breaking news
Online furniture market
-
రిలయన్స్ చేతికి అర్బన్ ల్యాడర్
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ దిగ్గజం ముకేశ్ అంబానీ పెట్టుబడుల జైత్రయాత్ర కొనసాగుతోంది. రిటైల్ రంగంలో మరింత విస్తరించడమే లక్ష్యంగా ఆన్లైన్ ఫర్నిచర్ రిటైల్ సంస్థ అర్బన్ ల్యాడర్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు చెందిన రిటైల్ విభాగం చేజిక్కించుకుంది. ‘అర్బన్ ల్యాడర్ హోమ్ డెకార్ సొల్యూషన్స్ లిమిటెడ్‌లో 96 శాతం వాటాను రిలయన్స్ అనుబంధ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్) కొనుగోలు చేసింది. దీనికోసం రూ.182.12 కోట్లను చెల్లించాం’ అని ఆర్ఐఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. మిలిగిన వాటాను కూడా కొనుగోలు చేసే (100 శాతానికి) అవకాశం తమకు ఉందని వెల్లడించింది. కాగా, 2023 డిసెంబర్ నాటికల్లా అర్బన్ ల్యాడర్‌లో ఆర్ఆర్వీఎల్ మరో రూ.75 కోట్ల పెట్టుబడిని వెచ్చించనున్నట్లు కూడా ఆర్ఐఎల్ తెలిపింది. ఈ కొనుగోలుకు ప్రభుత్వ, నియంత్రణపరమైన అనుమతులేవీ తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది. ఈ–కామర్స్ రంగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలతో పోటపోటీగా తమ వినియోగదారులకు మరిన్ని విభాగాల్లో ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు ఆర్ఐఎల్కు ఈ తాజా కొనుగోలు దోహదం చేయనుంది. కాగా, ఆర్ఆర్వీఎల్లో పలు అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజ సంస్థలకు వాటా విక్రయాల ద్వారా గడిచిన రెండు నెలల్లో ఆర్ఐఎల్ రూ.47,265 కోట్ల భారీ నిధులను సమీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్ఆర్వీఎల్ విలువ రూ.4.58 లక్షల కోట్లకు చేరింది. రిలయన్స్ రిటైల్‌కు దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 12,000 స్టోర్లు ఉన్నాయి. -
దిగ్గజాలొస్తే.. తగ్గుతామా?
2017లో దేశంలోకి అంతర్జాతీయ ఫర్నిచర్ దిగ్గజాలు హైదరాబాద్‌లో ఐకియా, ఢిల్లీలో రోచె బొబీస్ స్టోర్లు పోటీకి ఆన్లైన్ స్టార్టప్స్ సై... నిధుల సమీకరణ.. విస్తరణ బాటలో మరికొన్ని కంపెనీలు నాలుగేళ్లలో 30 బిలియన్ డాలర్లకు దేశీ ఫర్నీచర్ మార్కెట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రస్తుతం దేశీ ఫర్నీచర్ పరిశ్రమ 25 బిలియన్ డాలర్లుగా ఉంది. దీన్లో ఆన్లైన్ ఫర్నీచర్ మార్కెట్ వాటా 25 మిలియన్లుంటుందనేది క్రాఫ్ట్డ్రివెన్ మార్కెట్ రీసెర్చ్ నివేదిక సారాంశం. రెండేళ్లుగా ఆన్లైన్ ఫర్నీచర్ సంస్థల కారణంగా ఈ-ఫర్నీచర్ పరిశ్రమ 49 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. 2020 నాటికి మొత్తం పరిశ్రమ 30 బిలియన్ డాలర్లకు, ఆన్లైన్ మార్కెట్ 700 మిలియన్ డాలర్లకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది. విదేశీ పెట్టుబడుల దన్ను...: ప్రస్తుతం దేశంలో కస్టమ్ ఫర్నీష్, ఫ్యాబ్ ఫర్నీష్, పెప్పర్ఫ్రై, అర్బన్ ల్యాడర్, మిబెల్కార్ట్, హోమ్‌లేన్, లివ్ స్పేస్ వంటి వందకు పైగా కంపెనీలు ఆన్లైన్ వేదికగా సేవలందిస్తే.. గోద్రెజ్ ఇంటీరియో, నీల్కమల్, డ్యురెన్ వంటివి ఆఫ్‌లైన్ మార్కెట్లో ఉన్నాయి. ఫర్నీచర్ పరిశ్రమలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతి ఉంది. ఇది దిగ్గజ కంపెనీలకు కలిసొస్తుందనేది విశ్లేషకుల మాట. ఐకియా ఇలాగే వస్తుండగా... స్పేస్ వుడ్ మాత్రం జపాన్‌కు చెందిన సుమిటోమో ఫోరెస్ట్రీకి 26 శాతం ఈక్విటీని విక్రయించింది. వీటితో దేశంలో