breaking news
padma raju
-
పద్మరాజు కృషి మేలిమి బంగారం
పాలగుమ్మి పద్మరాజు శతజయంతి (జూన్ 24, 1915) ముగింపు సందర్భంగా... (దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి గొంతు పోయే రోజుల్లో నేను హైదరాబాదు ఆలిండియా రేడియోలో చేరాను. అది 1963. శాస్త్రిగారు చెప్పాలనుకున్న మాటలు చిన్న చిన్న పుస్తకాల మీద రాసేవారు. దైనందిన అవసరాల మాట అటుండగా, కొన్ని విషయాలు గ్రంథస్తం చేయవలసినంత గొప్పవి. నేనంటూ ఉండేవాడిని: ‘ఈ పుస్తకాలను నాకు ఆస్తిగా రాసిచ్చేయండి’ అని. శాస్త్రిగారు నవ్వేవారు. సాహితీ ప్రపంచంలో వచనాన్ని గొప్పగా రాసే రచయితల్లో శాస్త్రిగారొకరని నా ఉద్దేశం. నా దృష్టిలో వీరుకాక వేలూరి శివరామశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీశ్రీ పేర్లు చెప్తాను. ఏమైనా ఆ పుస్తకాలన్నింటినీ వారబ్బాయి బుజ్జాయి భద్రపరిచారు. అంతేకాదు, చాలారోజులు శ్రమపడి బాలాంత్రపు నళినీకాంతరావుగారూ ఆయనా కూర్చుని కొన్నింటిని ఏరి చక్కని పుస్తకంగా రూపుదిద్దారు. అయితే ఆ పని సగంలోనే ఆగిపోయింది - నశినీకాంతరావుగారి ఆరోగ్యం బాగులేక, తర్వాత నళినీకాంతరావుగారు వెళ్లిపోయారు. నేనూ బుజ్జాయిగారూ కలిసి ఆ పనిని పూర్తిచేద్దామనుకున్నాం. ‘మూగనయాక’ అని పుస్తకానికి పేరు వారే స్థిరపరిచారు. ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి ప్రచురణ కర్త కూడా ముందుకు వచ్చారు. నళినీకాంతరావుగారు పరిష్కరించిన రెండు వ్రాతప్రతులను నేను ఇంటికి తెచ్చుకున్నాను. చేతికి అందేటట్టు నా మంచం దగ్గర పెట్టుకున్నాను. అయితే నేను ఊళ్లో లేనప్పుడు మా యింటిని పునర్నిర్మించే ప్రయత్నంలో ఆ పుస్తకాల విలువ తెలియనివారెవరో కదిపేశారు. ఇక వాటి జాడ ఎంత వెదికినా దొరకలేదు. నిస్సహాయంగా, సిగ్గుపడి కొన్నాళ్లు బుజ్జాయిగారి పలకరింతను తప్పించుకు తిరిగాను. నా జీవితంలో నిస్సహాయంగా దూరమైన వ్రాత ప్రతి ఇదొక్కటే. తెలుగు సాహిత్యానికి తీరని నష్టం కలిగించిన సందర్భమూ ఇదే. ఇందుకు బుజ్జాయిగారికి బేషరతుగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. శాస్త్రిగారు ఆ రోజుల్లో ఏం మాట్లాడదలిచినా, నేను సభలో ఉంటే నా చేతనే చదివించేవారు. ఈ రెండు ప్రసంగ పాఠాలూ నళినీకాంతరావుగారు ‘మూగనయాక’ పుస్తకంలో చేర్చినవి. పాలగుమ్మి పద్మరాజుగారి శతజయంతి సందర్భంగా ఆయన ముఖ్య అభిమాని అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ఈ ప్రసంగాల కంటే గొప్ప నివాళి మరొకటి ఉండదు. - గొల్లపూడి మారుతిరావు) కథకుడు, నవలా రచయిత, నాటక కర్త, కవి, విమర్శకుడు అయిన పద్మరాజు గొప్పతనాన్ని గూర్చి లోతులకు వెళ్లి పరిశీలించి అందంగా, వివరాలతో చెప్పగల శక్తి నాకు లేదు - ముసిలి రోగినైన నాకు ఓపికా లేదు. ఏ సాహిత్య రూపం తీసుకున్నా అది పద్మరాజు చేతిలో మేలిమి బంగారం అయిపోయి, మొదటి శ్రేణిలో కూర్చుంటుంది. ‘‘ఇంతవరకూ ఆయనకంటే ముందంజ వేసిన ప్రధాన కథకుడు లేకపోవడమే కాకుండా, రాను రాను ఆయన బెంగాలీ శరశ్చంద్రుడిలాగ, అన్నీ మొదట ఇతని జీవితంలోనే భాగాలైనట్లుంటాయి. అందుకే ఇతను నిర్మించిన ప్రతి మూర్తీ చక్కగా చెక్కిన వట్టి బొమ్మ కాదు - అనుభావాలతో చలించిపోయే ప్రాణి. సైన్స్, ఆర్ట్ ఇతనిలో సరి అయిన పాళ్లలో సమ్మేళనమొందాయి. ఇలాగ ఎన్ని కథలు, నవలలు - ‘కూలిజనం’, ‘చచ్చి సాధించాడు’ అనే డిటెక్టివ్ నవల, ‘బ్రతికిన కాలేజి’, ‘రెండవ అశోకుడి మూణ్ణాళ్ల పాలన’, ‘రామ రాజ్యానికి రహదారి’, ‘నల్లరేగడి’ సరేసరి - ఇలాగ ఎన్నో నవలలేనా, నాటకాలూ, నాటికలూ! రేడియోలో ముందు అనౌన్స్మెంట్ వినకుండా, నాటక ప్రసారం వినడం మొదలుపెట్టగానే, ‘ఇది పద్మరాజుది’ అని చెప్పేసుకుంటాను. ఇక కవిత్వం - భారత సాహిత్య అకాడమీ ప్రచురించిన కావ్య సంకలనం మీలో ఎవరైనా చదివారా? దానిలో పద్మరాజు కవిత! దాని సంపాదకుడైన రసజ్ఞుడూ, గొప్ప కవీ అయిన కాటూరి అన్నాడు నాతో - ‘‘బావా! ఈ పద్మరాజు గొప్ప కవి అవుతాడు, కవిత్వం వదలకపోతే’’ అని - అలాగే పద్మరాజు ‘పురిటిపాట’ అనే కవిత చదువుతూంటే - ‘‘కడవలా ఆమె కడుపిం తుందేమీ అని అనుకోనివాడు లేడు. లోపలి బెదురు దాచుకున్నారు. ఆ రాత్రొక వల్లకాడు’’ అనే చోట గుండె హడలిపోయి అలాగే ఆ కవితామార్గాన్నే పోతూ - హడలుతూ, మూలుగుతూ, ఆక్రోశిస్తూ - గుండెకు హత్తుకుని ఆమె మట్టుకు అంది ‘మనబ్బాయి’ అని - అన్నాక తేరుకుంటాము. చీకటిమీద కవితో! ‘చీకటి ఒక మహోద్యమం’ అని మొదలుపెట్టి, ‘అది స్వేచ్ఛగా అణువణువుగా విడి వ్యాపించింది నక్షత్రాలయి’ అంటూ చిక్కని కవిత్వంలో నడుచుకుపోతాం. ఇది అంతా కవిత్వపు ముద్ద. ఎన్ని సుప్త ఛందాలు, వ్రాయని పద్యాలుగా ఉన్నాయో పద్మరాజులో అని అనుకున్నాను. మావంటి ఇష్టులమీద దయకొద్దీ ఇతను కవిత్వం, గేయం జోలికి అట్టే పోలేదుగాని, అలాగ చేస్తే మా నోట్లో మన్నే - ‘శ్రీ రాజరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్బు’లో ఇతని పాట విన్నారు గదా! తెనుగు నాట నేనెరిగున్న మేధావులూ, ప్రతిభావంతులూ అయిన అయిదారుగురిలో పద్మరాజు ఒకడు. ఇతని వద్దనే, ఇతని ప్రక్కనున్నప్పుడే, నేను చిన్నవాడనుగా నాకు నేనే కనిపిస్తాను. (1978 కాకినాడలో జరిగిన పద్మరాజు షష్టిపూర్తి ఉత్సవ సభలో చదవబడిన ప్రశంస నుంచి. ఆ సభ నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే ఆ సభలో నేను వక్తని. ఎం.వి.శాస్త్రిగారి ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళా మందిరంలో ఉదయాన జరిగింది. కృష్ణశాస్త్రిగారు అనారోగ్యం కారణంగా రాలేదు. ప్రసంగ పాఠాన్ని నేనే చదివాను.) ‘నల్లరేగడి’ నవల పద్మరాజు ‘నల్లరేగడి’ గొప్ప నవల. ఈ లోకంలో పైకి వచ్చేవాళ్లు చాలామంది ఉంటారు అన్ని రంగాలలోనూ. అలాగ వచ్చి నిలబడిపోయేవారు బహుకొద్దిమంది. ముందుకు వచ్చేవారిలో ఎందరో కేవలమూ జబ్బ పుష్టివల్ల వచ్చేవాళ్లుంటారు - వెనుక నుంచి తోసి, గిల్లి, కొట్టి, అరిచి నానా హంగామా చేసి. మరికొందరు బాజా భజంత్రీలు, వంధిమాగధులూ, భుజకీర్తులూ, బిరుదుపాఠాలూ వగైరాలతో ‘యేమిట్రోయ్, వీరెవరోయ్’ అనేటట్టు యమ సందడి చేస్తూ వస్తారు. కొందరు కాళ్ల సందుల్లో దూరీ, పాకీ యిట్టే ముందు పంక్తిలోనికి వచ్చేస్తారు. ఈ మూడు రకాలూ అంతగా నిలబడిపోరు - ఏ కార్య రంగంలోనైనా, సాహితీ రంగంలోనైనా. ఇక కొద్దిమంది, అడుగడుగూ ముందుకు వేస్తూ, క్రమంగా ముందు పంక్తిలో నిలబడి ఉంటారు. ఈలోగా భుజబలం వాళ్లూ, ఉరిమే