breaking news
PG lawcet
-
ఏపీ లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, తిరుపతి: ఏపీ లా సెట్, పీజీ లాసెట్ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. లాసెట్, పీజీ లాసెట్‌లో 98 శాతం ఉత్తీర్ణత సాధించారు. లా సెట్, పీజీ లాసెట్‌లో 20,826 మంది అర్హత సాధించారు. లాసెట్, పీజీ లాసెట్‌లో బాలికలదే పైచేయిగా నిలిచింది. విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్ల, ఐదేళ్ల ఎల్ఎల్బీతో పాటు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 5వ తేదీన ఏపీ లాసెట్-2025 పరీక్షను నిర్వహించారు. 21,251 హాజరైన అభ్యర్థుల్లో 20826 మంది ఉత్తీర్ణత సాధించారు.అత్యధిక మార్కులు సాధించి మొదటి 3 స్థానాల్లో నిలిచిన పీజీ లాసెట్ విద్యార్థులు1. బైసాని హరిత శ్రీ - అద్దంకి(113 మార్కులు)2. యనమల్ల లోకేశ్వరి - వైఎస్సార్ కడప ( 108 మార్కులు)3. కొర్సపాటి ప్రశాంత్ - ఒంగోలు (108 మార్కులు)అత్యధిక మార్కులు సాధించి మొదటి 3 స్థానాల్లో నిలిచిన లాసెట్ ఐదేళ్ల కోర్సు విద్యార్థులు1. పల్లపు గ్రీష్మ - అన్నమయ్య జిల్లా (107 మార్కులు)2. సింగమల్ల భావన - తిరుపతి (107 మార్కులు)3. బత్తుల సూర్య తేజ - నరసరావుపేట (105 మార్కులు)అత్యధిక మార్కులు సాధించి మొదటి 3 స్థానాల్లో నిలిచిన లాసెట్ మూడేళ్ల కోర్సు విద్యార్థులు1. వేముల వెంకట శివ సాయి భార్గవి - అనకాపల్లి (115 మార్కులు)2. ముదునూరి రాంతేజ్ వర్మ హ విశాఖపట్నం (113 మార్కులు)3. పల్నాటి సత్య అంజనా దేవి - ఏలూరు(113 మార్కులు) -
మార్చి 4 నుంచి లాసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లు, ఐదేళ్ల లాసెట్, పీజీ లాసెట్ కోసం వచ్చే నెల 4 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలని లాసెట్ కమిటీ నిర్ణయించింది. సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 28న జారీ చేయనుంది. లాసెట్ కోసం ఎస్సీ, ఎస్టీలు రూ.250, ఇతరులు రూ.350 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్లు, ఐదేళ్ల లాసెట్ మే 27న ఉదయం 10 గంటలకు, పీజీ లాసెట్ అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఉంటుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు మూడేళ్ల లా కోర్సుకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించినట్లు కమిటీ పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5ఏళ్ల సడలింపు ఉంటుంది. ఐదేళ్ల లా కోర్సుకు గరిష్ట వయోపరిమితి 20 ఏళ్లుగా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, లాసెట్ చైర్మన్, కేయూ వీసీ సాయన్న, కన్వీనర్ ఎంవీ రంగారావు పాల్గొన్నారు.