breaking news
Pilli Manikya rao
-
'జూపూడి, కారెం చంద్రబాబుకు దళారీలు'
నెల్లూరు (సెంట్రల్) : ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ కారెం శివాజిలు సీఎం చంద్రబాబుకు దళారులుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. నెల్లూరులోని ఒక హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూపూడి, కారెం శివాజికి ఆ పదవులు ఇవ్వడం అన్యాయమన్నారు. ఎస్సీలలో పుట్టాలని ఎవరూ కోరుకోరు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం ఆయన నియంత పాలనకు నిదర్శనమన్నారు. సీఎం వ్యాఖ్యలకు రాష్ర్ట వ్యాప్తంగా దళితులు నిరసనలు చేపడుతుంటే కారెం, జూపూడిలు బాబుకు వత్తాసు పలకడం దళితులకు ద్రోహం చేయడమేనన్నారు. దళితుల ముసుగులో అగ్రవర్ణాలకు వత్తాసు పలుకుతున్న కారెం శివాజిని ఉన్నతమైన పదవిలో కూర్చోపెట్టడం ఎంత వరకు సబబన్నారు. చంద్రబాబు తీరుకు నిరసనగా వారం రోజుల పాటు ప్రతి మండలంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నెల 23న ప్రభుత్వ కార్యాలయాల ముందు చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేయనున్నట్లు తెలిపారు. -
'నీవు చంద్రబాబు దగ్గర పెద్ద పాలేరు'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబుపై ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు నిప్పులు చెరిగారు. శనివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ రావెల కిషోర్ బాబుకు సూచించారు. ఎమ్మార్పీఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదంటూ మంత్రి రావెలను హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడి వద్ద నీవు పెద్ద పాలేరు అంటూ ఎద్దేవా చేశారు. నీవు చట్టాన్ని గౌరవించేవాడివైతే... నీ కుమారుడిని శిక్షించాలని రావెలకు పిల్లి మాణిక్యరావు హితవు పలికారు. మార్చి పదో తేదీన నారావారిపల్లె నుంచి మాదిగ విశ్వరూప చైతన్య యాత్ర ప్రారంభమవుతోందని ఈ సందర్భంగా మాణిక్యరావు తెలిపారు.