breaking news
Perala chandrasekhar Rao
-
ఆర్టీసీ నిధులు పక్కదారి పడుతున్నాయ్
ప్రభుత్వంపై బీజేపీ ఆరోపణ సాక్షి, హైదరాబాద్: కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో కుమ్ముౖక్కైన ప్రభు త్వం ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల్సిన 60 కోట్లను సివిల్ పనులకు మళ్లించిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. బీజేపీ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ల సమావేశం ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. పేరాలతో పాటు బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. పేరాల మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి నుంచి అభివృద్ధి సెస్ పేరుతో రూపాయిని వసూలు చేస్తున్నారన్నారు. బస్స్టేషన్లలో కుర్చీలు, బెంచీలు, మరుగుదొడ్లు, సీలింగ్ ఫ్యాన్లు, పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లు, రిజర్వేషన్ కౌంటర్లు, క్లోక్రూమ్ల వంటి సదుపాయాలను ఈ సెస్‌తో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. కానీ ఈ నిధులను కమీషన్లు వచ్చే సివిల్ పనులకోసం ఖర్చుచేసిందన్నారు. ఆర్టీఐ చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. -
‘దళితులకు మూడెకరాల భూమి ఏమైంది’
హైదరాబాద్: వ్యవసాయాధారిత దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు పేరాల చంద్రశేఖర్ రావు ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణలో భూ పంపిణీ కనిపించడంలేదని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 3 లక్షలకు ఎకరం చొప్పున కొని, 6లక్షల దాకా చెల్లించినట్లుగా తప్పుడు లెక్కలు రాశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తం చెల్లించినట్టుగా చెప్పి టీఆర్ఎస్ నాయకులే కాజేశారన్నారు. ఈ పథకం అమలుపై సమగ్ర విచరణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.