breaking news
PAT down
-
65శాతం తగ్గిన ఎయిర్టెల్ లాభాలు : అయినా ఓకే
సాక్షి, ముంబై: టెలికాం కంపెనీ భారతి ఎయిర్టెల్ క్యూ2 ఫలితాల్లో మార్కెట్ వర్గాలను మెప్పించింది. ముఖ్యంగా మార్కెట్ లోని పోటీ వాతావరనం, ఇంధన ధరల కారణంగా ఎయిర్‌టెల్‌కు భారీ నష్టం తప్పదని అంచనా వేసింది. వార్షిక ప్రతిపాదికన 65 శాతం క్షీణించి 119కోట్లు నికర లాభాలకు పరిమితమైంది. దాదాపు 800 కోట్ల రూపాయల మేర ఎయిర్టెల్ నష్టపోనుందని ఎనలిస్టులు భావించారు. ఆదాయం కూడా 6.2 శాతం క్షీణించి 20,442 కోట్లను సాధించింది. వాల్యూమ్ గ్రోత్ కూడా మెరుగ్గా నమోదు చేసింది. ఏఆర్పీయూ (యావరేజ్ రెవన్యూ పెర్ యూజర్) కూడా అంచనాలను మించి నమోదు కావడం ఎయిర్‌టెల్‌కు అనుకూలం అంశమని విశ్లేషకులు అంటున్నారు. ఇది 28.80 క్షీణించి 101 రూపాయలుగా నిలిచింది. ఉంది. ఇది గత ఏడాది 142గా ఉంది. జియో ఎంట్రీతో ఆర్‌పీయూ మరింత దిగజారుతుందని మార్కెట్‌వర్గాలు అంచనా వేశాయి. అలాగే గత సరసమైన ధరలు కంటెంట్ పార్టనర్షిప్ల ద్వారా నాణ్యమైన కస్టమర్లపై దృష్టి సారించామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విటల్ అన్నారు. ఏఆర్పీయూ క్షీణత ఈ త్రైమాసికానికి మితంగా ఉందని తెలిపారు. మరోవైపు భారీ నష్టాలతో ముగిసిన ఇవాల్టి ఈక్విటీ మార్కెట్లో భారతి ఎయిర్టెల్ 6.28శాతం నష్టపోయింది. -
క్షీణించిన టైటాన్ లాభాలు
ముంబై: టాటా గ్రూపునకు చెందిన టైటాన్ కో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్) ఫలితాలు విడుదల చేసింది. జ్యువెలరీ, వాచీల దిగ్గజం టైటన్ కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 16.34 శాతం గా క్షీణించి రూ. 127 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2015-16) క్యూ1లో రూ.151.45 కోట్ల నికర లాభం ఆర్జించింది. పసిడి ధరలు పెరగడం, ఉద్యోగులకు వీఆర్ఎస్ వంటి కారణాలతో రూ. 97 కోట్లమేర అనూహ్య నష్టాలు వాటిల్లడంతో లాభాలు ప్రభావితమైనట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సంవత్సరం కొన్ని ప్రతికూల అంశాలు దెబ్బతీసినప్పటికీ, బాటం లైన్ పెర్స్పెక్టివ్ లో మొదటి త్రైమాసికం బావుందని టైటాన్ కో మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ భట్ చెప్పారు. అయితే ఆదాయం మాత్రం పుంజుకుంది. నికర అమ్మకాల్లో 7.56 శాతం వృద్ధిని సాధించి రూ. 2,782.5 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గత ఏడాది ఇది రూ. 2,586.76 కోట్లుగా ఉంది. జ్యువె ల్లరీ విభాగం ఆదాయం రూ. 2,138.32 కోట్లు కాగా, వాచెస్ విభాగంలో రూ. 491.72 కోట్లు ఆర్జించింది. నిర్వహణ లాభం(ఇబిటా) 32 శాతం ఎగసి రూ. 292 కోట్లుగా నమోదైంది. కాగా జీఎస్టీ బిల్లుపై అంచనాలనేపథ్యంలో బుధవారం ఈ షేర్ పతనమైంది. ట్రేడింగ్ ముగిసేసరికి బీఎస్ఈలో టైటన్ షేరు దాదాపు 3 శాతం పతనమై రూ. 411 దగ్గర ముగిసింది.