breaking news
opt
-
అమెరికా ఉద్యోగానికి లక్ష డాలర్ల ఫీజు?
వాషింగ్టన్: చదువు తరువాత అమెరికాలోనే ఉద్యోగం చేసేందుకు వీలు కల్పించే ఆప్షన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) వీసా ఫీజు లక్ష డాలర్లు కానుందా? అవునంటోంది వాల్‌స్ట్రీట్ జర్నల్. హెచ్–1బీ వీసా ఫీజులను లక్ష డాలర్లకు పెంచేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు న్యాయస్థానాల్లో బెడిసికొట్టడంతో ఇప్పుడు ‘డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ’(డీహెచ్ఎస్)ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. విదేశీ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ తరువాత తాము చదువుకున్న సబ్జెక్టులోనే ఏడాది నుంచి మూడేళ్లు ఉద్యోగం చేసేందుకు ఈ ఓపీటీ వీసా ఉపయోగపడుతుంది. యూఎస్ యూనివర్శిటీల్లో అత్యధిక నియామకాలు చేపట్టే టెక్నాలజీ ఆధారిత కంపెనీలు హెచ్–1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఓపీటీ ఫీజు లక్ష డాలర్లకు పెంచే విషయంపై డీహెచ్ఎస్ ఆచితూచి ఒక ప్రకటన చేసింది. అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ ఏదీ ఫైనల్ కాదని స్పష్టం చేసింది. ‘‘అందుబాటులో ఉన్న విషయాలన్నింటిపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. చట్టపరంగా ఈ దేశానికి వలస వచ్చే వ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు వీటిని ఉపయోగిస్తాం’’అని అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు. ఇతర దేశాల నుంచి గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు దరఖాస్తుతోపాటు లక్ష డాలర్ల బాండ్ ఒకటి సమర్పించేలా కూడా డీహెచ్ఎస్ ఆలోచన చేస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం తెలిపింది. దరఖాస్తుదారు అమెరికా వచ్చి పౌరసత్వం పొందిన తరువాత బాండ్ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. -
H1B వీసాపై కత్తి
-
65 ఏళ్ల వయసులో ఓంపురి సంచలన నిర్ణయం
ముంబై: సీనియర్ నటుడు ఓం పురి దంపతులు విడిపోయారు. అయితే వాళ్లకు కోర్టు మాత్రం విడాకులు మంజూరు చేయలేదు. 26 ఏళ్ల క్రితం పెళ్లయిన ఓంపురి, నందిత దంపతులు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. అయితే తర్వాత ఇద్దరూ రాజీకి రావడంతో కోర్టు వారికి 'జ్యుడీషియల్ సెపరేషన్' మంజూరు చేసింది. దీని ప్రకారం వాళ్లిద్దరూ చట్ట ప్రకారం భార్యాభర్తలుగానే ఉంటారు గానీ.. విడివిడిగా ఉండాలి. ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. కొడుకు ఇషాన్ (18) బాగోగులను మాత్రం ఇద్దరూ చూసుకుంటారు. మొత్తానికి 65 ఏళ్ల వయసులో ఓంపురి భార్య నుంచి విడిపోవాలన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు! అయితే.. కోర్టు వీళ్లకు ఓ నిబంధన కూడా విధించింది. ఒకవేళ మళ్లీ వీళ్లు తిరిగి ఎప్పుడు కలవాలన్నా.. ఓ థర్డ్ పార్టీ సమక్షంలోనే కలుసుకోవాలని షరతు విధించింది. అలాగే ఓంపురికి తన 18 ఏళ్ల కొడుకుని కలుసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో ఇద్దరూ ఒకరిపై మరొకరు పెట్టిన కేసులను ఉపసంహరించుకున్నారు. భవిష్యత్తులో మళ్లీ మీరు కలిసి జీవించే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించినపుడు.. చెప్పలేం అని నందిత సమాధానమిచ్చారు. అసలు గొడవ ఎలా వచ్చిందంటే.. సుదీర్ఘ కాలం పాటు సంసార జీవితాన్ని గడిపిన ఓంపురి, నందితలకు అసలు గొడవ ఓ పుస్తకం కారణంగా వచ్చింది. 2009లో 'అన్ లైక్లీ హీరో, ది స్టోరీ అఫ్ ఓంపురి' అంటూ ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని నందిత రాసి విడుదల చేశారు. దాంట్లో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన, ఓంపురికి సంబంధించిన కొన్ని అభ్యంతరకర శృంగార ఘటనలను ప్రచురించడం, అది కూడా చాలా అగౌరవకరంగా ఉండటంతో ఓంపురికి ఎక్కడలేని కోపం వచ్చింది. అప్పటి నుంచి వారి మధ్య వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలోనే భర్త తనపై దాడి చేశాడంటూ ముంబైలోని వెర్సోవా పోలీసుస్టేషన్లో గృహహింస కేసును నమోదుచేసిన సంగతి తెలిసిందే.


