breaking news
Para Powerlifting
-
ఝండూ పవర్
గ్లాస్గో: పారా పవర్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకంతో బోణీ చేస్తూ కామన్వెల్త్ క్రీడల పతకాల జాబితాలో భారత్ కూడా చేరింది. పురుషుల హెవీ వెయిట్ కేటగిరీలో భారత్‌కు చెందిన ఝండూ కుమార్ కాంస్యం (130.9 పాయింట్లు) సొంతం చేసుకున్నాడు. ఈ పోటిల్లో భారత్‌కు ఇదే తొలి పతకం తన రెండో ప్రయత్నంలో 190 కేజీల బరువెత్తి ఝండూ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. మొదటి ప్రయత్నంలో 181 కేజీల బరువెత్తిన అతను రెండో ప్రయత్నంలో దానిని మరింత మెరుగుపర్చుకున్నాడు. చివరి ప్రయత్నంలో 196 కేజీల కోసం ప్రయత్నించినా అతను విఫలమయ్యాడు. ఈ ఈవెంట్లో రిలువాన్ ఇద్రీస్ (208 కేజీలు; నైజీరియా) స్వర్ణం గెలుచుకోగా, మాథ్యూ హార్డింగ్ (199 కేజీలు; ఇంగ్లండ్)కు రజతం దక్కింది. ఇదే విభాగంలో పోటీ పడిన మరో ఆరుగురు భారత పవర్‌లిఫ్టర్లు పతకం సాధించడంలో విఫలమయ్యారు. పారా పవర్ లిఫ్టింగ్ పురుషుల లైట్ వెయిట్ విభాగంలో భారత్ లిఫ్టర్ అశోక్ కుమార్ నాలుగో స్థానంలో నిలిచి పతకం చేజార్చుకున్నాడు. ఇతర ఫలితాలు→ భారత బాక్సర్ సచిన్ సివాచ్ (62 కేజీలు) 4–1తో అహ్మదీ (కెనడా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. → మహిళల బౌల్స్ పెయిర్ ఈవెంట్లో భారత జోడి రూపా రాణి – పింకీ సింగ్ ‘టైబ్రేకర్’లో టోంగాపై గెలిచింది. → పురుషుల స్విమ్మింగ్ (400 మీ. ఫ్రీస్టయిల్)లో భారత స్విమ్మర్లు ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. దక్షణ్ శశికుమార్ 15వ, ఆర్యన్ 6వ స్థానంతో ముగించారు. → మహిళల 3X3 వీల్ చెయిర్ బాస్కెట్‌బాల్ ఈవెంట్ తొలి మ్యాచ్‌లో భారత్ 1–16 తేడాలో వేల్స్ చేతుల్లో చిత్తుగా ఓడింది. → పురుషుల బౌల్స్ ఈవెంట్ సింగిల్స్‌లో భారత ఆటగాడు పుతుల్ సోనోవాల్ 4–8, 8–9 స్కోరుతో ఇజ్జత్ జుల్కెప్లె (మలేసియా) చేతిలో ఓడాడు. దక్షిణాఫ్రికా స్విమ్మర్ చాడ్ లి క్లోజ్ ఖాతాలో 19వ కామన్వెల్త్ పతకం చేరింది. తద్వారా ఈ పోటీల్లో అత్యధిక పతకాలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు షూటర్లు ఫిల్ ఆడమ్స్, గౌల్ట్ (18 పతకాలు) పేరిట ఉంది.అవమాన కుమార్!!! అతని అసలు పేరు అవినాశ్ కుమార్. అయితే ఐదేళ్ల వయసులో పోలియోబారిన పడి నడుం కిందిభాగం చచ్చుబడిపోయింది. ‘నువ్వు తండ్రికి భారంగా పుట్టావు. అతడి పరువు తీశావు’ అంటూ కొందరు బంధువులు ఝండ్ (అవమానం) అంటూ పిలవడం మొదలుపెట్టారు. చిన్నప్పుడు రికార్డుల్లో కూడా ఇదే పేరు నమోదు కావడంతో చివరకు అసలు పేరు పోయి అతను ఝండూ కుమార్‌గా మారాడు! స్వస్థలం బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా హర్నౌత్. తండ్రి కూరగాయలు అమ్మగా వచ్చే ఆదాయంతో జీవనం సాగే పరిస్థితుల్లో అతను చిన్నప్పటి నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు. అయితే కఠోర శ్రమతో, పట్టుదలతో వాటిని అధిగమించాడు. కుటుంబ పోషణకు తాను కూడా కూరగాయాలు అమ్మాడు. ఉదయం 4 గంటలకే 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హోల్‌సేల్ మార్కెట్లో కూరగాయలు తెచ్చుకొని హర్నౌత్లో ఫుట్‌పాత్‌పై అమ్మడం అతని రోజూవారీ దినచర్య. 4 గంటల వరకు అమ్మకం ముగించి ఆ తర్వాత జిమ్‌కు వెళ్లడం, ప్రాక్టీస్ చేయడంతోనే పవర్‌లిఫ్టింగ్‌లో అతను రాటుదేలాడు. కాళ్లు