breaking news
Paramour relation ship
-
ఆ అఫైర్ అధికార దుర్వినియోగం కాదు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, వైట్‌హౌస్ తాత్కాలిక ఉద్యోగిని మోనికా లూయిన్‌స్కీ వివాహేతర సంబంధంపై క్లింటన్ భార్య హిల్లరీ స్పందించారు. క్లింటన్–లూయిన్స్కీల అఫైర్ అధికార దుర్వినియోగం కిందకు రాదని హిల్లరీ అభిప్రాయపడ్డారు. వివాహేతర సంబంధంపై కోర్టుకు అబద్ధం చెప్పినందుకు క్లింటన్‌ను అభిశంసన చేసి ఉండాల్సిందన్న వాదననూ హిల్లరీ ఖండించారు. ‘మీ టూ’ ఉద్యమం నేపథ్యంలో న్యూయార్క్ సెనెటర్ క్రిస్టెన్ గిల్లిబ్రాండ్ మాట్లాడుతూ.. ‘ అఫైర్ లేదని అబద్ధం చెప్పినందుకు హౌ స్ జ్యూడీషియరీ కమిటీ క్లింటన్‌ను అభిశంసించింది. అప్పుడే క్లింటన్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని ఉండాల్సింది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య లపై హిల్లరీ స్పందించారు. ‘ అఫైర్ అనేది అధ్యక్షుడి అధికార దుర్వినియోగం కిందకు రాదు. క్లింటన్–లూయిన్స్కీల మధ్య శారీరక సంబంధం ఏర్పడేనాటికి ఆమె వయసు 22 సంవత్సరాలు. అప్పటికే ఆమె వయోజనురాలు. ఈ వ్యవహారంలో వాస్తవాన్ని సెనెట్ అప్పుడే తేల్చింది’ అని వ్యాఖ్యానించారు. -
తల్లీకూతుళ్లపై కన్నేసిన దుర్మార్గుడు
► రుణం ఇప్పిస్తానంటూ తల్లితో వివాహేతర సంబంధం ► ఆపై కుమార్తెపై కన్నేసిన దుర్మార్గుడు ► వద్దన్నందుకు తల్లినే కాటికి పంపిన హంతకుడు ► తరువాత కుమార్తెను లాడ్జిలో బంధించి చిత్రహింసలు ► ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కి... హిందూపురం అర్బన్ : ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఆమె కూతురిపై కన్నేసిన కామాంధుడు అది కాస్తా బెడిసి కొట్టడంతో ఉన్మాదిగా మారాడు. తల్లిని మట్టుబెట్టి.. కూతురినీ హింసించాడు. అంతటితో ఆగక ఆమెనూ అంతమొందించేందుకు ప్రయత్నించి చివరకు హిందూపురం పోలీసులకు చిక్కాడు. అనంతపురం అశోక్‌నగర్‌కు చెందిన మాబున్నీ(47) భర్త చనిపోయాడు. ఆమె పెద్దకుమార్తె అనంతపురంలోని హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతుండగా, రెండో కుమార్తె బత్తలపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఒంటరిగా నివసిస్తున్న మాబున్నీకు బ్యాంక్ రుణాలు ఇప్పిస్తానంటూ రామకృష్ణ అలియాస్ బాబు పరిచయమయ్యాడు. వారి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ చదువుతున్న పెద్ద కుమార్తెపై కన్నేసిన అతను, మాబున్నీపై ఒత్తిడి పెంచాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఈ విషయమై ఆమెతో ఈ నెల 15న రాత్రి గొడవపడి, కర్రతో తలపై బలంగా కొట్టి, రక్తపు మడుగులో పడి ఉన్న మాబున్నీను పట్టించుకోకుండా ఇంటికి తాళం వేసుకుని అనంతపురానికి చేరుకున్నాడు. హాస్టల్ల్ ఉంటున్న ఆమె కుమార్తె వద్దకు చేరుకుని మీ అమ్మకు సీరియస్‌గా ఉండడంతో బెంగళూరు ఆస్పత్రిలో చేర్పించినట్లు నమ్మబలికి అదే రాత్రి ఆమెను హిందూపురానికి పిలుచుకెళ్లాడు. ఉదయాన్నే బెంగళూరుకు వెళ్తామని చెప్పి సాయితేజ లాడ్జిలో గది తీసుకున్నాడు. రిజిస్టర్ బుక్‌లో ‘బాబు, రొద్దం’ అని తప్పుడు చిరునామా రాయించాడు. ఆ రాత్రే సదరు యువతిని అతను శారీరకంగా హింసించి గాయపర్చాడు. ‘నా మాట వినకపోవడంతో మీ అమ్మను చంపేశా. ఇప్పుడు నీకూ అదే గతి పడుతుంది’ అంటూ బెదిరించాడు. దీంతో ఆమె తిరగబడింది. నేరం ఎక్కడ బయటపడుతుందోనని ఆమెను బాత్రూంలోకి తీసుకెళ్లి చున్నీతో గొంతు బిగించాడు. ఊపిరాడకఅపస్మారస్థితిలో పడిపోయిన ఆమెను చనిపోయిందని భావించి గదికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. మరుసటి రోజు సాయంత్రం దాకా గది తలుపులు తెరవకపోవడంతో అనుమానంతో లాడ్జి నిర్వాహకులు తలుపులు తీసి చూడగా యువతి బాత్రూంలో ఆపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు. ఆమె కోలుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. పోలీసుల అదుపులో నిందితుడు నిందితుడు రామకృష్ణ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు తాళం వేసి ఉన్న ఇంటిలో యువతి తల్లి మాబున్నీ మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. యువతి తల్లి గురించి అన్ని వివరాలు సేకరించారు. మాబున్నీ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలకు వెళ్లి పరిశీలించారు. నిర్జీవంగా పడి ఉన్న మాబున్నీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ కేసులో నిందితుడు రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.