breaking news
Open Super Series badminton tournament
-
Taipei Open 2022: క్వార్టర్స్‌లో కశ్యప్
తైపీ: భారత సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్ తైపీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు. డబుల్స్‌లో తనీషా క్రాస్టో రెండు విభాగాల్లో క్వార్టర్స్ చేరింది. మహిళల, మిక్స్డ్ డబుల్స్‌లో దూసుకెళుతోంది. గురువారం జరిగిన రెండో రౌండ్లో మూడో సీడ్ కశ్యప్ 21–10, 21–19తో చియ హో లీ (తైపీ)పై గెలుపొందగా, మిథున్ 24–22, 5–21, 17–21తో నాలుగో సీడ్ నరవొక (జపాన్) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్‌లో సామియా ఫారుఖీ 18–21, 13–21తో వెచ్ చి హూ (తైపీ) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో తనీషా–సృష్టి జోడీ 21–14, 21–8తో జియా యిన్–లిన్ యూ (తైపీ)పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా–ఇషాన్ ద్వయం 21–14, 21–17తో చెంగ్ కై వెన్– వాంగ్ యూ (తైపీ)పై నెగ్గింది. -
సైనా, శ్రీకాంత్ శుభారంభం
► సింధు, గురుసాయిదత్ ఓటమి ► ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లరకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల, పురుషుల సింగిల్స్‌లో సైనా, శ్రీకాంత్ శుభారంభం చేయగా, సింధు, గురుసాయిదత్ నిరాశపర్చారు. బుధవారం జరిగిన తొలిరౌండ్లో ఏడోసీడ్ సైనా 21-10, 21-14తో జోయ్ లాయ్ (ఆస్ట్రేలియా)పై నెగ్గగా; ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 15-21, 19-21తో ప్రపంచ 40వ ర్యాంకర్ కిమ్ హో మిన్ (కొరియా) చేతిలో కంగుతింది. మరో మ్యాచ్‌లో తన్వీ లాడ్ 18-21, 21-14, 21-11తో క్వాలిఫయర్ టిఫానీ హో (ఆస్ట్రేలియా)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో 12వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-16, 21-12తో ప్రపంచ 11వ ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలవగా; క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన గురుసాయిదత్ 19-21, 21-12, 15-21తో ప్రపంచ 14వ ర్యాంకర్ హు యున్ (హాంకాంగ్) చేతిలో ఓడాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 22-20, 15-21, 21-15తో ముస్తాఫా (ఇండోనేషియా)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో నిఖర్ గార్గ్-అనిల్ జోడి 12-21, 10-21తో ఎనిమిదోసీడ్ షేమ్ గో- టాన్ (మలేసియా) చేతిలో ఓడింది.