స్పేస్వుడ్కున్న 15 స్టోర్లను 50కి పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. పోటీకి తగ్గట్టు ఆఫ్‌లైన్ స్టోర్లు! ఫర్నిచర్ అంటే జనం ఆఫ్‌లైన్‌నే ఇష్టపడతారు. ఎందుకంటే ఆన్లైన్లో చూడగటం కానీ... పట్టుకుని పూర్తిగా పరీక్షించి తీసుకోలేం. అరుుతే దిగ్గజ సంస్థలు దేశంలో ఇంకా అడుగు పెట్టకపోవటంతో ఆన్‌లైన్‌ను జనం ఆదరిస్తున్నారు. కానీ అవే నేరుగా వస్తుండటంతో... ఆన్లైన్ ఫర్నిచర్ స్టార్టప్స్ ఎక్స్పీరియన్స సెంటర్లు, స్టోర్ల ఏర్పాటుతో పోటీకి సై అంటున్నాయి. ఇప్పటికే కస్టమ్ ఫర్నిష్, పెప్పర్ ఫ్రై కంపెనీలు హైదరాబాద్‌లో స్టోర్లను ఏర్పాటు చేసింది. ‘‘వచ్చే ఏడాది ప్రథమార్థం నాటికి రూ.10 కోట్లతో దేశంలో 30 స్టోర్లను ఏర్పాటు చేస్తాం’’ అని కస్టమ్ ఫర్నిష్.కామ్ ఫౌండర్ మధుకర్ గంగాడి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు చెప్పారు. ఇందులో 5 హైదరాబాద్‌లో, మిగిలినవి బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నైలో వస్తాయన్నారు. వచ్చే ఆరు నెలల్లో దేశంలో మరో 10 ఎక్స్పీరియన్స సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పెప్పర్ఫ్రై సీఎంఓ కశ్యప్ వాడపల్లి చెప్పారు. ఉత్పత్తుల ప్రదర్శనకు, కస్టమర్లు డిజైన్స చూసుకునేందుకూ ఈ ఎక్స్పీరియెన్స స్టోర్లు ఎంతో ఉపయుక్తమవుతాయని అర్బన్లాడర్ సీఈఓ, కో-ఫౌండర్ ఆశిష్ గోయల్ చెప్పారు. అందుకే 2017 మార్చికల్లా తమ తొలి స్టోర్‌ను బెంగళూరులో ఏర్పాటు చేస్తామని, తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలోనూ ప్రారంభిస్తామని చెప్పారాయన. మరి పోటీలో నిలిచేదెవరో మున్ముందు చూడాల్సిందే. తెరపై బాహుబలికి సమ ఉజ్జీ అంటే భళ్లాలదేవుడే! మరి, విపణిలో బిలియన్ డాలర్ల కంపెనీతో పోటీ అంటే? దేశీయ ఫర్నీచర్ కంపెనీలిప్పుడు ఇదే యోచనలో పడ్డాయి. ఎందుకంటే బాహుబలి కంటే బలమైన కంపెనీలు ఐకియా, రోచె బొబీస్ రూపంలో ఎదురవుతున్నాయ్! 2017 ప్రథమార్థంలో హైదరాబాద్‌లో ఐకియా, ఢిల్లీలో రోచె బొబీస్.. దేశంలో తమ తొలి స్టోర్లతో రంగంలోకి దిగనున్నాయి మరి!. ఫేస్ టు ఫేస్! ఐకియా ప్రారంభం: 1943 27 దేశాల్లో 315 స్టోర్లున్నాయి. గతేడాది కంపెనీ టర్నోవర్ 32.37 బిలియన్ డాలర్లు రోచె బొబీస్ ప్రారంభం: 1960 50 దేశాల్లో 250 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు. గతేడాది రోచె బొబీస్ ఆదాయం 420 మిలియన్ యూరోలు. కస్టమ్ ఫర్నీష్.కామ్ ప్రారంభం: 2015 నిధుల సమీకరణ: రూ.30 కోట్లు ఇన్వెస్టర్లు: డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీష్ రెడ్డి, పీపుల్ క్యాపిటల్ ఫౌండర్ శ్రీనిరాజు, మైక్రోసాఫ్ట్‌కు చెందిన శ్రీని కొప్పోలు, బెంగళూరుకు చెందిన ఆగ్నస్ క్యాపిటల్ పెప్పర్ఫ్రై.కామ్ ప్రారంభం: 2011 నిధుల సమీకరణ: రూ.1,000 కోట్లు పెట్టుబడిదారులు: గోల్డ్‌మన్ శాక్స్, బెర్టల్స్మెన్ ఇండియా, జోడియాక్ క్యాపిటల్ ఉత్పత్తుల సంఖ్య: 1,20,000; 40 లక్షలు కస్టమర్లు అర్బన్ లాడర్ ప్రారంభం: 2012 నిధుల సమీకరణ: 77 మిలియన్ డాలర్లు పెట్టుబడిదారులు: టీఆర్ క్యాపిటల్, సెకోయా క్యాపిటల్, స్టెడీవ్యూ క్యాపిటల్, సైఫ్ పార్టనర్స్, కలారీ క్యాపిటల్, రతన్ టాటా 2 లక్షల మంది కస్టమర్లున్నారు. హోమ్‌లేన్ ప్రారంభం: 2014 నిధుల సమీకరణ 4.5 మిలియన్ డాలర్లు పెట్టుబడిదారులు: సెకోయా క్యాపిటల్, ఆరిన్ క్యాపిటల్ లివ్స స్పేస్ ప్రారంభం: 2012, నిధుల సమీకరణ: రూ.100 కోట్లు ఇన్వెస్టర్లు: బెస్సెమర్ వెంచర్స్, జంగ్లీ వెంచర్స్, హీలియన్ వెంచర్స్