breaking news
pekatarayullu
-
జోరుగా మూడుముక్కలాట
జనగామ: మూడు ముక్కలాట జిల్లాలో జోరుగా సాగుతుంది. మామిడి తోటలు, ఫాంహౌజ్‌లను పేకాట స్థావరాలుగా ఎంచుకుంటున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు పేకాటకు అంకితమైపోతున్నారు. సంపాదనంతా తగలేస్తూ కుటుంబాలను ఆగం చేసుకుంటున్నారు. రోజుకు రూ. ఐదు లక్షల రూపాయల వరకు చేతులు మారుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా కేంద్రం శివారుతో పాటు లింగాలఘనపురం, నర్మెట, బచ్చన్నపేట, రఘునాథపల్లి తదితర ప్రాంతాల్లో ప్రతి రోజు పేకాట రాయుళ్లు హల్చల్ చేస్తున్నారు. మూడు జిల్లాల సరిహద్దులో ఉన్న గ్రామాల్లో ఆయా జిల్లాలకు చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి పేకాటను జోరుగా సాగిస్తు న్నారనే ప్రచారం జరుగుతోంది. రోజుకు రూ.మూడు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది. ఫాంహౌజులతో పాటు ఆయా ప్రాంతాల్లోని ఫారెస్ట్లు, వ్యవసాయ క్షేత్రాలను స్థావరాలుగా మార్చుకుం టున్నారు. ఒక్కో ప్రదేశంలో పది నుంచి ఇరవై మంది సభ్యుల వరకు పేకాట ఆడుతున్నట్లు సమాచారం. ఆదివారంతో పాటు ఇతర సెలవురోజుల్లో ఈ ఆట రెండింతలుగా పెరుగుతుంది. తెల్లవార్లూ... సర్కారు కొలువుకు వెళ్లినట్టుగా రోజు వారీగా పేకాట రాయు ళ్లు ముందుగా ఎంచుకున్న రహస్య ప్రదేశాలకు చేరుకుంటున్నారు. అర్ధరాత్రి, అవసరమైతే తెల్లవార్లు మూడు ముక్కలు, రమ్మీ ఆడేస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. పేకాట ఆడే ప్రదేశంలోకి పోలీసులు వెళ్లే ప్రయత్నం చేస్తే ముందుగానే గుర్తించి సమాచారం అందించేందుకు ప్రైవేట్‌గా రెండంచెల భద్రతను మెయింటేన్ చేస్తుండడం గమనార్హం. కొంత మంది బడా బాబులు ఈ ఆటలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పలువురు వ్యక్తులు పోలీసులు, గ్రామస్తులకు అనుమానం రాకుండా స్థావరాలను మారుçస్తూ పేకాట జోరును కొనసాగిస్తున్నారు. జిల్లా పోలీసులు పేకాట స్థావరాలపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా ఆట మాత్రం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. రోడ్డున పడుతున్న కుటుంబాలు.. సరదా కోసం పేకాటను అలవాటుగా మార్చుకుంటున్న చాలా మంది లక్షలకు లక్షలు పోగొట్టుకుని కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. పేకాట మానుకోవాలని గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఈ ఊబిలోకి కొత్తవారిని సైతం ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. మూడు ముళ్ల బంధం... ఏడడుగులు నడిచి తన వెంట వచ్చిన భార్య మెడలోని మంగళ సూత్రాలను సైతం తాకట్టు పెట్టేస్తూ.. జల్సా చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. పుస్తెల తాళ్లు తాకట్టు పెట్టి... పేకాటలో వడ్డీ వ్యాపారస్తుల హవా కొనసాగుతుంది. ఆటలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులకు అప్పురూపంలో ఇచ్చేందుకు కొత్త వడ్డీవ్యాపారులు