breaking news
Olympic medalist
-
‘లెఫ్టినెంట్ కల్నల్’ నీరజ్ చోప్రా
సాక్షి, న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. టెరిటోరియల్ ఆర్మీలో అతనికి ‘లెఫ్టినెంట్ కల్నల్’ గౌరవ హోదాను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ప్రదానం చేశారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో బుధవారం దీనికి సంబంధించిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, టెరిటోరియల్ ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ వేడుకలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్వయంగా నీరజ్ చోప్రా భుజాలపై లెఫ్టినెంట్ కల్నల్ హోదా బ్యాడ్జ్‌లను అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరజ్ పట్టుదల, దేశభక్తి, నిరంతర శ్రమకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. హరియాణాకు చెందిన నీరజ్ 2016లో భారత సైన్యంలోని ‘ది రాజ్‌పుతానా రైఫిల్స్’లో సుబేదార్‌గా∙కెరీర్‌ను మొదలుపెట్టాడు. అంతర్జాతీయ స్థాయిలో అతని ఘనతలకు గుర్తింపుగా 2021లో సుబేదార్ నుంచి మేజర్‌గా పదోన్నతి కలి్పంచారు. ఆ మరుసటి ఏడాది ‘పరమ విశిష్ట సేవా పతకం’తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతనికి టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ కమిషన్‌ను మంజూరు చేశారు. తాజాగా కల్నల్ గౌరవ హోదా కట్టబెట్టారు. -
ఒలింపిక్ విజేత, షూటర్ మను భాకర్ ఇంట్లో విషాదం
-
ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్ ఇంట తీవ్ర విషాదం
పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ బాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇవాళ (జనవరి 19) ఉదయం మనూ బాకర్ అమ్మమ్మ, మామ రోడ్డు ప్రమాదంలో దుర్మణం చెందారు. హర్యానాలోని చర్కీ దాద్రిలో గల మహేంద్రఘర్ బైపాస్ రోడ్డులో ఈ ఘటన సంభవించింది. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో స్కూటర్‌పై వెళ్తున్న మనూ బాకర్ అమ్మమ్మ, మామను బ్రీజా కారు ఢీకొంది. మానూ బాకర్ అమ్మమ్మ, మామ స్పాట్లోనే చనిపోయారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీలను పోస్ట్ మార్టమ్ నిమిత్తం తరలించారు.కాగా, మనూ బాకర్ రెండు రోజుల కిందటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డు అందుకుంది. మనూ బాకర్ గతేడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మనూ.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది. పారిస్ ఒలింపిక్స్‌లో మనూ 10మీ ఎయిర్ పిస్తోల్, 10మీ ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ టీం (సరబ్జోత్ సింగ్‌తో కలిసి) ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించింది. -
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన పీవీ సింధు.. క్యూట్ కపుల్ (ఫొటోలు)
-
నీరజ్ కోచ్‌గా జాన్ జెలెజ్నీ
న్యూఢిల్లీ: జావెలిన్ త్రోలో ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకరు...ఇదే క్రీడాంశంలో సంచలన ప్రదర్శనతో దేశానికి ఒలింపిక్స్ స్వర్ణం అందించిన ఆటగాడు మరొకరు...వీరిద్దరు ఇప్పుడు మరిన్ని రికార్డులను సృష్టించే లక్ష్యంతో జోడీగా మారారు. భారత్ స్టార్ జావెలిన్ త్రోయర్, 2 ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రా తన కొత్త కోచ్‌గా చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెన్జీని కోచ్‌గా ఎంచుకున్నాడు.రాబోయే 2025 సీజన్‌కు ముందు జత కలిసిన నీరజ్, జెలెజ్నీ అద్భుతమైన ఫలితాలు సాధించాలని పట్టుదలగా ఉన్నారు. 58 ఏళ్ల జెలెజ్నీ 1988 సియోల్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన అనంతరం వరుసగా మూడు ఒలింపిక్స్ (1992, 1996, 2000)లలో స్వర్ణాలు గెలుచుకున్నాడు. మూడు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అతని పేరిటే జావెలిన్‌ను అతి ఎక్కువ దూరం విసిరిన వరల్డ్ రికార్డు (98.48 మీటర్లు) కూడా ఉంది.2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన నీరజ్‌కు ఇటీవలి వరకు జర్మనీకి చెందిన బయోమెకానిక్స్ ఎక్స్పర్ట్ క్లాస్ బార్టొనిట్జ్ కోచ్‌గా ఉన్నాడు. ‘చిన్నప్పటినుంచి నేను జెలెజ్నీకి వీరాభిమానిని. ఆయన టెక్నిక్ అంటే ఎంతో ఇష్టం. నా ఆటను మెరుగుపర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆయన వీడియోలు చూస్తుండేవాడిని. ఇప్పుడు జెలెజీ్నతో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం.మా ఇద్దరి త్రోయింగ్ శైలి ఒకటే. మున్ముందు నా కెరీర్లో మరిన్ని అత్యుత్తమ విజయాలు సాధిస్తాననే నమ్మకం ఉంది’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. నీరజ్ ఆట గురించి తనకు బాగా తెలుసని.. ఎంతో మంది అథ్లెట్లు కోచింగ్ కోసం తనను సంప్రదించినా వారందరినీ కాదని భారత ఆటగాడిని ఎంచుకోవడం అతనిలో ప్రతిభను చూసేనని జెలెన్జీ వెల్లడించాడు. గతంలో ఈ దిగ్గజం శిక్షణలోనే జేకబ్ వాలెజ్, విటెస్లావ్ వెసెలి, బార్బరా స్పొటకోవా లాంటి ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకోవడం విశేషం. -
