breaking news
Peddemul zone
-
అంగన్వాడీలో చిన్నారిపై అత్యాచారం..
సాక్షి, వికారాబాద్: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి ఉరిశిక్ష పడ్డ తర్వాతనైనా మానవ మృగాలలో మార్పు వస్తుందనుకుంటే అలా జరగడం లేదు. తాజాగా హన్మకొండ ప్రవీణ్ మాదిరే ఓ యువకుడు చిన్నారిపై అకృత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్లో చోటు చేసుకుంది. పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంగన్వాడీలో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై సోమవారం గుర్తు తెలియని వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మేకపిల్లలా.. మజాకా!
చిత్రం చూశారా..? రెండు మేక పిల్లలు ఆడుతూ.. ఆడుతూ.. ఓ ఇంటిలోపలి నుంచి బయటికి వచ్చిన దూలంపై ఒకటి.. మరో దూలంపై ఇంకొకటి ఎక్కి అదరకా.. బెదరకా.. అట్టే నిల్చున్నాయి. ఈ దృశ్యం ఆదివారం పెద్దేముల్ మండలం మంబాపూర్లో ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. - పెద్దేముల్