breaking news
PKVY
-
రాష్ట్రంలోనే అత్యధికంగా సేంద్రీయ వ్యవసాయం
సాక్షి, అమరావతి: దేశ ంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) కింద అత్యధికంగా సేంద్రీయ వ్యవసాయం కొనసాగుతోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2022–23 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంలో పీకేవీవై కింద అత్యధికంగా 2.06 లక్షల హెక్టార్లలో 2.65 లక్షల మంది రైతులు సేంద్రీయ సాగు చేస్తున్నారని తాజాగా వెల్లడించింది. పీకేవీవై కింద రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.317.21 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత పీకేవీవై కింద అత్యధికంగా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారని తెలిపింది. ఉత్పత్తి నుంచి విక్రయం వరకు మద్దతు.. ఈ పథకం కింద రైతులకు ఉత్పత్తి నుంచి విక్రయం వరకు మద్దతును అందిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రాసెసింగ్ సర్టిఫికేషన్ విధానం ద్వారా మార్కెటింగ్ కోసం అవసరమైన శిక్షణ ఇచ్చి రైతుల్లో సామర్థ్యాలను పెంచుతున్నట్లు పేర్కొంది. ప్రాసెసింగ్‌తో పాటు పంట కోత అనంతరం ఉత్పత్తుల నిర్వహణ, ప్యాకింగ్, మార్కెటింగ్ ఇలా వివిధ అంశాల్లో రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు వివరించింది. క్లస్టర్ విధానంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపింది. పీకేవీవై కింద సేంద్రీయ సాగు చేస్తున్న ఒక్కో రైతుకు హెక్టార్‌కు మూడేళ్లలో రూ.50 వేలు అందిస్తున్నట్టు వెల్లడించింది. ఇందులో ఆర్గానిక్ ఇన్‌ఫుట్‌ల కోసం రూ.31 వేలను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయనున్నట్లు వివరించింది. అలాగే మార్కెటింగ్, ప్యాకేజీ బ్రాండింగ్, విలువ జోడింపునకు రూ.8,800, సర్టిఫికేషన్‌కు రూ.2,700, అవసరమైన శిక్షణ, సామర్థ్యం పెంచేందుకు రూ.7,500 సాయం అందించనున్నట్లు తెలిపింది. సేంద్రీయ వ్యవసాయంలో రాష్ట్రాలను ప్రోత్సహించడానికి పలు చర్యలను చేపట్టామని పేర్కొంది. యూరియా అధిక వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయంగా సేంద్రీయ ఎరువులను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
విదేశాలకు వెళ్లేవారికి నైపుణ్య శిక్షణ
న్యూఢిల్లీ: పని కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన(పీకేవీవై)పథకంలో భాగంగా శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర విదేశాంగ శాఖ, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార కల్పన శాఖల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ పథకంలో భాగంగా విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి నైపుణ్యం మెరుగుపర్చుకునేందుకు శిక్షణ ఇస్తారు. విదేశాలకు పని కోసం వెళ్లే భారతీయులు సరైన నైపుణ్యం లేకపోవడం వల్ల పలు అవమానాలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఈ పరిస్థితి ఎదురవుతుందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. విదేశాల్లో ఉద్యోగాన్ని ఆశించే వారికి ప్రవాసీ కౌశల్ వికాస్ యోజన ఒక మైలురాయి వంటిదని, నైపుణ్యం పెంచుకోవడం వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రతీ ఏడాది పని నిమిత్తం 7 నుంచి 8 లక్షల మంది భారతీయులు విదేశాలకు వెళ్తున్నారని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి ధ్యానేశ్వర్ ములే చెప్పారు. వీరిలో గల్ఫ్‌కు వెళ్లే ఎక్కువ మందికి అక్కడి నిబంధనలు, భాష, సంస్కృతి గురించి సరైన పరిజ్ఞానం ఉండడం లేదన్నారు.