ఇసుక దిన్నెలు పడి కూలీ మృతి
హిందూపురం రూరల్: సంజీవరాయనిపల్లి వద్ద పెన్నానదిలో బుధవారం ఇసుక లోడు చేస్తుండగా దిన్నెలు మీదపడి పెద్దప్పయ్య (45) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందా డు. మృతుడు పరిగి మండలం నరసాపురానికి చెందిన వాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.