breaking news
Organizer magazine
-
సామ్యవాద, లౌకిక పదాలను సమీక్షించాలి
న్యూఢిల్లీ: దేశ రాజ్యాంగం వాస్తవ స్ఫూర్తిని పునరుద్ధరించేందుకు పీఠికలో సవరణ ద్వారా చేర్చిన ’సోషలిస్ట్’, ’లౌకిక’ పదాలపై సమీక్ష చేపట్టాలని రాష్రీ్టయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబళె పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ తీసుకువచ్చిన పలు వక్రీకరణ విధానాల నుంచి రాజ్యాంగానికి విముక్తి కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన రాసిన వ్యాసం శుక్రవారం ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక ఆర్గనైజర్‌లో ప్రచురితమైంది. 1948లో దేశాన్ని సెక్యులర్, ఫెడరల్, సోషలిస్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్’గా భారత్‌ను పేర్కొనాలన్న ప్రతిపాదనను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సారథ్యంలో రాజ్యాంగ సభలో జరిగిన చర్చ సందర్భంగా తిరస్కరించారని హొసబళె తన వ్యాసంలో గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన 42వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ సభ చర్చా ప్రక్రియకు ప్రతిబింబం కాదన్నారు. భవిష్యత్ తరాలకు అధికారం ఇచ్చే ప్రజాస్వామ్య చట్రం అనే అంబేద్కర్ దార్శనికతకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసేందుకు హోసబళె బహిరంగ చర్చను కోరుకున్నారని ఆర్గనైజర్ వారపత్రిక వివరించింది. అంతేతప్ప, రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఆయన ఉద్దేశం కానేకాదని స్పష్టత నిచ్చింది. కాంగ్రెస్ వంచనను బయటపెట్టి, రాజ్యాంగం నిజ స్ఫూర్తికి గౌరవం కల్పించేందుకు చర్చ జరగాల్సిన అవసరముందని పేర్కొంది. హొసబళె వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మన రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ ఎన్నడూ ఆమోదించలేదని, రాజ్యాంగాన్ని రద్దు చేయడమనే దీర్ఘకాలం కుట్రలో తాజా వ్యాఖ్యలు ఒక భాగమని ఆరోపించింది. రాజ్యాంగం ఆత్మపై ఆర్ఎస్ఎస్ ఉద్దేశ పూర్వకంగా దాడి చేస్తోందిన మండిపడింది. సోషలిస్ట్, సెక్యులర్ విధానాల కోసమే స్వాతంత్య్ర పోరాట యోధులు తమ జీవితాలను త్యాగం చేశారని సీపీఎం పేర్కొంది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి హొసబళె వ్యాఖ్యలను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. దేశాన్ని ‘హిందూ రాష్ట్ర’గా మార్చాలన్న ఆర్ఎస్ఎస్ కుట్రలో ఇదో భాగమని పేర్కొంది.ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగింది: రాహుల్ ఆర్ఎస్ఎస్ నేత హొసబళె వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఆర్ఎస్ఎస్కు కావాల్సింది మనుస్మృతే తప్ప రాజ్యాంగం కాదన్న విషయం మరోసారి రూఢీ అయ్యిందని విమర్శించారు. రాజ్యాంగం వంటి శక్తివంతమైన ఆయుధాన్ని, హక్కులను లాగేసుకుని, సామాన్యులను బానిసలుగా మార్చడమే ఆర్ఎస్ఎస్ వాస్తవ అజెండా అని ఆయన శుక్రవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ అజెండా ఎన్నటికీ నిజం కాబోదు, ఇలాంటి కలలను కనడం ఆర్ఎస్ఎస్ మానుకోవాలని హితవు పలికారు. దేశభక్తి కలిగిన ప్రతి భారతీయుడూ రాజ్యాంగాన్ని ఆఖరి శ్వాస వరకు కాపాడుకుంటారని రాహుల్ స్పష్టం చేశారు. -
అంబేడ్కర్ ఆలోచనల వక్రీకరణ బాధాకరం
అంబేడ్కర్ మనవడు ఆనంద్ తేల్తుంబ్డే హైదరాబాద్: అంబేడ్కర్ ఆలోచనలు, తాత్విక చింతనపై ‘ఆర్గనైజర్’ పత్రిక ప్రత్యేక సంచికను విడుదల చేయడం హర్షణీయమని, అదే సమయంలో ఆయన ఆలోచనలను వక్రీకరించడం బాధాకరమని, అంబేడ్కర్ మనవడు, ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే అన్నారు. తాత్విక చింతన, సామాజిక, ఆర్థిక అంశాలపై అంబేద్కర్ భావజాలం చాలా విశిష్టమైనదని కొనియాడారు. ‘అంబేడ్కర్ ఆలోచనలను ఎవరూ వక్రీకరించలేరు.’ అనే పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ చెప్పినవి చెప్పినట్లు రాస్తే తమకు బాధ కలిగి ఉండేది కాదని, అబద్ధాలను జోడించి పుస్తకాన్ని విడుదల చేయడం సరికాదని విచారం వ్యక్తం చేశారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం మాట్లాడుతూ అంబేడ్కర్‌పై ఆర్గనైజర్ అనే ఆర్ఎస్ఎస్ పత్రిక తీసుకువచ్చిన ప్రత్యేక సంచికలో ఒకటి తప్ప అన్ని వ్యాసాల్లోనూ వక్రీకరణలు ఉన్నాయన్నారు. వక్రీకరణలను, మోసాలను, అవమానాలను ఎదుర్కొనేందుకే ‘అంబేడ్కర్ ఆలోచనలను ఎవరూ వక్రీకరించలేరు’ అనే పుస్తకాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. అన్ని ప్రధాన నగరాల్లో సదస్సులను ఏర్పాటు చేసి ఈ వక్రీకరణలను ప్రజల్లో ఎండగడతామన్నారు. కార్యక్రమంలో ఇఫ్లూ అసోసియేట్ ప్రొఫెసర్ కె.సత్యనారాయణ, హెచ్‌సీయూ అసోసియేట్ ప్రొఫెసర్లు కె.వై.రత్నం, కె.లక్ష్మీనారాయణ, విరసం నేత వరవరరావు పాల్గొన్నారు.