breaking news
Own decisions
-
ఏఐ... హ్యాక్ చేయాలని డిసైడైంది!
ప్రావిడెన్స్ (అమెరికా): అనుకున్నంత అయ్యింది. కృత్రిమ మేధ సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టింది. సోషల్ మీడియా వేదికగా మంగళవారం చాట్‌జీపీటీ సృష్టికర్త సామ్ ఆల్ట్మాన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘మా కృత్రిమ మేధ వ్యవస్థ ఒకటి మరో ఏఐ కంపెనీని హ్యాక్ చేసింది. అది కూడా తనంతటతానుగా ఇదో అనూహ్యమైన సైబర్ ఘటన’’అని సామ్ కంపెనీ ఓపెన్ ఏఐ చెబితే... ‘‘మా మోడళ్లను పరీక్షిస్తున్న సమయంలో భద్రతకు సంబంధించిన ఒక కీలక ఘటన చోటు చేసుకుంది’’అని సామ్ సొంతంగా చెప్పాడు. చాట్ జీపీటీ – 5.6 సోల్ ఏజెంట్‌తో మరో శక్తిమంతమైన ఏజెంట్ కలిసిపోవడం వల్ల ఇలా జరిగిందని ఓపెన్ఏఐ తెలిపింది. ఈ కొత్త మోడల్‌ను పరీక్షిస్తున్న సందర్భంలోనే హ్యాకింగ్ జరిగినట్లు చెప్పారు. చోరీ చేసిన క్రెడెన్షియల్స్‌తో తమ మోడల్ హగ్గింగ్ ఫేస్ అనే ఏఐ స్టార్టప్ సర్వర్లు అప్పటివరకూ గుర్తించని ఒక లోపాన్ని గుర్తించి లోనికి చొరబడిందని వివరించింది. ఒక చిన్న లక్ష్యాన్ని సాధించేందుకు తమ ఏఐ మోడల్ విపరీతానికి పాల్పడిందని, పరీక్షలో అక్రమంగా పాస్ అయ్యేందుకు అవసరమైన సమాచారాన్ని పొందగలిగిందని తెలిపారు. హగ్గింగ్ ఫేస్ అనే ఏఐ స్టార్టప్ వారం రోజుల క్రితం తమ డేటా ప్రాసెసింగ్ వ్యవస్థల్లోకి అక్రమ చొరబాటు జరిగినట్లు.. అది ఏఐ ఏజెంట్ ఒకటి సొంత నిర్ణయంతో జరిగినట్లు గుర్తించామని ప్రకటించింది. ఏఐ ఏజెంట్ తీరుతెన్నులను బట్టి అదో పెద్ద కంపెనీకి చెందినదే అని అనుకున్నామని, మా అనుమానం ఇప్పుడు నిజమైందని హగ్గింగ్ ఫేస్ సీఈవో క్లెమెంట్ డెలాంగ్యూ వ్యాఖ్యానించారు. మానవ ప్రమేయం లేకుండా ఏఐ మోడళ్లు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయన్న ప్రకటన చాలా ప్రమాదకరమైందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. మరీ ముఖ్యంగా ఏఐ మోడళ్లతో సైబర్ భద్రతకు సవాళ్లు ఎదురవుతున్న పరిస్థితుల్లో ఓపెన్ ఏఐ ఏజెంట్ మరో కంపెనీపై సైబర్ దాడికి దిగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆందోళనల మధ్యే గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఐ మోడళ్ల విడుదలకు ముందు జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యలను గుర్తించేందుకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఏఐ వ్యవస్థలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు నెల రోజుల ముందే అమెరికా ప్రభుత్వం వాటిని క్షుణ్ణంగా పరీక్షిస్తుంది. హ్యాకింగ్ ఘటనపై ఓపెన్ఏఐ స్పందిస్తూ... ‘‘కంప్యూటర్ వ్యవస్థల్లోని లోపాలను గుర్తించడం, వాటిని ఉపయోగించే విషయాల్లో ఏఐ వేగం పుంజుకుంటోంది. హ్యాకింగ్ ఘటన నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఏఐ సామర్థ్యానికి తగ్గట్టు భద్రత ఏర్పాట్లు కూడా చురుకుగా జరగాలి’’అని వ్యాఖ్యానించింది. మరోవైపు ఓపెన్ ఏఐ ఏదో దురుద్దేశంతో హ్యాకింగ్‌కు పాల్పడినట్లు తాము భావించడం లేదని, అందుకే సొంత నిర్ణయం తీసుకున్న ఏఐ వ్యవస్థకు సంబంధించి తాను కూడా ఏఐతో కలిసి పనిచేస్తున్నానని హగ్గింగ్ ఫేస్ సీఈవో క్లెమెంట్ డెలాంగ్యూ చెప్పారు. ఒక ఏఐ ఏజెంట్ ఇంకో కంపెనీపై హ్యాక్ చేయడం ఇదే మొదటిసారి కావచ్చునని అన్నారు. -
నెతన్యాహు అరెస్టవుతారా?