లేకపోయినా శారీరక సౌష్టవం పెంచుకోగలననే నమ్మకంతో తన ట్రైసైకిల్‌ను దాదాపు కిలోమీటర్ తోసుకుంటూ జిమ్‌కు వెళ్లి ఝండూ సాధన చేశాడు. అయితే ఆర్థిక సమస్యలు మరింత పెరగడంతో బ్యాటరీ ఈ–రిక్షా నడిపి కొంత ఆదాయం పొందే ప్రయత్నం చేశాడు. గాందీనగర్‌లోని స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో అవకాశం లభించడంతో అతని జీవితం మారింది. ఏడాది క్రితం 205 కిలోల బరువెత్తి కొత్త జాతీయ రికార్డు సాధించిన ఝండూ ఆ తర్వాత 206 కేజీలతో దానిని సవరించాడు. ప్రపంచ కప్‌లో కాంస్యం, ఆసియా ఓషియానియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన ఝండూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. -
కాంస్యంతో మెరిసిన ‘రిక్షావోడు’ .. కామన్వెల్త్లో భారత్ బోణీ
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల బోణీ చేసింది. పురుషుల పారా పవర్‌లిఫ్టింగ్ హెవీవెయిట్ కేటగిరీలో ఝండు కుమార్ కాంస్యంతో మెరిశాడు. గ్రూప్-బి నుంచి బరిలోకి దిగిన ఝండు తన రెండో ప్రయత్నంలో 190 కేజీల బరువును ఎత్తి 130.9 పాయింట్లు స్కోరును సాధించాడు. ఇప్పటివరకు ఝండు కెరీర్లో అత్యుత్తమంగా ఉన్న 198 కేజీల బరువును అధిగమించనప్పటికీ తాజా కామన్వెల్త్ గేమ్స్‌లో మాత్రం కాంస్యాన్ని ఒడిసిపట్టాడు. మూడో ప్రయత్నంలో 196 కేజీల బరువు ఎత్తే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ తన కంటే ఎక్కువగా ఎవరు బరువు ఎత్తకపోవడంతో గ్రూప్-బి నుంచి తొలి స్థానంలో, ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచి పతకం ఖాయం చేసుకున్నాడు. ఇక నైజీరియాకు చెందిన రిలువాన్ ఇద్రిస్ 208 కిలోల బరువు ఎత్తి 132.8 పాయింట్లు సాధించి పోడియంపై తొలి స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నాడు. ఇక 199 కిలోల బరువు ఎత్తిన ఇంగ్లండ్‌కు చెందిన మాథ్యూ హార్డింగ్ 131 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి వెండిని కైవసం చేసుకున్నాడు. ఇక కాంస్య పతకం గెలుచుకున్న అనంతరం ఝండు కుమార్ మాట్లాడాడు.‘నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. భారత్‌కు ఇది చాలా ముఖ్యం. ఈ గేమ్స్‌లో నాదే దేశానికి తొలి పతకం కావడాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా. జాతీయ జెండాను పోడియంపై చూసినప్పుడు గర్వంగా ఫీలయ్యాను. థాంక్యూ ఇండియా. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నేను పతకం గెలిచిన విషయాన్ని ముందుగా ఇంట్లో అమ్మానాన్నలకు చెప్తాను. అలాగే, చిన్నప్పటి నుంచి నాకు అండగా నిలిచిన నా స్నేహితుడు గౌతమ్ భయ్యాకు కూడా విషయాన్ని చెప్పాలి’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ-రిక్షా నుంచి వెయిట్‌లిఫ్టర్ దాకాపేదరికం విజయకాంక్షను పెంచుతుందనే మాట పారా పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్ సాధించిన ఘనత ద్వారా మరోసారి నిరూపితమైంది. హర్నౌత్‌కు చెందిన ఒక కూరగాయల వ్యాపారి కుమారుడైన ఝండు ఒక ఈ-రిక్షా డ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభించాడు. హర్నౌత్లోని ది రాక్ స్టార్ జిమ్ యజమాని గౌతమ్ సింగ్ రాకతో ఝండు జీవితం పూర్తిగా మారిపోయింది. ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా పారా గేమ్స్ (కేఐపీజీ)లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. మార్చి 23న జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని వెయిట్‌లిఫ్టింగ్ హాల్లో జరిగిన పురుషుల 72 కేజీల విభాగంలో, ఆ పవర్‌లిఫ్టర్ 206 కేజీల బరువును ఎత్తి తన సొంత జాతీయ రికార్డును బద్దలు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. మార్చి 17-18 తేదీలలో నోయిడాలో జరిగిన పారా నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో ఝండు 205 కేజీల బరువును ఎత్తి, సుధీర్ కుమార్ యొక్క 192 కేజీల జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.పుట్టుకతో పోలియో28 ఏళ్ల అతనికి పుట్టుకతోనే పోలియో సోకిన కాళ్లు ఉన్నాయి. అతని పారా స్పోర్ట్స్ ప్రయాణం 2017లో ప్రారంభమైంది. మొదట్లో, అతను షాట్‌పుట్, డిస్కస్ త్రోలో పోటీపడ్డాడు. ఆ సమయంలో, అతనికి పారా పవర్‌లిఫ్టింగ్ గురించి తెలియదు. F-55 కేటగిరీలో, ఝండు అనేక షాట్పుట్డి, డిస్కస్ త్రో ఈవెంట్లలో పాల్గొని విజయం సాధించాడు, కానీ అతని గమ్యం వేరే చోట ఉండటంతో, విధి అతన్ని ఆ దిశగా నడిపించింది.కష్టాలతో కూడిన ప్రయాణం తర్వాత, అతను గాంధీనగర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(NCOE)కి చేరుకున్నాడు. ప్రముఖ పారా కోచ్ రాజిందర్ సింగ్ రాహేలు మార్గదర్శకత్వంలో పవర్ వెయిట్‌లిఫ్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. డిసెంబర్ 2023లో, KIPG తొలి ఎడిషన్‌లో పవర్‌లిఫ్టింగ్ విభాగంలో ఝండు కుమార్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 2028 లాస్ ఏంజెలెస్ పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే తన లక్ష్యమని ఝండు కుమార్ పేర్కొన్నాడు.ప్రధాని మోదీ అభినందనలుకామన్వెల్త్ గేమ్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన ఝండు కుమార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. 'కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్ ఈవెంట్లో కాంస్యం గెలిచిన ఝండు కుమార్‌కు అభినందనలు. అతడి అద్భుత ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికను తెరవడం గొప్ప విషయం. అతడి విజయం అపారమైన శక్తికి, అతడి సంకల్పానికి, ఎన్నో ఏళ్ల తరబడి క్రమశిక్షణకు నిదర్శనం. తన జీవితంలో ఎదురైన ప్రతీ సవాల్‌ను అధిగమించి ఇవాళ అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశానికి గర్వకారణంగా నిలిచి భారతీయులందరికి స్ఫూర్తిగా నిలిచాడు.' అని మోదీ కొనియాడారు. A spectacular performance by Jhandu Kumar, who has opened India’s medal tally at the #CWG2026 by winning a Bronze in the Men’s Heavyweight Para Powerlifting event! Congratulations to him. His achievement is a powerful reflection of immense strength, unwavering determination and… pic.twitter.com/kMdkU6RRAF— Narendra Modi (@narendramodi) July 25, 2026 🇮🇳 BRONZE FOR BHARAT! 🥉 Jhandu Kumar opens India’s #CWG2026 medal tally with a massive 190kg lift in Men’s Heavyweight Para Powerlifting. The entire nation is proud! 🇮🇳 #Cheer4Bharat pic.twitter.com/pyZSOZw0uI— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 24, 2026చదవండి: గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్!


