breaking news
palana
-
ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ ఆగ్రహం
-
ప్రజలు మెచ్చేలా జగన్ సంక్షేమ పాలన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజలు మెచ్చేలా రామరాజ్యం మాదిరి సంక్షేమ పాలన కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ అన్నారు. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎలాంటి కరువు పరిస్థితులు ఉండేవో ప్రజలందరికీ తెలుసునన్నారు. మంగళవారం దేవదాయ శాఖ కార్యక్రమాలపై ఆ శాఖ అధికారులతో సమీక్ష అనంతరం రాష్ట్ర సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. పేద ప్రజలకు మంచి చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పం గొప్పదని, అందుకే భగవంతుడు ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆలయం లేని ఊరు ఉండకూడదని సీఎం జగన్మోహన్రెడ్డి పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా మూడు వేల కొత్త ఆలయాలు నిర్మాణం చేపడుతుండగా.. కామన్‌గుడ్ ఫండ్ (సీజీఎఫ్) కార్యక్రమాల ద్వారా మరో రూ. 270 కోట్లతో వివిధ జిల్లాల్లో పురాతన ఆలయాల పునరుద్ధరణ, కొత్త ఆలయాల నిర్మాణం కొనసాగుతుందని చెప్పారు. వీటికి తోడు తగినంత ఆదాయం లేక రోజూ నిత్య పూజలు జరగని ఆలయాలకు డీడీఎన్ఎస్ పథకం ద్వారా ఆర్థిక తోడ్పాటు అందజేస్తున్నామన్నారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక కొత్తగా రూ. 3,500 ఆదాయం లేని ఆలయాలకు కొత్తగా ధూప దీప నైవేద్య పథకంలో ఆర్థిక తోడ్పాటు అందజేసేందుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. దేవుడి భూములను ఆక్రమించుకున్న వారి ఆట కట్టించేందుకు దేవదాయ శాఖ చట్టానికి కొత్తగా సవరణలు తీసుకొచ్చినట్లు వివరించారు. శ్రీశైలం ఆలయం వద్ద కొత్తగా అన్నదానం సత్రాల ఏర్పాటుకు 18 దరఖాస్తులు వచ్చాయని, వాటికి భూ కేటాయింపుల ద్వారా శ్రీశైల మల్లిఖార్జునస్వామి వారికి కూడా ఆదాయం దక్కేలా విధివిధానాలు తీసుకురానున్నట్లు వివరించారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన
రాష్ట్రంలో రాక్షస పాలన రాష్ట్రం, రాక్షస, పాలన, rastram, rakshasudu, palana అధికార పార్టీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళుతున్నందుకే ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు ఆదివారం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు, నాయకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. వంద పేజీల ఎన్నికల మెనిఫెస్టోలో వెయ్యి అబద్ధాలను చెప్పిన ఘనత టీడీపీ అధినేత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ దురాగతాలను ఎండగట్టేందుకు చేపట్టిన గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమంతో అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. రాబోయే కాలం తమదేనని, కార్యకర్తలు అధైర్యపడకుండా మనోధైర్యంతో ఉండాలన్నారు. కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నగరి మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపును టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. అందుకే తెలుగుదేశం నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. కేసులతో నాయకులను భయపెట్టాలనుకుంటే అది భ్రమ మాత్రమేనన్నారు. నగరిలో చాలామంది కార్యకర్తలపై కేసులు పెట్టారని వారిలో కొంత మంది కూడా టీడీపీ చేరలేదని గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. టీడీపీ అక్రమాలకు ఎదురు నిలిచి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ వెంటే ఉన్నారనీ.. కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి అన్నారు. కేసులకు భయపడే ప్రసక్తేలేదని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను మానుకోకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ పూర్తిగా కనుమరగవుతుందని హెచ్చరించారు. టీడీపీ నాయకులు అధికార మదంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. అవినీతిపై పోరాటం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులపై టీడీపీ ద్వితీయ శ్రేణి కూడా దాడులకు తెగబడుతున్నా పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారని వాపోయారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. పూతల పట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో కుప్పం తరువాత నగరి, పూతలపట్టు నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలుస్తుందని ఆశించి భంగపడ్డంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఆగడాలు మితిమీరుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు అటవిక పాలన సాగిస్తున్నారని అన్నారు. సీఎం ప్రతి పక్షాన్ని గౌరవించే పద్ధతిని నేర్చుకోవాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోకల అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.