వాషింగ్టన్: గాజాలో యుద్ధ నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయన నిజంగా అరెస్టవుతారా? అనే దానిపై చర్చ మొదలైంది. ఐసీసీలో మొత్తం 124 సభ్యుదేశాలున్నాయి. అయితే, అన్ని దేశాలూ ఐసీసీ ఆదేశాలను పాటిస్తాయన్న గ్యారంటీ లేదు. అరెస్టు విషయంలో అవి సొంత నిర్ణయం తీసుకోవచ్చు. నెతన్యాహు తమ దేశానికి వస్తే అరెస్టు చేస్తామని ఇటలీ ప్రకటించింది. నెతన్యాహుతోపాటు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్ను హమాస్ నేతలతో సమానంగా ఐసీసీ పరిగణించడం సరైంది కాదని ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో చెప్పారు. ఐసీసీ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఒకవేళ నెతన్యాహు తమ దేశ భూభాగంలోకి ప్రవేశిస్తే చేస్తామని పేర్కొన్నారు. నెతన్యాహు అరెస్టుపై మరికొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం ఆచితూచి స్పందించాయి. ఐసీసీని తాము గౌరవిస్తామని, నెతన్యాహు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి క్రిస్టోఫీ లెమైన్ చెప్పారు. తమ వైఖరిని ఇప్పుడే వెల్లడించలేమని అన్నారు. ఐసీసీ జారీ చేసిన అరెస్టు వారెంట్ ఒక సాధారణ ప్రక్రియ అని, అది తుది తీర్పు కాదని స్పష్టం చేశారు. నెతన్యాహును అరెస్టు చేయబోమని ఇజ్రాయెల్ మిత్రదేశం జర్మనీ సంకేతాలిచ్చింది. ఇజ్రాయెల్ ప్రధానిపై ఐసీసీ అరెస్టు వారెంట్‌ను హంగెరీ ప్రధానమంత్రి విక్టన్ ఓర్బన్ బహిరంగంగా ఖండించారు. నెతన్యాహు తమ దేశంపై స్వేచ్ఛగా పర్యటించవచ్చని సూచించారు. పాలస్తీనాకు మద్దతిచ్చే స్లొవేనియా దేశం ఐసీసీ నిర్ణయాన్ని సమర్థించింది. అరెస్టు వారెంట్‌కు స్లొవేనియా ప్రధానమంత్రి రాబర్ట్ గొలోబ్ మద్దతు ప్రకటించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నిర్ణయాన్ని అమలు చేయడం అనేది రాజకీయపరమైన ఐచి్ఛకాంశం కాదని, చట్టపరమైన నిబంధన అని యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధానం చీఫ్ జోసెఫ్ బోరెల్ చెప్పారు. ఐసీసీ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. ఇలాంటి అరెస్టు వారెంట్లతో పరిస్థితి మరింత విషమిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఐసీసీ గత ఏడాది అరెస్టు వారెంట్ జారీ చేసింది. కానీ, ఆయన ఇప్పటికీ అరెస్టు కాలేదు. ఐసీసీ సభ్యదేశాలకు పుతిన్ వెళ్లలేదు. -
నెట్‌తో సొంత నిర్ణయాలు
వాషింగ్టన్: ఇంటర్నెట్ వినియోగించే పిల్లలు సమస్యల పరిష్కారానికి అవసరమయ్యే నిర్ణయాలను సొంతంగా నెట్ నుంచి క్రమంగా నేర్చుకుంటారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నెట్ వాడకుండా నిషేధించడం కంటే వినియోగించేలా చేయడ మే పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకున్న ఉత్తమ నిర్ణయం అవుతుందని స్పష్టంచేశారు. యుక్తవయసులో ఉన్న 68 మందిపై రెండు నెలలపాటు అధ్యయనం చేశారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారంప్రపంచ వ్యాప్తంగా 92 శాతం టీన్స్ నెట్ వాడుతున్నారు.


