేసుకోవాలి గాని అధర్మం చేస్తూ ఇతరులను భయపెట్టకూడదు. ఎంత సంపాదించినా పైకి తీసుకొని పోయేటపుడు కేవలం పాపపుణ్యాలే కాని మణి మాణిక్యాలు కావు. మన తర్వాత ఉన్నవాళ్లు మనం సంపాదించింది తింటారో తినరో వారికే విధంగా విధి రాసి ఉందో తెలియదు. వారికి భగవంతుడే విధంగా తినేప్రాప్తిని రాసి పెట్టాడో వారు అలానే ఉంటారు. కనుక రాబోయే తరాలకు నువ్వు సంపాదించి ఇచ్చే తాపత్రయం పెంచుకోకూడదు. ధర్మం అంటే పరస్పర రక్షణ. దాన్ని ఆచరించి, రక్షించే ఉత్తమ యోగ్యతనీ బాధ్యతనీ మనిషికి భగవంతుడు ప్రసాదించాడు. ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది. అదే ధర్మో రక్షతి రక్షితః. ధర్మం వల్ల అన్నీ సాధ్యమౌతాయి: ధర్మాచరణ వలన అర్థప్రాప్తి, ధర్మాచరణం వల్లనే సుఖం, ధర్మం వల్లనే సమస్తం సాధించవచ్చని ధర్మ సారమే ఈ విశ్వమన్న సత్యం మనకు తెలుస్తోంది. స్వధర్మానికి బాధ కలిగించేది–విధర్మం, ఇతరుల ప్రేరణచే ఇతరుల ధర్మాన్ని ఆచరించేది – పరధర్మం, భగవంతుడి పట్ల విశ్వాసరహితులైన వారు చేసేది, చెప్పేది – ఉపధర్మం. తన «దర్మాన్ని నిర్లక్ష్యం చేయడం, చెప్పబడిన ధర్మానికి విపరీతార్థాలను తీసి వివరించడం అనే అయిదు ‘అధర్మాలు’ త్యజించవలసినవిగా వేదవ్యాసుడు పేర్కొన్నాడు. కరుణ, ఆదర్శ గృహస్థ జీవనం, నిత్యకర్మాచరణ శీలత లోక కల్యాణకార కాలు, భగవద్భక్తి మార్గ నిర్దేశాలు. వీటిని మరవడం మన ధర్మాన్ని మనం మరచిపోవడమేనన్నది సత్యం. – తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
చొరబాటుదారులను తిప్పిపంపిన బీఎస్ఎఫ్
అగర్తల: భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 300 మంది బంగ్లాదేశ్ చొరబాటుదారులను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అడ్డుకొని వెనక్కు పంపింది. త్రిపురలోని ఖోవాయి జిల్లా చాంపాహార్ ప్రాంతం నుంచి శనివారం రాత్రి భారత్ లోకి అక్రమంగా చొరబాడేందుకు యత్నించిన వీరిని తింపి పంపినట్టు బీఎస్ఎఫ్ పోలీస్ కంట్రోల్ ఎస్పీ ఉత్తమ్ బౌమిక్ తెలిపారు. వీరంతా బంగ్లాదేశ్ లోని హబిగంజ్ జిల్లా చునారగడ్ ప్రాంతానికి చెందిన గిరిజనులని, వీరందరికీ ఖోవాయి జిల్లా యంత్రాంగం, బీఎస్ఎఫ్ సిబ్బంది రాత్రి భోజనం ఏర్పాటు చేసి ఉదయం బంగ్లాదేశ్ కు తిప్పిపంపామని ఆయన వెల్లడించారు.