breaking news
Padmasri vanajeevi ramaiah
-
వనజీవి రామయ్య కు ప్రమాదం
-
పద్మశ్రీ వనజీవి రామయ్యకు ప్రధాని మోదీ లేఖ
ఖమ్మం రూరల్: స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి సహకరించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ పద్మశ్రీ వనజీవి రామయ్యను కోరారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి వాసి వనజీవి రామయ్యకు పీఎంవో నుంచి ప్రధాని సంతకంతో కూడిన లేఖ అందింది. లేఖలో ‘స్వచ్ఛత, పారిశుధ్యం కోసం మహాత్మా గాంధీ ఎంతో పాటుపడ్డారు. గాంధీ కలలను స్వాప్నికం చేసేందుకు దేశంలోని సామాజిక వేత్తల సహకారం కోరుతున్నాం. అందులో భాగంగానే రామయ్యా జీ.. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి మీ సహకారం చాలా అవసరం. ఆరోగ్యకరమైన భారతావని కోసం కలసికట్టుగా.. సమిష్టిగా పాటుపడదాం. ఇదే మనం మహాత్మా గాంధీకి.. గాంధీ జయంతి రోజున ఇచ్చే కానుక అని’ రాసి ఉంది.