breaking news
Palanquin trip
-
అమ్మవారి పల్లకి ముట్టుకున్నందుకు..60 వేలు జరిమాన
మాలూరు: గ్రామాల్లో ఇప్పటికీ అస్పృశ్యత అనే రక్కసి వెంటాడుతోంది. ఇందుకు నిదర్శనమే ఈ ఉదంతం. దళిత బాలుడు అమ్మవారి పల్లకీని ముట్టుకున్నాడని గ్రామస్తులు అతని కుటుంబానికి రూ.60 వేల జరిమానా విధించారు. డబ్బు కట్టకపోతే అక్టోబర్ 1 లోగా గ్రామం విడిచి వెళ్లాలని హుకుం జారీచేశారు. ఈ అమానవీయ సంఘటన కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని ఉళ్లేరహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఉళ్లేరహళ్లి గ్రామంలో 10వ తరగతి చదువుతున్న దళిత బాలుడు చేతన్ ఈ నెల 8వ తేదీన బూత్యమ్మ జాతరలో అమ్మవారి పల్లకీని తాకాడు. ఇది చూసి అగ్రవర్ణాల వారు బాలున్ని మందలించి కొట్టారు. అంతటితో ఆగకుండా పంచాయతీ పెట్టారు. బాలుడు ముట్టుకోవడం వల్ల మైలపడిందని, ఇందుకు శాంతి కార్యక్రమం చేయడానికి రూ.60 వేలు కట్టాలని బాలుని తల్లి శోభను ఆదేశించారు. పోలీసులకు తల్లి ఫిర్యాదు దీంతో భయపడిన శోభ సోమవారం మాస్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేట్టారు. పలు దళిత సంఘాలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు నారాయణస్వామి, రమే‹Ù, వెంకటేశప్ప, నారాయణస్వామి, కొట్టప్ప, అర్చకుడు మోహన్రావ్, చిన్నయ్యలతో పాటు మరికొందరిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. (చదవండి: విధి వంచితురాలు) -
పల్లకీ యాత్రకు ఘన స్వాగతం
- తుకారం మహరాజ్‌కు పుష్పవర్షం కురిపించిన భక్తులు - ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసిన తెలుగు మాల సంఘం పింప్రి: జగద్గురు సంత్ తుకారాం మహరాజ్ పల్లకీ యాత్రకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. గురువారం ఉదయం 11 గంటలకు దేహులో ఇనాందార్వాడ నుంచి పింప్రి, చించ్వడ్ వైపు సాగింది. అంతకు ముందు ఉదయం 4.30 గంటలకు హారతి, కీర్తనలతో మహాపూజ నిర్వహించారు. దారిపొడవునా భక్తులు పుష్పవర్షం కురిపించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనగడ్ షాహ బాబా దర్గాకు పల్లకీ చేరుకోగానే తరతరాల ఆచారం ప్రకారం అభంగ్, హారతి ఇచ్చారు. తర్వాత చింబోలి గ్రామంలోని పాదుకా మందిరానికి తుకారం వెండి పాదుకల పల్లకి చేరుకుంది. ఈ రాత్రికి ఆకృడిలోని విఠల్ రుక్మిణీ దేవాలయంలో విశ్రాంతి తీసుకుని శుక్రవారం ఉదయం యాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది. సాంప్రదాయిక ఆహ్వానం చింబోలి గ్రామంలో అత్యధికంగా నివసించే తెలుగు ప్రజలు సాంప్రదాయబద్ధంగా ముగ్గులు వేసి పల్లకికి ఘన స్వాగతం పలికారు. దేహురోడ్డు, చించోలికి చెందిన తెలుగు మాల సమాజ్ ఆధ్వర్యంలో పళ్లు, ఫలహారాలను వార్కారీ (భక్తులు) లకు పంచారు. ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి వీటిని అందజేశారు. తెలుగు మాల సమాజ్ సంస్థ అధ్యక్షుడు శివ ప్రసాద్, ఉపాధ్యక్షులు రాజు వెంకటేశ్, రాందాస్ దాసరి, ఈరేశ్ హాలహర్వి, సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా వార్కారీల యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని, అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా వార్కారీలకు సేవ చేస్తున్నామని, భగవంతునికి సేవ చేసినట్లుగా తాము భావిస్తున్నామని సంఘం సభ్యులు చెప్పారు.