breaking news
online music
-
ఆన్లైన్ సరిగమలు
జూబ్లీహిల్స్: ఆమెకు సంగీతమంటే ప్రాణం. ఐదేళ్ల వయసులోనే సరిగమలు నేర్చుకోండం ప్రారంభించి సింగీంలో డిప్లొమా చేశారు. మరోపక్క బదుకుదెరువు కోసం ఇంజినీరింగ్ చదివారు. అయితే, మనసు మాత్రం సంగీతమే ప్రపంచమని చెప్పడంతో అటువైపుఅడుగులు వేశారు. ఆమె ‘మునుకుట్ల సౌజన్య’. ఈమె చదివింది ఇంజినీరింగ్ అయినా అటువైపు వెళ్లకుండా తిరుపతి పద్మావతి మహిళా విశ్యవిద్యాలయంలో కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు. శాస్త్రీయ సంగీతమే ప్రాణంగా భావిస్తూ ఆన్లైన్ వేదికగా ఉచితంగా సంగీత పాఠాలు చెబుతున్నారు. సౌజన్య పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుట్టిపెరిగారు. అక్కడే ఇంజినీరింగ్ పూర్తి చేశారు. వివాహం అనంతరం బెంగళూరు తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారు. దీంతో ఆమె ఇక్కడి ఆలయాల్లో నిర్వహించే ఆధ్యాత్మిక వేడుకల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడు భర్త ఉద్యోగరీత్యా జర్మనీ వెళ్లడంతో ఆమె కూడా వెంట వెళ్లారు. అయినప్పటికీ పరాయి దేశం వెళ్లినా సంగీత మూలాలు, ఇక్కడి వారిని మరిచిపోకుండా ఆన్లైన్ వేదికగా సంగీత పాఠాలు చెబుతున్నారు. ‘శ్రీవారి సేవాస్ఫూర్తి’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించి కర్ణాటకసంగీతంపై వరుసగా వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. ప్రత్యేకించి అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలు పాడుతూ, వాటి అర్థాలను వివరిస్తూ సౌజన్య చేస్తున్న వీడియోలకు వీక్షకుల నుంచి అద్భుత ఆదరణ లభిస్తోంది. మాతృభూమికి దూరంగా ఉన్నా కళలపై ఉన్న ప్రేమతో ఇంత చేయగలుగుతున్నానని ఆమె సంతోషంగా చెబుతున్నారు. -
భలే ఆప్స్
బ్యాటరీ మన్నికకు కొత్త ఆప్... బ్యాటరీ ఛార్జింగ్‌ను ఎక్కువకాలం పనిచేయించేందుకు గూగుల్ ప్లే స్టోర్‌లో బోలెడన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవేవీ బ్యాటరీ మరింత ఎక్కువ కాలం మన్నేలా చేయలేవు. కానీ పర్డ్యూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ఛార్లీ హూ అభివృద్ధి చేసిన ఎస్టార్ అప్లికేషన్ మాత్రం బ్యాటరీ జీవితకాలాన్ని కూడా పెంచుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న, లేదా చేసుకోబోతున్న అప్లికేషన్లు ఎంత మేరకు విద్యుత్తు ఖర్చు చేస్తాయో ఎప్పటికప్పుడు లెక్కకట్టి మీకు తెలియజేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అంటున్నారు ఛార్లీ. ఈ సమాచారం ఆధారంగా మీరు ఎక్కువ విద్యుత్తును వాడుకునే అప్లికేషన్లను తొలగించుకోవచ్చు. ఎస్టార్ సూచించే పొదుపైన ఆప్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా విద్యుత్తును ఆదా చేసి, బ్యాటరీ ఎక్కువ సార్లు రీఛార్జ్ చేయాల్సిన అవసరాన్ని తగ్గించవచ్చునన్నమాట. ఇవన్నీ చేస్తే బ్యాటరీ జీవితకాలం కూడా పెరిగిపోతుందన్నది తెలిసిందే. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తున్న ఎస్టార్లో ఫైవ్‌స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను పోలిన కోడింగ్ ఉంటుంది. ఆన్లైన్ మ్యూజిక్, రేడియో కోసం వింక్స్.. ప్రముఖ సెల్‌ఫోన్ క్యారియర్ సంస్థ ఎయిర్టెల్ మ్యూజిక్ రంగంలోకి అడుగుపెట్టింది. వింక్స్ పేరుతో ఒక అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఆండ్రాయిడ్ లేదా ఆపిల్ ఐఫోన్లలో ఈ అప్ ద్వారా సంగీతాన్ని ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు. ఎయిర్టెల్ కనెక్షన్ లేకున్నా ఉచితంగా పాటలను వినే అవకాశం ఉండటం విశేషం. ఈ సర్వీసులో దాదాపు ఎనిమిది భాషలకు సంబంధించిన 17 లక్షల పాటలు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. వినే పాటల్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారికి ప్రస్తుతం రెండు రకాల సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయని కంపెనీ తెలిపింది. వింక్ ప్లస్ సబ్స్క్రిప్షన్ నెలకు రూ.99 కాగా, వింక్ ఫ్రీడమ్ ఎయిర్టెల్ వినియోగదారుల కోసం ఉద్దేశించింది. ఆర్టిస్ట్, మూడ్స్, జెనెర్ విభాగాల్లో లభ్యమయ్యే పాటలను 32, 64, 128 కేబీపీఎస్ నాణ్యత ప్రమాణాల్లో వినే అవకాశం ఉంది.