పుట్టుకొస్తున్నారు. కొన్నిచోట్ల భర్తలు భార్య మెడలోని పుస్తుల తాళ్లను సైతం తాకట్టు పెడుతూ కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారని తెలుస్తుంది. వడ్డీ రూపంలో వచ్చిన డబ్బులను ఇంటికి తీసుకెళ్లకుండా సదరు వ్యాపారులు.. నిర్వాహకులు ఆట మధ్యలో వెళ్లకుండా అడ్డుకుంటున్నారనే చర్చించుకుంటున్నారు. అప్పు తీసుకున్న పాపానికి పేకాట ఆడుతూ రెంటికీ చెడ్డ రేవడిగా మారుతున్నారు. పేకాటపై ఉక్కుపాదం జిల్లాలో పేకాటపై ఉక్కుపాదం మోపుతున్నాం. ప్రతి నిత్యం దాడులు కొనసాగిస్తూనే ఉన్నాం. పేకాట రాయుళ్లపై ఎవరు సమాచారం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. జిల్లాలో ఇటీవల అనేక చోట్ల పేకాటరాయుళ్లను పట్టుకుని కేసులు నమోదు చేసి డబ్బులను కోర్టుకు అప్పగించాం. ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. -
బతుకు మూడు ముక్కలు
సదాశివపేట(సంగారెడ్డి): కాయ్‌రాజా కాయ్ కాస్తేవుంది చూస్తే లేదు, ముడు ముక్కలాట... మూడాసులు తిప్పు, ఒకటికి మూడు రెట్లు.. స్వర్గానికి లే మెట్లు క్షణంలో సగంలో నువ్వు కుబేరుడివి. కనురేప్పపాటులో కుచేలుడివి.. అమాంతం కురిసిన రాత్రి కవితా సంపుటిలో బాల గంగాధర్ తిలక్ జూదం గురించి రాసిన ఓ కవిత, సదాశివపేట పట్టణ మండల పరిధిలో అచ్చు అలాగే ఉంది మరి, ముక్క కలిస్తే అదష్టం తమదేనని ఆశపడుతున్నారు. కానీ అది తిరగబడి చాలా మంది కుచేలులుగా మారుతున్నారు. అప్పుల పాలై వాటిని తీర్చే దారిలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. వ్యవసాయదారులు, ప్రజాప్రతినిధులు, పరిశ్రమల్లో పరిచేస్తున్న కార్మికులు, వ్యాపారులు, దినసరి కూలీలు పేకాట మత్తులో మునిగిపోయారు. రాములు (పేరు మార్చాం) రోజువారీ కూలీ రెండు రోజులు పనికెళ్తే ఓ ఆరువందల రూపాయలు సంపాదిస్తాడు. కానీ అలా వచ్చిన డబ్బుతో కుటుంబ అవసరాలను తీర్చకుండా మూడు ముక్కలాట(పేకాట) ఆడతాడు. సంపాదించిన సోమ్ము ఇలా తగలబెట్టడం.. తిరిగి తెలిసిన వారి వద్ద అప్పులు చేయడమే అతని నిత్యకత్యం అయింది. రోజులు గడుస్తున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి. స్థోమతకు మించి చేసిన అప్పులు తీర్చలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. కట్టుకున్న భార్య పిల్లలు ఇప్పుడు దిక్కులేని వారిగా మిగిలారు. ఇలా సదాశివపేట ప్రాంతంలో పేకాట కారణంగా ముక్కలవుతున్న కుటుంబాల ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ ఈ జూదానికి అడ్డుపడడం లేదు. సదాశివపేట ప్రాంతంలో పేకాట సంస్కృతి జడలు విప్పింది. ఎక్కడపడితే అక్కడ ఇళ్లు, ఫంక్షన్‌హాళ్లు, బహిరంగ ప్రదేశాలు, వాటర్ ప్లాంట్లులో నిత్యం పేకాట కొనసాగుతుంది, పోలీసులకు మాత్రం తెలిసిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. జూదమే ధ్యాస.. నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పలువురు యువకులు జూదానికి బానిసవుతున్నారు. పనికేళ్లి కష్టపడి సంపాదించినదంతా