breaking news
Ovens
-
మీ చేతిలోనే ‘పవర్’.. కరెంట్ బిల్లు స్లాబ్ రేట్ల తగ్గుదలకు 10 చిట్కాలు
విద్యుత్‌ను మనం ఉత్పత్తి చేయకపోవచ్చు కానీ.. వృథా చేయకుండా పొదుపు చేస్తే పరోక్షంగా ఉత్పత్తి చేసినట్లే. అనవసరంగా కరెంట్‌ను వాడకుండా పొదుపు చేయవచ్చు. తద్వారా వినియోగం యూనిట్లు తగ్గి బిల్లు స్లాబ్ రేట్లు తగ్గుతాయి. బిల్లుల రూపేణ చెల్లించే ఖర్చులు తగ్గుతాయి. మంగళవారం నుంచి 21 వరకు విద్యుత్ వారోత్సవాలు జరగనున్నాయి. కరెంటు ఆదా చేసే ఆ పది పద్ధతులు ఏంటో చూద్దాం. –సాక్షి, హన్మకొండ విద్యుత్ పొయ్యి ఆహారపదార్థాలు వండడానికి నిర్దేశించిన సమయానికంటే కొన్ని నిమిషాల ముందే విద్యుత్ స్టౌను ఆపేయాలి.సమతలమైన అడుగును కలిగిన వంటపాత్రలను ఉపయోగించాలి. ఎందుకంటే అవి పొయ్యిలోని కాయిల్ పూర్తిగా కప్పబడి ఉంటాయి. విద్యుత్ సద్వినియోగమై వంట త్వరగా పూర్తవుతుంది. మిక్సీలు రోజువాడే వాటిలో మిక్సీలు, గ్రైండర్లు ముఖ్యమైనవి. పొడిగా ఉండే వాటిని మెదపడానికి ఇవి ఎక్కువ సమయం తీసుకుంటాయి. తడి పదార్థాలను తక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి పొడులు చేయడం తగ్గించుకోవాలి. ఫైవ్‌స్టార్ రేటింగ్ ఉండే గృహోపకరణాలను వాడితే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఫ్యాన్లు ఫ్యాన్ లేని ఇల్లు.. గది అంటూ ఉండదు. మనం ఏ గదిలో ఉంటామో అక్కడే ఫ్యాన్ ఆన్ చేసుకోవాలి. అక్కడినుంచి మరో గదిలోకి వెళ్లినప్పుడు ఆఫ్ చేయడం మరిచిపోవద్దు. రెగ్యులరేటర్‌ను కచ్చితంగా వాడాలి. ఇప్పుడు తక్కువ కరెంటు వినియోగంతో.. ధారాళంగా గాలి వచ్చే ఫ్యాన్లు వస్తున్నాయి. వాటిని వాడాలి. బల్బులు ఆర్పివేయాలి ఉపయోగం లేనప్పుడు బల్బులను వెంటనే ఆర్పివేయాలి. కిటికీలను తెరిచి ఉంచడం, లేతరంగుల కర్టెన్లను ఉపయోగించడం ద్వారా పగటి కాంతి ప్రతిభావతంగా వస్తుంది. ఎల్ఈడీ బల్బులు నాలుగు రెట్ల వెలుగునిస్తాయి. తద్వారా విద్యుత్ పొదుపు అవుతోంది. బాత్రూమ్లలో చిన్న బల్బులను వాడాలి. బల్బులు ఆర్పివేయాలి. ఉపయోగం లేనప్పుడు బల్బులను వెంటనే ఆర్పివేయాలి. కిటికీలను తెరిచి ఉంచడం, లేతరంగుల కర్టెన్లను ఉపయోగించడం ద్వారా పగటి కాంతి ప్రతిభావతంగా వస్తుంది. ఎల్ఈడీ బల్బులు నాలుగు రెట్ల వెలుగునిస్తాయి. తద్వారా విద్యుత్ పొదుపు అవుతోంది. బాత్రూమ్లలో చిన్న బల్బులను వాడాలి. ఎయిర్ కండిషనర్లు గది ఉష్ణోగ్రతను బట్టి దానికదే నియంత్రించుకునే పరికరాలను కొనాలి. తక్కువ చల్లదనం స్థితిలో ఉండేలా రెగ్యులేటర్లను ఉంచాలి. ఏసీతోపాటు సీలింగ్ ఫ్యాన్ కూడా వేసి ఉంచండి. అందువల్ల గది మొత్తం తొందరగా చల్లబడుతుంది. ఏసీలోని ధర్మోస్టాట్ నార్మల్ దగ్గర