వాళ్లూ, బాజా భజంత్రీల వాళ్లూ వగైరా గాలిపోయిన రబ్బరు బొమ్మల్లాగున చప్పబడి పక్కకి ఒరిగిపోతారు. నిదానంగా వచ్చి స్థిరంగా ఉండిపోయేవారు శ్రీ పాలగుమ్మి పద్మరాజు - కేవలమూ అర్హత వల్ల, ప్రతిభ వల్ల సాహిత్య వీధిలో ముందుముందుకు ప్రయాణం చేస్తూ అగ్ర శ్రేణిలోనికి వచ్చి స్థిరపడ్డవారు... ప్రప్రథమ శ్రేణి కథా రచయితలలో, నవలలు రాసేవారిలో బహు కొద్దిమందిలో పద్మరాజు ముఖ్యుడు అని నా అభిప్రాయం... పద్మరాజుకు భాషపై మంచి అధికారం ఉంది. నిర్దుష్టం, స్పష్టం అయినా గంభీరమూ, సులభ సుందరమూనూ, బాగా తెలుగు తెలిసున్నవాడిది ఆ భాష. పూర్వ కవులు మొదలుకొని కోట్లమంది మాట్లాడే జీవద్భాష దాకా జీర్ణించుకుంటే తయారైన భాష పద్మరాజుది. నిశితమైన శాస్త్ర దృష్టితో, విజ్ఞాన దృష్టితో సమగ్రమైన హృదయం జోడించి ఉంది ఇతనికి... పద్మరాజు నాకు ఒరిపిడి రాయి. అతని మెప్పు సాహిత్య మందిర ప్రవేశానికి ఉత్తరువు. (1973లో ఢిల్లీ ఆంధ్ర సంఘ సమావేశంలో చదివించిన పరిచయ ప్రసంగం నుంచి) - గొల్లపూడి మారుతిరావు -
రెండు రాష్ట్రాల్లోనూ సవాళ్లు ఎదుర్కొందాం..
ఏజీవర్సిటీ : ప్రస్తుతం వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అధిగమించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టిసారించాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ.పద్మరాజు పిలుపునిచ్చారు. దేశ ఆహారభద్రత దృష్ట్యా రెండురాష్ట్రాల్లోని రైతు కుటుంబాలు వ్యవసాయాన్ని కొనసాగించి ఇంకా పురోగతి సాధించేలా చూడాల్సిన బాధ్యత ప్రతీ శాస్త్రవేత్తపై ఉందన్నారు. విశ్వవిద్యాలయం 50 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం రాజేంద్రనగర్‌లోని వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట స్వర్ణోత్సవాలు ప్రారంభించారు. దీనికి విచ్చేసిన వీసీ పద్మరాజు మాట్లాడుతూ వ్యవసాయ బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో వర్సిటీ మరింత ముందుకెళ్లడానికి శాస్త్రవేత్తలు,అధికారులు కృషిచేయాలని కోరారు. వర్సిటీ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధరంగాల్లో సేవలందిస్తూ రైతునేస్తంగా వెలుగొందుతున్నారని ప్రశంసించారు. కాగా స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ ఏడాది జూన్ నుంచి జూన్ 2015వరకు స్వర్ణోత్సవ సంవత్సరంగా ప్రకటిస్తూ ప్రణాళికను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్‌రావు, టివికె సింగ్, రాజారెడ్డి, రాజిరెడ్డి, మీనాకుమారి, వీరరాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగుల ఆందోళన : స్వర్ణోత్సవాల్లో భాగంగా అధికారులు వర్సిటీ గేయాన్ని మైక్ ద్వారా వినిపించేందుకు యత్నించారు. అందులో ‘ఆంధ్రనాట వెలసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం’ అని ఉండడంతో తెలంగాణ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ గేయానికి బదులు తెలంగాణ రాష్ట్ర గేయమైన జయహే జయహే తెలంగాణ..