breaking news
Presidential contest
-
Bharat Jodo Yatra: ఎన్నికలప్పుడే చెబుతా
కన్యాకుమారి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు రాహుల్ గాంధీ చేపడతారా లేదా అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. పార్టీ అధ్యక్ష ఎన్నికల సమయంలోనే తాను అధ్యక్షుడిగా ఉంటానా లేదా అన్న విషయం తెలుస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పటికే దీనిపై తాను స్పష్టమైన నిర్ణయం తీసుకున్నానని, ఒకవేళ పోటీలో లేకపోతే దానికి గల కారణాలు కూడా వివరిస్తానని చెప్పారు. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ శుక్రవారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపడతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘‘నేను నా నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయంలో నాకు ఎలాంటి గందరగోళం లేదు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడే నేను అధ్యక్షుడిని అవుతానా లేదా మీకు తెలుస్తుంది. అంతవరకు ఓపిక పట్టండి. ఒకవేళ నేను పోటీలో లేకపోతే అప్పుడు మీ ప్రశ్నలన్నింటికీ జవాబు చెబుతాను’’అని రాహుల్ బదులిచ్చారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పట్నుంచి సోనియా గాంధీయే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. రాజకీయ పోరాటం కాదు ప్రజా సమస్యల్ని తెలుసుకోవడం, వారితో మమేకమవడానికే పాదయాత్ర చేస్తున్నానని రాహుల్ స్పష్టం చేశారు. ‘‘యాత్రయ్యే పూర్తయ్యే సరికి నాపై తనకి అవగాహన పెరుగుతుంది. తెలివితేటలూ కాస్త పెరుగుతాయి’’ అని చమత్కరించారు. కాంగ్రెస్‌కూ ఎంతో కొంత లబ్ధి చేకూరితే మంచిదేనన్నారు. దేశంలో వ్యవస్థలన్నింటినీ బీజేపీ నాశనం చేస్తోందన్నారు. రూ.41 వేల టీ షర్టు రాహుల్ పాదయాత్రపై బీజేపీ విసుర్లు న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ ఖరీదైన టీ షర్ట్ వేసుకున్నారంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. దాని ఖరీదు రూ.41,257 అంటూ శుక్రవారం ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ధరించే ఖరీదైన దుస్తుల మాటేమిటంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ‘‘మోదీ వేసుకునే రూ.10 లక్షల సూట్, రూ.1.5 లక్షల కళ్లద్దాలు గురించి కూడా బీజేపీ మాట్లాడాలి’’ అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జి సుప్రియ ట్వీట్ చేశారు. యాత్రకు లభిస్తున్న స్పందన చూసి బీజేపీ భయపడుతోందని ఆమె ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల ఐక్యతకు దోహదం కన్యాకుమారి: దేశంలో ప్రతిపక్షాల ఐక్యతకు పాదయాత్ర ఉపకరిస్తుందని రాహుల్ గాంధీ మీడియాతో చెప్పారు. ఒకే తాటిపైకి రావడం విపక్షాల బాధ్యతన్నారు. ‘‘కాంగ్రెస్‌తో పాటు ఇందులో ప్రతి పార్టీకి ఇందులో పాత్ర ఉంది. విపక్షాల ఐక్యతపై చర్చలు సాగుతున్నాయి. కొందరు నాయకులు బీజేపీ ఒత్తిళ్లకు లొంగిపోయి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ప్రభుత్వం ప్రయోగిస్తున్న దర్యాప్తు సంస్థలకు భయపడి బీజేపీకి దాసోహమంటున్నారు. పాత్రికేయులు సైతం ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు’’ అని ఆయనన్నారు. -
అజహర్ నామినేషన్ తిరస్కరణ
కోర్టుకెక్కనున్న మాజీ కెప్టెన్! హైదరాబాద్: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్‌కు ఎన్నికలకు ముందే చుక్కెదురైంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అతను వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో అతనిపై నిషేధం తొలగించడానికి సంబంధించి ‘సంతృప్తికర వివరణ’ ఇవ్వకపోవడంతో అజహర్ నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి కె.రాజీవ్ రెడ్డి ప్రకటించారు. ‘తిరస్కరణకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. బీసీసీఐ తనపై నిషేధం ఎత్తివేసిందని రుజువు చేసే పత్రాలేవీ ఆయన ఇవ్వలేకపోయారు. నిషేధం తొలగిస్తున్నట్లు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు మాత్రమే ఆయన చూపించారు. కానీ నేను అదే విషయంలో బీసీసీఐ ఇచ్చిన డాక్యుమెంట్లు అడిగాను. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న క్లబ్లో అజహర్ ఓటింగ్ హక్కు గురించి కూడా స్పష్టత లేకపోవడం మరో కారణం’ అని రాజీవ్ రెడ్డి చెప్పారు. ఈ నెల 17న హెచ్‌సీఏ ఎన్నికలు జరగనున్నాయి. అజహర్ తీవ్ర అసంతృప్తి... తన నామినేషన్‌ను తిరస్కరించడం అంటే లోధా ప్యానెల్ సిఫారసులను వ్యతిరేకిస్తున్నట్లే అని అజహర్ వ్యాఖ్యానించారు. సంక్రాంతి సెలవులు ముగిసిన వెంటనే ఈ అంశంపై కోర్టులో ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. ‘సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మాజీ టెస్టు క్రికెటర్ ఎవరైనా పదవుల కోసం పోటీ పడవచ్చు. నా దరఖాస్తును తిరస్కరించడం గురించి స్పష్టత ఇవ్వమంటూ రిటర్న్ అధికారిని ఎన్ని సార్లు కోరినా ఆయన స్పందించనే లేదు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కేబినెట్ హోదాలో సౌకర్యాలు పొందుతున్న జి.వివేకానంద్‌కు నిబంధనల ప్రకారం అసలు పోటీ పడే అర్హతే లేదు. కానీ ఆయన దరఖాస్తును సరైనదిగా తేల్చారు. భారత మాజీ కెప్టెన్‌తో ఈ రకంగా వ్యవహరించడం దుర్మార్గం. అసలు హెచ్‌సీఏలో మొత్తం ఒక వర్గం కుట్ర జరిపి ప్రజాస్వామ్యవిరుద్ధంగా ఎన్నికలు జరుపుకుంటున్నారు. నేను దీనిపై న్యాయ పోరాటం చేస్తా. ఈ పరిణామాలపై ఇప్పటికే లోధా కమిటీకి లేఖ రాశా’ అని అజహర్ వ్యాఖ్యానించారు.