ఉంచాలి. లేకపోతే ఎక్కువ కరెంట్ ఖర్చవుతుంది. ఫ్రిజ్‌లు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయడం వల్ల మాన్యువల్ డీప్రాస్ట్ చేయాల్సిన ఫ్రిజ్, ఫ్రిజర్లు, ఫ్రిజ్‌లోని మోటార్ సరిగ్గా పనిచేసేందుకు శక్తిని పెంచుకుంటాయి. ఫ్రిజ్‌కు.. గోడకు మధ్య గాలి ఆడేలా కొంతస్థానాన్ని ఉంచాలి. డోర్ సరిగ్గా పట్టిందో, లేదో సరిచూసుకోవాలి. వేడిగా లేదా వెచ్చని పదార్థాలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. మైక్రోవేవ్స్ ఓవెన్స్ ఇవి సంప్రదాయక విద్యుత్ లేదా గ్యాస్ స్టౌ కన్నా 50 శాతం తక్కువ శక్తిని వినియోగిస్తాయి. ఆహారపదార్థాలు ఓవెన్లో పెట్టాక ఎంత వరకు వచ్చాయో చూడడానికి మాటిమాటికి తలుపు తెరవద్దు. అలా తెరచిన ప్రతిసారీ 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. తిరిగి మళ్లి వేడెక్కడానికి విద్యుత్ ఖర్చవుతుంది. టీవీ టీవీ లేని ఇల్లు ఉండదు. ఇప్పుడు అంతా ఎల్ఈడీ, ఎల్సీడీ అధునాత టెక్నాలజీతో వస్తున్నాయి. ఒక్కోసారి మనం టీవీ ఆన్‌చేసి ఇతర పనుల్లో నిమగ్నమవుతాం. అది మోగుతూనే ఉంటుంది. అలాకాకుండా మనం చూసిన తరువాత ఆఫ్ చేయడం మరిచిపోవద్దు. ఆన్‌లో ఉంటే 10వాట్ల శక్తిని నష్టపరుస్తుంది. కంప్యూటర్లు ఉపయోగించనప్పుడు ఇంట్లో, ఆఫీసులో కంప్యూటర్లను ఆఫ్ చేయడం మంచిది. ఎందుకంటే 24 గంటలు పనిచేసే ఒక కంప్యూటర్, ఫ్రిజ్ కన్నా ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. స్లీప్ మోడ్ ఉండేలా సెట్టింగ్ చేయడం ద్వారా దాదాపు 40శాతం విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. ల్యాప్‌టాప్‌ను కూడా ఇదేవిదంగా చేయాలి. సోలార్ వాటర్ హీటర్ చలికాలంలో వేడినీటితో స్నానం తప్పనిసరి. నీటిని వేడి చేసేందుకు విద్యుత్ హీటర్ బదులుగా సోలార్ వాటర్ హీటర్‌ను ఉపయోగించడం ఉత్తమం. విద్యుత్ హీటర్ ఎక్కువ కరెంటును తీసుకుంటుంది. కొంత ప్రమాదకరం కూడా. రోజువారీగా చెక్ చేసుకుంటూ పోతే సోలార్కు పెద్దగా ఖర్చు ఉండదు. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి... వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి. దీనివల్ల ధనాన్ని పొదుపు చేసుకున్నట్లే. వినియోగదారులు విద్యుత్ చాలా తక్కువగా వినియోగించే ఉపకరణాలు వాడాలి. టీఎస్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ పొదుపు చేయడంలో, సౌర విద్యుత్ ఉత్పత్తిలో ముందుంది. ఇండియా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఊర్జా, స్కోచ్ అవార్డులు అందుకుంది. -ఎన్నమనేని గోపాల్‌రావు, సీఎండీ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ -
పిజ్జా పుట్టిన ప్రాంతంలో పొల్యూషన్ రగడ..!
