breaking news
omelet
-
ఇచట డిజిటల్ ఆమ్లెట్ డిజిటల్ పరోటా వేయబడును
అమ్లెట్లు ఎచట వేసెదరు? ఆలూ పరాట ఎక్కడ తయారుచేసెదరు?’ అనే ప్రశ్నలకు ‘ఇవి కూడా ప్రశ్నలేనా. స్టవ్ మీద ఉన్న పెనంపై వేస్తారు. చేస్తారు’ అంటాం. అయితే ఒక టెక్ కంటెంట్ క్రియేటర్ మాత్రం మనం చెప్పే జవాబును మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. సదరు ఈ క్రియేటర్ కంప్యూటర్ ‘సిపియు’పై ఆమ్లెట్ వేశాడు. ఆ తరువాత మినీ పరోటా తయారుచేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ‘డిజిటల్ ఆమ్లెట్లు–పరోటాలు వచ్చేశాయి’ అని మురిసిపోతున్నారు ప్రేక్షకమహాశయులు. -
ఎండ వేడితో ఆమ్లెట్ వేశారు
వరంగల్: అబ్బా ఎండలు మండిపోతున్నాయి.. నేలపై అడుగుపెడితే కాలిపోతోంది.. ఈ వేడికి ఆమ్లెట్ వేసుకోవచ్చు అని ఎండల తీవ్రతను చెబుతూ మాట్లాడుకొంటుంటారు. వరంగల్ జిల్లాలో నిజంగానే ఎండ వేడిమితో ఆమ్లెట్ వేశారు. తెలుగు ప్రజలు ఎండల తీవ్రతకు నరకయాతన అనుభవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వరంగల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఎండ వేడితో ఆమ్లెట్ అవుతుందా లేదా అనే కుతూహలంతో మహబూబా బాద్ వాసులు ప్రయత్నించారు. ఎండలో పెనం (పెంక)ను కొద్దిసేపు ఉంచగా, అది వేడెక్కింది. కోడి గుడ్డు పగలగొట్టి దానిపై వేయడంతో ఆమ్లెట్గా మారింది. ఓ వైపు ఎండల తీవ్రతకు ప్రజలు విలవిలలాడుతూనే ఈ చిత్రమైన ఘటనను ఆసక్తిగా తిలకించారు. -
ఎండ వేడితో ఆమ్లెట్