గృహిణిపై అత్యాచారం.. సెల్ఫోన్లో చిత్రీకరణ
హైదరాబాద్ నగర శివారులో దారుణం జరిగింది. దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలోని దొమ్మర పోచంపల్లి సాయిపూజ కాలనీలో ఓ గృహిణి అత్యాచారానికి గురైంది. పరిచయస్తులైన ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చి బలవంతంగా ఆమెను తీసికెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు.
ఆ తర్వాత ఆమె నగ్న దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులైన హఫీజ్‌ఖాన్, అబ్బూ ఫైజల్‌ను అరెస్టు చేశారు.