breaking news
photo collection
-
ఆమె సమరానికి ఆనవాలు
కాలగర్భం నుంచి వెలికి వచ్చిన వెల కట్టలేని విలువైన వజ్రంలాంటి ఆల్బమ్ ఇది. మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి చా...లా సంవత్సరాల ముందు వచ్చిన ఈ బ్లాక్ అండ్ వైట్ ఆల్బమ్ ఎక్కడో అజ్ఞాతంలో ఉండిపోయింది. ఇప్పుడు ఆ అజ్ఞాతవాసాన్ని వీడి తాజాగా ప్రజల మధ్యలోకి వచ్చింది. ప్రసిద్ధ మహిళా నాయకులు కాదు సామాన్య అసామాన్య స్వాతంత్య్రోద్యమ మహిళా నాయకుల విశ్వరూపాన్ని ప్రదర్శించే ఫొటో ఆల్బమ్ ఇది...విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా ముంబైలోని ఒక బ్రిటిష్ దుకాణం ముందు నిలబడి ఉన్న ఫైర్‌బ్రాండ్... లీలావతి మున్షీఉప్పు తయారు చేయడానికి ముంబైలోని సముద్రపు నీటిని తమ ఇళ్లకు తీసుకువెళుతున్న మహిళలు, పిల్లలు.బ్రిటిష్ పోలీసులతో ఢీ అంటే ఢీ అంటున్న మహిళా ఉద్యమకారులురెండు దశాబ్దాల క్రితం లండన్‌లో ఒక ఫొటో ఆల్బమ్‌ను వేలం వేశారు. వేలం పాటలో ఈ ఆల్బమ్‌ను దిల్లీకి చెందిన ఆల్కాజీ ఫౌండేషన్ సొంతం చేసుకుంది. చిన్న సైజ్‌లో ఉన్న ఈ ఆల్బమ్ బూడిద రంగు కవర్‌పై...‘ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కలెక్షన్–కె.ఎల్.నర్పీ’ అని కనిపిస్తుంది.జాతీయ జెండాతో ఉద్యమ బాటలో మహిళలుడ్యూక్ యూనివర్శిటీకి చెందిన ఇద్దరు పరిశోధకులు ప్రత్యేక దృష్టి సారించే వరకు ఈ ఫొటో ఆల్బమ్ అల్కాజీ ఫౌండేషన్‌కే పరిమితం అయింది. పరిశోధకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన ఆల్బమ్ ఇది. స్వాతంత్య్రోద్యమ కాలంలో మహిళల నాయకత్వానికి, ఉద్యమ క్రియాశీలతకు అద్దం పట్టే ఆల్బమ్ ఇది. సహాయ నిరాకరణ ఉద్యమం నాటికి మహిళల పాత్ర పరిమితంగానే ఉండేది. ఆ తరువాత మాత్రం మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎవరికీ తెలియని మహిళా స్వచ్ఛంద సేవకులు ఈ ఆల్బమ్‌లో కనిపిస్తారు. ‘రాట్నం వడకండి’ నివాదంతో మహిళల నేతృత్వంలో ముంబై వీధుల్లో జరిగిన ఊరేగింపుఎంతోమంది మహిళా కార్యకర్తలు తమ చంటి బిడ్డలతో పాటు బ్రిటిష్ వలసవాద వ్యతిరేక పోరాటంలో భాగమైన అరుదైన దృశ్యాలు ఇందులో కనిపిస్తాయి.‘ఉద్యమ స్ఫూర్తికి అద్దం పట్టేలా ఉన్న ఈ ఫొటోలలోని మహిళలను చూసి మేము ముగ్ధులమయ్యాం’ అన్నారు డ్యూక్ విశ్వవిద్యాలయానికి చెందిన సుమతి రామస్వామి. ఆమె తన సహోద్యోగి అవరతి భట్నాగర్‌తో కలిసి ఈ ఆల్బమ్‌ను అధ్యయనం చేశారు.‘ఈ ఆల్బమ్ జాతీయవాద ఉద్యమంలో మహిళల పాత్రను కళ్లకు కట్టడం మాత్రమే కాదు మహిళలు ఇల్లు దాటి ఉద్యమంలోకి అడుగుపెట్టడానికి సంబంధించిన అరుదైన దృశ్యాలకు వేదికగా నిలిచింది’ అంటారు భట్నాగర్.ముంబైలోని చౌపట్టీ బీచ్ దగ్గర ఉప్పు తయారుచేయడానికి సిద్ధం అవుతున్న మహిళలుఒక ఫొటోలో... గుజరాత్ స్వాతంత్య్ర సమరయోధురాలు లీలావతి మున్షీ బ్రిటిష్ ప్రభుత్వ యాజమాన్యంలోని ఉప్పు పాన్‌పై దాడి చేస్తున్న పురుషుల బృందానికి సూచన ఇవ్వడం కనిపిస్తుంది.మరో ఫొటోలో విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా బ్రిటిష్ డిపార్ట్మెంటల్ స్టోర్ ప్రవేశ ద్వారం ముందు మున్షీ ధిక్కారంగా నిలబడి కనిపిస్తుంది.సుమతి రామస్వామి, అవరతి భట్నాగర్ ఈ ఆల్బమ్‌ను ‘ఫొటోగ్రాఫింగ్ సివిల్ డిసొబిడియన్ట్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చారు. అరుదైన ఛాయాచిత్రాలతో పాటు విద్యావేత్తలు రాసిన విలువైన వ్యాసాలు కూడా ఉన్న ఈ పుస్తకం నేటి తరం మహిళలకు మార్గదర్శనం చేసేలా ఉంటుంది. -
మేడారం జాతర అరుదైన ఫోటోలు మీ కోసం....
