breaking news
Om Vir Singh
-
బిజెపి నేత హత్య
-
బిజెపి నేత హత్య
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లోని మీర్పూర్ బీజేపీ శాఖ ఉపాధ్యక్షుడు ఓంవీర్ సింగ్‌ను ఇద్దరు దుండగులు దారుణంగా కాల్చి చంపారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అయిన ఓంవీర్ సింగ్ ఉదయం వాకింగ్ వెళ్లిన సమయంలో ఈ హత్య జరిగింది. ఆయన వాకింగ్ చేసే సమయంలో ఇద్దరు దుండగులు వచ్చి తుపాకీతో ఆయనపై కాల్పులు జరిపారు. ఆయన కూడా తన వద్ద ఉన్న లైసెన్సడ్ రివాల్వర్‌తో వారిపై కాల్పులు జరిపారు. దాడి చేసినవారిలో ఒకరు గాయపడ్డాడు. ఆ తరువాత దుండగులు సింగ్ వద్ద రివాల్వర్ తీసుకొని పారిపోయారు. మూడు రోజుల వ్యవధిలో ఉత్తర ప్రదేశ్‌లో ఇద్దరు బీజేపీ నేతలను హత్య చేశారు. బీజేపీ నోయిడా జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు, దాద్రి నగర్ పంచాయతీ చైర్మన్ గీతా పండిట్ భర్త విజయ్ పండిట్(37)ను శనివారం రాత్రి హత్య చేశారు. బ్రహ్మపురిలో ఉన్న తన అన్న షాపు నుంచి పండిట్ తిరిగి వస్తుండగా రెండు బైక్‌ల మీద వచ్చిన దుండగులు దగ్గర నుంచి అతనిపై కాల్పులు జరిపారు.