breaking news
Preservatives
-
కూల్‌డ్రింక్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయా?
కూల్‌డ్రింక్స్‌లో సోడియం బెంజోయేట్ అనే ప్రిజర్వేటివ్ ఉంటుంది. ఇది విటమిన్ ’సి’తో కలిసినప్పుడు క్యాన్సర్ కారకం (కార్సినోజెన్) గా మారుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మానవుల డీఎన్ఏలోని కీలకమైన అంశాలను కూడా ఈ రసాయనం దెబ్బతీస్తుందని కొన్ని బ్రిటిష్ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం వల్ల కలిగే ఫలితాలు వయస్సు పెరగడంతోనూ, అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే దుష్పరిణామాల్లాగానే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ రసాయనం లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్సన్ డిసీజ్లాంటి వాటికి దారితీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఆస్ట్రేలియన్ ప్రభుత్వం సోడియం బెంజోయేట్‌కు బదులుగా కొన్ని హెర్బల్ ప్రిజర్వేటివ్స్ వాడేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని అమెరికన్ కంపెనీలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. మరింత ఆరోగ్యకరమైన ప్రిజర్వేటివ్స్ రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సాధారణ ప్రజలకు, పిల్లలకు కూల్‌డ్రింక్స్‌లో ఈ ప్రిజర్వేటివ్ ఉంటుందనీ, దాన్ని తీసుకోకూడదనే అవగాహన ఉండదు. అందుకే వీలైనంతవరకు కూల్‌డ్రింక్స్‌కు బదులుగా తాజా పళ్లరసాలు, ఇతర ప్రకృతి సిద్ధమైన పానీయాలు తీసుకోవడం మంచిది. ( చదవండి: పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమా..? ) -
బీరు ప్రియులకు శుభవార్త!
ముంబై: బీరు ప్రియులకు శుభవార్త. సంప్రదాయ బీరులో కృత్రిమ రుచులు, ప్రిజర్వేటివ్స్ వాడడం వల్ల అది తాగితే అనారోగ్యం వస్తుందని అందరికీ తెలుసు. దీనికి ప్రత్యామ్నాయం లేక, ఆరోగ్యానికి హానికరమని తెలిసినా బీరు ప్రియులు అదే తాగుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాయి ముంబై, పుణేల్లోని ఆరు చిన్న బీరు పరిశ్రమలు. సంప్రదాయ బీరుకు పోటీగా ‘క్రాఫ్ట్‌బీరు’ పేరుతో సరికొత్త బీరును రంగంలోకి దించాయి. దీన్ని తాగడం ఆరోగ్యానికి హానికరం కాదు..శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. అంతేకాదు సాధారణ బీరు కన్నా ఇది ఎక్కువ నాణ్యతతో, కృత్రిమ రుచులు కలపకుండా సహజసిద్ధంగా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి మాల్ట్, హాప్స్ (బీరు తయారీలో వాడే ఒకరకం పువ్వులు), ఈస్ట్, నీరు వాడతారు. కాబట్టి పోషక విలువలూ ఉంటాయి. సంప్రదాయ బీరు తాగితే అనారోగ్యం వస్తే..క్రాఫ్ట్ బీరు తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇది ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రాలేదు. లెసైన్సులు పొందడం నుంచి మద్యం దుకాణాలకు పంపిణీ వరకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వీటిని అధిగమించి, క్రాఫ్ట్‌బీరుకు ప్రచారం కల్పించే పనిలో తయారీదారులు ఉన్నారు. ఇందుకోసం, శుక్రవారం ప్రపంచ బీరు దినాన్ని పురస్కరించుకుని ముంబైలో శనివారం నుంచి రెండు రోజులపాటు ‘క్రాఫ్ట్‌బీరు వీకెండర్’ పార్టీని నిర్వహిస్తున్నారు. సాధారణ బీరుతో పోలిస్తే క్రాఫ్ట్‌బీరు ధర కాస్త ఎక్కువేననీ, ముడిసరుకుల అధిక ధరలే ఇందుకు కారణమని తయారీదారులు వివరించారు.