ఈ పేకాటలో పోగొట్టుకోవడం వీరికి అలవాటైంది. మద్యం మత్తు ఆపై పేకాట ఆడటం ఇదే ఈ ప్రాంతంలో కొందరి వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు, యువకుల జీవనశైలిగా మారింది. ముఖ్యంగా సదాశివపేట పట్టణ మండల పరిధిలోని వ్యవసాయ మార్కెట్, వివిధ పార్టీ కార్యాలయాలు, వాటర్ప్లాంట్లు, ఫంక్షన్ హాళ్లు, ఇళ్లు కేంద్రాలుగా మారాయి. జూదానికి బానిసైన వారు అన్న నీళ్లు మరచి మరీ గంటల తరబడి పేకాటలో నిమగ్నమౌతూ కుటుంబాలను పట్టించుకోని పరిస్థితి. ఇంతేకాదు పేకాటలో డబ్బుల విషయమై ఘర్షణలు తలెత్తడం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఇక్కడ పారిపాటిగా మారింది. నడిబొడ్డు నుంచి నట్టింటి వరకు.. సదాశివపేట పట్టణంలోని నడిబోడ్డు నుంచి నట్టింటి వరకు ఈ పేకాట సంస్కృతి విస్తరించుకుపోతుంది. సదాశివపేట పట్టణంలోని వివిధ పార్టీ కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్లు, ఇళ్లలలో కొందరు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పేకాట అడడం విశేషం, సదాశివపేట పట్టణ మండల పరిధిలోని పార్టీ కార్యాలచయాలు, వ్యవసాయా మార్కెట్, ఫంక్షన్ హళ్లు, ఫాంహౌజ్‌లు, వాటర్ప్లాంటుతో పాటు వెల్టూర్ గ్రామానికి వేళ్లు మార్గంలోగల పాంహౌజ్లు, దర్గాల సమీపంతో పాటు, నివాస గృహాలు, వ్యవసాయ పంటపోలాల్లోని చెట్లకింద, ఫంక్షన్ హాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో చాలా ప్రాంతాల్లో నిత్యం పేకాట జోరుగా సాగుతుంది. మొక్కుబడిగా దాడులు.. జూదం అడ్డాలు పట్టణ, మండల పరిధిలో ఎక్కడెక్కడ ఉన్నాయో పోలీసులకు తెలుసు అందువల్లనే పత్రికల్లో వచ్చిన మరుసటి రోజు మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తున్న ఎవరిని పట్టుకోలేక పోతున్నారు. ‘‘దాడుల సమయంలో గతంలో మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామంలో పట్టుబడిన జూదరులు పోలీసులకు ఎదురుతిరగడంతో పాటు మీ డీఎస్పీతో మాట్లాడాలా, మీ సీఐతో మాట్లాడాలా అసలు మీకు ఎవరు ఫిర్యాదు చేశారు వారి పేరు చెప్పండి అంటూ ఎదురు తిరగడంతో పోలీసులు వెనుదిరిగి వచ్చాని సంఘటనలు ఉన్నాయి’’. అందువల్ల అధికార పార్టీనేతలు బెదిరింపులు చేయడం వల్ల పోలీసు సిబ్బంది పేకాట విషయంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. దాడులు చేయాగానే ప్రజాప్రతినిధుల ఫోన్లు రావడంతో పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లక్షలు పోగొట్టుకున్నారు.. సదాశివపేట పట్టణంలోని సబ్‌స్టేషన్ ఎదురుగా గల గల్లిలోని ఓ ఇంట్లో గత రెండు నెలల పాటు ఓ టీఆర్ఎస్ నాయకుని అండదండలతో పాటు కొనసాగిన పేకాటలో పట్టణానికి చేందిన దాదాపు 20 మంది 1లక్ష నుంచి 15 లక్షల వరకు పేకాటాలో పోగొట్టుకున్నట్లు సమాచారం. అక్కడ ప్రతీ రోజు ఉదయం నుంచి అర్థరాత్రి వరకు నిత్యం పేకాట కొనసాగినట్లు తెలుస్తుంది. ఉదయ నుంచి రాత్రి వరకు మద్యం, మాంసం వంటకాలు చేయించి వడ్డించినట్లు సమాచారం. కళ్లెం వేయరు.. కన్నీరు