నేను యాంటీ పిజ్జా మేయర్‌ని అంటున్నాడు... ఇటలీ శాన్ విటలియానో లో సివిక్ లీడర్ గా మారిన ఓ డాక్టర్. ప్రజారోగ్యమే తనకు ముఖ్యమని, అందుకు తనవంతు ప్రయత్నాన్ని ప్రారంభించానని చెప్తున్నాడు. నీపోలిటన్ హింటర్ ల్యాండ్ లోని ఓ చిన్న పట్టణానికి మేయర్ అయిన ఆయన.. వాయు కాలుష్యాన్ని తగ్గించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడు. అందుకు టాక్సిక్ ఎయిర్ పొల్యూషన్ కలిగించే కట్టెల పొయ్యిల వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు కూడ జారీ చేశాడు. అయితే పిజ్జా పుట్టిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతంలో కట్టెల పొయ్యిల నిషేధం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కట్టెల పొయ్యిలను వాడే కుటుంబాలు, పిజ్జాలు తయారు చేసే బేకరీలు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారస్తులు ఇప్పుడు ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ వెంటనే రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు కూడ వెల్లువెత్తాయి. అయితే చైనా రాజధాని నగరమైన బీజింగ్ లో ఇప్పటికే కాలుష్య పొగమంచుపై రెడ్ అలర్ట్ ప్రకటించారని, ముందు జాగ్రత్త చర్యగానే తాను ఆ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ చెప్తున్నారు. వాయుకాలుష్యంపై అత్యవసర చర్యలు చేపట్టడంలో భాగంగా... చట్ట పరిమితులు దాటి కాలుష్యాన్నిసృష్టించడాన్ని ఫాల్కోన్ వ్యతిరేకిస్తున్నారు. అయితే ట్రాఫిక్ పొల్యూషన్ తగ్గించడంలో భాగంగా ఇప్పటికే ఒక్కోరూ ఒక్కో పద్ధతిని అమల్లోకి తెస్తూనే ఉన్నారు. రోమ్ 'ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్స్' ను ప్రవేశ పెట్టగా... మిలాన్ వారంలో మూడు రోజులపాటు వాహనాల వాడకాన్నేనిషేధించింది. తమవంతు బాధ్యతగా మిలాన్ తో పాటు చాలా నగరాలు న్యూ ఇయర్ వేడుకల్లో టపాసుల వినియోగాన్ని కూడ నిషేధించాయి. అయితే వాయు కాలుష్యంలో యూరప్ లోనే ఇటలీ.. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతమని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఇటలీలో సంవత్సరానికి సుమారు 30 వేలమంది దాకా కాలుష్యంతో మరణిస్తున్నట్లు 2015 ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో శీతాకాలంలో పెరిగే కాలుష్యాన్నినిషేధించేందుకు పురపాలక సంఘాలు కాలుష్య మూలాల నిషేధాన్ని అమల్లోకి తెచ్చాయి. జాతీయ వాతావరణ శాఖామంత్రి పర్యావరణంపై పురపాలక సంఘాల ప్రతినిధులతో రోమ్ లో అత్యవసర సమావేశం కూడ నిర్వహించారు. ఇళ్ళలో, కార్యాలయాల్లో థర్మోస్టాట్ల వాడకాన్నినిషేధించారు. నగరాల్లో స్పీడ్ లిమిట్ ను అమల్లోకి తెచ్చారు. పాత కార్ల వాడకానికి స్వస్తి పలికి, ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలని ఆదేశించారు. పొగ గొట్టాల వాడకంపై కూడ పరిమితులు విధించారు. అయితే చట్టాలు, నిషేధాలతో పొల్యూషన్ ను నియంత్రించడాన్ని అమలు చేస్తున్న లక్షల ప్రాంతాల్లో ఇటలీ ఒకటి. పొల్యూషన్ సమూలంగా నిర్మూలించాలంటే ఇటువంటి బాధ్యతను సక్రమంగా అమలు చేయడం ఫాల్కోన్ వంటి ప్రతి మేయర్ పైనా ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక పిజ్జా విక్రయదారులు, వ్యాపారస్తులు ఫిబ్రవరి 29 నాటికి ఓవెన్లకు తగిన పొల్యూషన్ ఫిల్టర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మార్చి 1 నుంచి ఇనస్పెక్లర్లు తనిఖీలు ప్రారంభిస్తారని, ఫిల్టర్లు లేని రెస్టారెంట్లు, పిజ్జా తయారీదారుల లైసెన్సులు రద్దు చేస్తారని హెచ్చరించారు. కాగా ప్రాణాంతకమైన పొల్యూషన్ నియంత్రణపై అవగాహన అనంతరం పిజ్జా విక్రయదారులు కూడ మేయర్ కు సహకరించేందుకు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. అయితే ఇటువంటి పెద్ద సమస్యను మిణుగురు పురుగువంటి తమ చిన్న పట్టణంలో అమలు చేస్తే సరిపోదని, మిగిలిన నగరాల మాటేమిటని ప్రశ్నిస్తున్నారు.