breaking news
Osmania hospitals
-
నూతన భవనం కోసం ఉస్మానియాలో వినూత్న నిరసన
-
ఉస్మానియాలో ఆగిన అత్యవసర సేవలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం మరో సారి బయటపడింది. రోగులకు అందుబాటులో ఉండాల్సిన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు విశ్రాంతి గదులకే పరిమితం కావడం, కనీస సమాచారం లేకుండా ముగ్గురు హౌస్సర్జన్లు విధులకు డుమ్మాకొట్టడంతో శనివారం రాత్రి అత్యవసర విభాగంలో వైద్య సేవలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి తర్వాత సూపరింటెండెంట్ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేసి, విధులకు గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్సర్జన్లు విధులకు డుమ్మా... అత్యవసర విభాగానికి రోజుకు వందకుపైగా కేసులు వస్తుంటాయి. వీటిలో రోడ్డు, ఇతర ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రుల కేసులే అధికం. శనివారం రాత్రి క్యాజువాలిటీలో ముగ్గురు హౌస్ సర్జన్లు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండానే విధులకు గైర్హాజరయ్యారు. ప్రత్యామ్నాయ ఏ ర్పాట్లు చేయాల్సిన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో అర్ధరాత్రి వరకు వైద్యసేవలు నిలిచిపోయాయి. దీం తో రోగులు, వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. రోగులు, బంధువులు ఆగ్రహం వైద్యులు లేకపోవడంతో బాధితుల కు రాత్రంతా నిరీక్షణ తప్పలేదు. దీం తో రోగులు, బంధువులు ఆస్పత్రి వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఆస్పత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేశా రు. విధుల్లో ఉన్న సీఎంఓలు రోగులను పట్టించు కోకపోవడంతో పాటు, ముగ్గురు హౌస్ సర్జన్లు విధులకు గైర్హాజరైనట్లు గుర్తించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర విభాగాల్లో ఉన్న సీనియర్ రెసిడెంట్లను పిలిపించి వైద్యసేవలను పునరుద్ధరించారు. చర్యలు తీసుకుంటాం: నాగేందర్ విధులకు ౖగైర్హాజరైన ముగ్గురు హౌస్‌సర్జన్లపై చర్యలు తీసుకుంటామని నాగేందర్ తెలిపారు. -
ఒకే రోజు నాలుగు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు
నలుగురికి ఊపిరి పోసిన మహిళ ప్రభుత్వాసుపత్రుల్లో ఇదే తొలిసారి హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాసుపత్రుల చరిత్రలోనే తొలిసారిగా హైదరాబాద్ నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఒకేరోజు నాలుగు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. నిమ్స్‌లో గుండె, కిడ్నీ, ఉస్మానియాలో కాలేయం, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను వైద్యులు ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు చెందిన 33 ఏళ్ల మహిళ అవయవాలను దానం చేసి నలుగురికి పునర్జన్మనిచ్చారు. ఈ నెల 3న ఎద్దు పొడవడంతో ఆ మహిళ తీవ్ర గాయాలపాలయ్యారు. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్‌డెడ్ అయినట్టు ప్రకటించిన వైద్యులు ఆమె బంధువులకు అవయవ దానంపై అవగాహన కల్పించారు. అందుకు వారు అంగీకరించడంతో జీవన్‌దాన్‌లో అవయవ మార్పిడి శస్త్రచికిత్స కోసం పేర్లు నమోదు చేసుకున్న నలుగురికి ఆమె అవయవాలను అమర్చాలని వైద్యులు నిర్ణయించారు. బ్రెయిన్‌డెడ్ మహిళ నుంచి సేకరించిన గుండెను బెలెటైడ్ కార్డియోపతి (గుండె కండరాలు దెబ్బతినడం)తో బాధపడుతున్న మంచిర్యాలకు చెందిన జ్యోతి(23)కి, మరో బాధితుడికి ఒక కిడ్నీని నిమ్స్ వైద్యులు అమర్చారు. అలాగే ఉస్మానియాలో చికిత్స పొందుతున్న ఓ బాధితుడికి కాలేయాన్ని, మరొకరికి మూత్రపిండాన్ని విజయవంతంగా అమర్చారు.