తుడవరు పేకాట ఆడుతున్న వ్యక్తులు మద్యం తాగడంతోపాటు దాడులు చేసుకుంటుండంతో సమీపంలో ఉండే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు పడుతున్న వేదన వర్ణనాతీతం తమ కుటుంబాలకు చేందినవారే కళ్లేదుట పేకాట ఆడుతుండటం ఇదేమని ప్రశ్నిస్తేంటే ఆటలో ఉన్న వ్యక్తులు బెదిరిస్తున్నారని కన్నీళ్ల పర్యవంతమౌతున్నారు. కొన్ని ఇళ్లల్లో అర్ధరాత్రి వరకు నిత్యం పేకాట అడూండ అదుపూ లేకుండా పోతుందని ప్రజలు మండిపడుతున్నారు. పేకాటకు అడ్డుకట్ట వేసి కుటుంబాలు ఛిద్రం కాకుండా చూడాలని ప్రజలు కొరుతున్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు.. పట్టణ మండల పరిధిలో పేకాట ఆడితే చట్టపరంగా కేసులు నమోదు చేసి చట్టపరంగ చర్యలు తీసుకుంటాం. పేకాట అడితే ఎంతటి వారినైన వదలబోమని రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులైన సరై వదిలివేసే ప్రసక్తి ఉండదన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తి లేదని హెచ్చరించారు. పేకాట ఆడుతున్న స్థావరాలను ఇప్పటికే గుర్తించడం జరిగిందని అదును చూసి దాడిచేసి అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పేకాట ఆడుతున్న వారి గురించి ప్రజలేవరైన సమాచార మిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. – సీఐ సురేందర్‌రెడ్డి -
పేకాట క్లబ్‌లపై మెరుపుదాడులు
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని పేకట క్లబ్‌లపై పోలీసులు ఒక్కసారిగా మెరుపు దాడులు చేయడంతో పేకాటరాయుళ్లు ఉలిక్కిపడ్డారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమవరంలోని టౌన్ హాళ్లు, కాస్మోపాలిటీన్ క్లబ్, యూత్ క్లబ్‌లపై పోలీసు బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. పెద్దఎత్తున పేకాట శిభిరాలు జరుగుతున్నాయనే సమాచారంతో దాడి చేసిన పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. వీకెండ్ కావడంతో పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, రాజమండ్రి, ఖమ్మం వంటి అనేక ప్రాంతాల్లో క్లబ్‌లు లేకపోవడంతో ఇక్కడికి వచ్చిన పేకాటరాయుళ్లకు పోలీసుల మెరుపు దాడులు ముచ్చెమటలు పట్టించాయి. పెద్ద ఎత్తున నగదు పట్టుబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
25 మంది ప్రముఖుల అరెస్ట్
హైదరాబాద్/ఒంగోలు: పేకాటరాయుళ్లపై పోలీసులు కొరడా ఝళిపించారు. రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ బాలాపూర్ లో పేకాట స్థావరాలపై బుధవారం ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 25 మంది ప్రముఖులు ఉన్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లాలోనూ పేకాటరాయుళ్ల పని పట్టారు పోలీసులు. ముండ్లమూయ మండలం ఉల్లగల్లు గ్రామ శివారులో పేకాట శిబిరాలపై పోలీసులు దాడి చేశారు. 11,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. సంతమాగులూరు మండలంలోనూ 8 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నారు.