breaking news
Parishad Office
-
అవినీతి రహిత జెడ్పీగా తీర్చిదిద్దుతా
- సమర్ధుడైన అధ్యక్షునిగా పనిచేస్తా - జిల్లాలో టీడీపీ పరిస్థితి బాగాలేదు - విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్మన్ ఈదర ఒంగోలు సబర్బన్ : అవినీతి రహిత జిల్లా పరిషత్గా తీర్చిదిద్దుతానని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ ప్రణాళిక వివరించారు. జెడ్పీలో అవినీతి పేరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రత్యేక ప్రణాళితో ముందుకు వెళ్ళేందుకు సిదంధమైనట్లు వెల్లడించారు. తాను సమర్థుడైన అధ్యక్షునిగా పనిచేసి పేరు నిలబెట్టుకుంటానన్నారు. తాను నిజాయితీగా పనిచేస్తే తన వద్ద పనిచేసే అధికారులు కూడా నిజాయితీగా పనిచేస్తారన్నారు. అందరూ తనకు సహకరించాలని విజ్ఙప్తి చేశారు. జిల్లా రాజకీయ సంక్షోభంలో ఉందని, దీనివల్ల అభివృద్ధిలో కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఖర్చుచేసే ప్రతి రూపాయికి అకౌంట్‌బిలిటీ ఉండేవిధంగా చర్యలు చేపడతానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపార్టీలో ఉన్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు టీడీపీ నాది...ఆ పార్టీలోనే ఉన్నానని సమాధానమిచ్చారు. మరి పార్టీ అధ్యక్షుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారుకదా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పార్టీని స్థాపించిన అన్న ఎన్‌టిఆర్‌ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, అయితే ప్రస్తుతం ఆయన ఫోటోతోనే పార్టీ నడుస్తుందని గుర్తు చేశారు. జిల్లాలో టీడీపీ పరిస్థితి బాగాలేదని, అయితే పార్టీని బతికించుకుంటానని అన్నారు. అన్ని విషయాలను త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తన ఫోటోలతో ఫ్లెక్సీలు వేయొద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. బొకేలకు, పూలదండలకు కూడా దూరంగా ఉంటున్నానని వివరించారు. తాను తప్పు చేసినా వెనకాడకుండా పత్రికలు, మీడియా క చ్చితంగా వెలుగులోకి తీవాలన్నారు. -
అన్ని వేళలా అందుబాటులో ఉంటా
సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తోటపల్లిగూడూరు : నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అర్ధరాత్రయినా స్పందిస్తానని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్రాను. తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం ఓ సేవకునిలా పని చేస్తానన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకాణి మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు, సలహాలను అందించారు. నియోజకవర్గ ప్రజలు ఏ కష్టం వచ్చినా ఏ రాత్రయినా సరే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందిస్తానని, సమస్య ఉన్న ఎవరైనా తన సహాయం కోరవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పని చేస్తానన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని ఇక రాజకీయాలు అవసరం లేదని, అధికారులు, ఇతర పార్టీ నేతల సూచనలు, సలహాలు ఇస్తే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మండల పరిషత్ నిధులు, ఎమ్యెల్యే నిధులు, జిల్లా పరిషత్ నిధులతో నియోజక అభివృద్ధికి పాడుపడతానన్నారు. నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటువుతున్న పరిశ్రమల యాజమాన్యాల సహకారంతో ప్రగతి బాట పట్టిస్తానని కాకాణి ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్వోగులు కూడా ప్రజల సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గాని అభివృద్ధిలో గాని అధికారులకు ఎలాంటి ఒత్తిడిలు ఉన్నా, ఇబ్బందులు ఎదురైనా నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులు పెట్టాలనే ఆలోచన చేయొద్దన్నారు. పలుశాఖల అధికారులను సుతిమెత్తగా మందలించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టిగా పని చేస్తేనే అభివృద్ధి నల్లేరుమీద నడకలా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు చిల్లకూరు సుధీర్‌రెడ్డి, మండల కన్వీనర్ టంగుటూరు పద్మనాభరెడ్డి, మండల ప్రత్యేకాధికారి రవిచంద్రప్రసాద్, తహశీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ సావిత్రమ్మ, జెడ్పీటీసీ సభ్యులు మన్నెం చిరంజీవిగౌడ్, మండల పరిషత్ ఉపాధ్యక్షరాలు చెరుకూరు సరళకుమారి, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.