పాటను పెట్టాలనడంతో అధికారులు దిగొచ్చి తెలంగాణ గేయాన్ని పెట్టడంతో ఆందోళన సద్దుమణిగింది. సాదాసీదాగా స్వర్ణోత్సవాలు : ప్రపంచంలోనే వ్యవసాయవిద్యలో పేరెన్నికగల ఏజీ వర్సిటీ స్వర్ణోత్సవాలు సాదాసీదాగా ప్రారంభించి అధికారులు చేతులు దులుపుకున్నారు. వర్సిటీ పరిధిలోని ఏ కార్యాలయంలో కూడా దీనికి సంబంధించి ఆడంబరం కనిపించలేదు. వర్సిటీ ప్రధానద్వారాల్లో కూడా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, వ్యవసాయ పరిశోధనా ఫలితాల వివరాలు తెలిపే సమాచారం కనిపించలేదు. రైతుసేవే ప్రధాన లక్ష్యంగా ఏర్పడిన విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల్లో కనీసం ఒక్కరైతును కూడా ఆహ్వానించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఇక్రిశాట్‌తో పనిచేసేందుకు సిద్ధం
ఏజీ వర్సిటీ,న్యూస్‌లైన్: పరిశోధనా ఫలితాలను రైతులకు అందించడంలో ‘వ్యవసాయ విస్తరణ విద్య’ కీలకపాత్ర పోషిస్తుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పద్మరాజు కొనియాడారు. వ్యవసాయ విస్తరణ విద్య అభివృద్ధికి తీసుకోవాల్సిన విధానాలపై గురువారం రాజేంద్రనగర్‌లోని విస్తరణ విద్యాసంస్థ (ఈఈఐ)లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వ్యవసాయంలో వస్తున్న పరిశోధనలను ప్రతి రైతు ముంగిట చేర్చేందుకు విస్తరణ కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరముందని గుర్తుచేశారు. గ్రామీణ యువతను వ్యవసాయంపై ఆసక్తి కలిగించేలా వ్యవసాయ విద్యవిధానాలను రూపొందించాలని శాస్త్రవేత్తలకు సూ చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ విద్యలో వినియోగించుకొని రానున్నకాలంలో ఏజీ వర్సిటీ పరి ధిలో సీడ్ టెక్నాలజీ వంటి కోర్సులను ఆన్లైన్లో అందించడానికి కృషి చేస్తామన్నారు. నగరంలోని వివిధ ఐఐటీ, ఐటీలతోపాటు అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్‌తో కలిసి పనిచేసేందుకు తమ యూనివర్సిటీ సిద్ధంగా ఉందన్నారు. సదస్సులో వర్సిటీ విస్తరణ సంచాలకులు రాజిరెడ్డి, భారత విస్తరణ విద్యా శిక్షణ సంస్థ డెరైక్టర్ డాక్టర్ ప్రశాంత్ ఎస్.ఆర్మోఖర్, శైలేష్‌కుమార్ మిశ్రా, ఈఈఐ సంచాలకులు జగన్నాథరాజు, అండమాన్, నికోబార్, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 56 మంది వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
రాయల తెలంగాణ కూడా లీకులో భాగమే: ప్రభుత్వ విప్
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై రోజుకో లీకుతో, గంటకో బ్రేకుతో ముందుకెళుతున్న కేంద్రపై ప్రభుత్వ విప్ పద్మరాజు మండిపడ్డారు. విభజనపై కేంద్రం లీకులిచ్చుకుంటూ కాలయాపన చేస్తుందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం కేంద్రం వినిపిస్తున్న రాయల తెలంగాణ కూడా అదే కోవలోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన విభజనపై కేంద్ర అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. అసెంబ్లీలో విభజన నెగ్గించుకునేందుకు రాయల తెలంగాణ ప్రతిపాదన తెరమీదకు తీసుకువచ్చిందేమోనని పద్మరాజు అనుమానం వ్యక్తం చేశారు. రాయల తెలంగాణను సీమ ప్రజలెవరూ కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని పద్మరాజు తెలిపారు. ఇరు ప్రాంతాల్లో సమాన అసెంబ్లీ సీట్ల కోసం.. రాయల తెలంగాణ ఆలోచన సరికాదని కేంద్రానికి సూచించారు.