-
కొత్త పరేషన్
ఆదిలాబాద్ అర్బన్ : కొత్త ఏడాదిలో ప్రజలకు కొత్త కష్టాలు వచ్చి పడేలా ఉన్నాయి. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పేరిట ఈనెల 31లోగా ఆహార భద్రత కార్డులు అర్హులకు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి జిల్లాకు 6,69,554 ఆహార భద్రతా కార్డులు అందాయి. అధికారులు మండలాల వారీగా వాటిని పంపిణీ చేశారు. కాగా, జిల్లాలో 7.57 మంది లబ్ధిదారులు ఆహార భద్రతా కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగతా లక్షా 76 వేలకు పైగా దరఖాస్తుదారులను అనర్హులుగా గుర్తించినట్లు అధికారులు చెప్పకనే చెబుతున్నారు. అయితే.. ఈ ఆహార భద్రతా కార్డుల అలాట్మెంట్లోనే తహశీల్దార్ కార్యాలయ అధికారులు నిమగ్నమయ్యారు. వీటికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో విచారణ పూర్తికాగా.. పట్టణాల్లో ఇంకా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. కొత్త కార్డులు లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 88,500 మంది లబ్ధిదారులకు ఈ కార్డులు అందాయి. కార్డులు అందని కుటుంబాలు జనవరి నెల కోటా సరుకులు ఇప్పుడు తీసుకోవాలని ఆందోళన చెందుతున్నారు. పరేషాన్ ఇలా.. ఆహార భద్రతా కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటింటికీ వెళ్లి అధికారులు విచారణ చేపట్టారు. విచారణ పూర్తై గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. ఆ జాబితాలో ఉన్న వారు రెండు ఫొటోలు డీలర్లకు ఇవ్వాల్సిందిగా సూచించారు. మొన్నటి వరకు విచారణ చేపట్టిన అధికారులు ఆయా డీలర్ల ద్వారా లబ్ధిదారుల ఫొటోలను సేకరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంకా లబ్ధిదారుల ఫొటోల సేకరణే పూర్తి కాలేదు. ఇలా ఫొటోలను సేకరించిన డీలర్లు మండలాల అధికారులకు అందజేస్తారు. ఓ ఫొటోను కొత్త కార్డుపై అతికించి దానిపై కార్యాలయ స్టాంప్ వేయాల్సి ఉంటుంది. కార్డుపై కుటుంబ సభ్యుల పేర్లు రాసి రిజిస్ట్రార్‌లో నమోదు చేసి తహశీల్దార్ సంతకం పెట్టి లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డు అందజేయాల్సి ఉంది. అయితే కొన్ని గ్రామాల్లో ఫొటోల సేకరణ ప్రారంభం కాలేదు. ఇందుకు మరో పదిహేను రోజులు సమయం పట్టవచ్చు. మరోపక్క అధికారులు కొత్త కార్డుల పంపిణీకి సిద్ధమవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 31లోగా లబ్ధిదారులకు ఆహార భద్రతా కార్డులు పంపిణీ చేసినట్లైతే జనవరి మొదటి నుంచి కోటా సరుకులు పొందుతారు. జనవరి 10 వరకు పంపిణీ పూర్తి చేస్తామని, 15 వరకు కోటా సరుకులు తీసుకోవచ్చని, కార్డు అందని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సి అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు.


