ప్రజాదివస్లో ఫిర్యాదుల స్వీకరణ
ఖమ్మం క్రైం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాదివస్ కార్యక్రమాన్ని సోమవారం ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ఆర్. భాస్కరన్ అధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిర్యాదులు చేశారు. వినతిపత్రాలు అందజేశారు. విన్నపాలను క్షుణంగా పరిశీలించిన ఓఎస్డీ విచారణ నిర్వహించి, పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.