Varinder Singh: భారత హాకీ దిగ్గజం కన్నుమూత
ఒలంపిక్ పతక విజేత, వరల్డ్‌కప్ సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడైన వారీందర్ సింగ్(75) కన్నుమూశారు. స్వస్థలం జలంధర్‌లో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వారీందర్ సింగ్ మరణం పట్ల హాకీ ఇండియా సంతాపం వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. ఈ సందర్భంగా వారీందర్ సింగ్ లేని లోటు పూడ్చలేనిదంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. పాకిస్తాన్‌పై విజయంలో భాగస్వామిగా.. 1947లో పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించిన వారీందర్ సింగ్ హాకీపై మక్కువ పెంచుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత హాకీ జట్టులో చోటు సంపాదించారు. హాకీ వరల్డ్‌కప్-1975 టోర్నీలో పాకిస్తాన్‌ను 2-1 తేడాతో ఓడించి స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడు. అదే విధంగా... 1972 నాటి మ్యూనిచ్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో ఆయన భాగస్వామిగా ఉన్నారు. అంతేగాక 1973లో ప్రపంచకప్‌లో రజతం గెలిచిన జట్టులో సభ్యుడు. ఇక 1974, 1978 ఏసియన్ గేమ్స్‌లో రజతం గెలిచిన భారత జట్టుకు ఆయన ప్రాతినిథ్యం వహించారు. కాగా హాకీ ఆటగాడిగా క్రీడా రంగానికి చేసిన సేవకు గానూ 2007లో ప్రతిష్టాత్మక ధ్యాన్‌చంద్ జీవన సాఫల్య పురస్కారాన్ని వారీందర్ సింగ్ అందుకున్నారు. చదవండి: India T20 Captain: అలా అయితే రోహిత్ స్థానంలో ఇకపై అతడే టీ20 కెప్టెన్! In light of the tragic passing of the great Hockey player Shri Varinder Singh, we pray to the Almighty to grant the departed person's soul eternal rest and to provide the family members the fortitude to endure this irreparable loss. 🙏🏻 pic.twitter.com/s7Jb5xH0e3 — Hockey India (@TheHockeyIndia) June 28, 2022 -
జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ
శ్రీకాకుళం న్యూకాలనీ: ఒలింపిక్ మెడలిస్ట్ కరణం మల్లేశ్వరి నేతృత్వంలో జిల్లాలో వెయిట్ లిఫ్టిం గ్ అకాడమీ నెలకొల్పుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ పీఆర్ మోహన్ ప్రకటించారు. శ్రీకాకుళంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం శాప్ బోర్డు పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడతలో శ్రీకాకుళంలో అథ్లెటిక్స్ అకాడమీ నెలకొల్పుతామని చెప్పారు. కోడిరామ్మూర్తి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరిస్తామని తెలిపారు. గతంలో శాప్ పాలకమండలి సమావేశాలు కేవలం హైదరాబాద్‌కే పరిమితమయ్యేవని, ఇకపై ప్రతి జిల్లాలోనూ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో అంతర్జాతీయస్థాయి వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తామన్నారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతి లేదా విజయవాడలో అంతర్జాతీయ స్థాయి స్టేడియాలు నిర్మిస్తామని చెప్పారు. పునరావాస కేంద్రాలు కావు.. స్పోర్ట్స్ స్కూల్స్ పునరావాస కేంద్రాలు కావని.. ప్రతిభ లేని క్రీడాకారులను ఇళ్లకు సాగనంపుతామని చైర్మన్ స్పష్టంచేశారు. ప్రతి మూడునెలలకు ఒకసారి ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. క్రీడా ఎంపికలో సిఫార్సులకు తావులేదన్నారు. శాప్, డీఎస్ఏ పరిధిలోని కాంట్రాక్ట్ అధికారులు, కోచ్‌లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపిం చామని చెప్పారు. రాష్ట్రంలో కోచ్‌ల కొరత వాస్తవమేనని అంగీకరించారు. అంతర్జాతీయ, జాతీయస్థాయిలో పతకాలు సాధించి నిరుద్యోగులగా ఉన్న వెటరన్ క్రీడాకారులను కోచ్‌లుగా నియమిస్తామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ప్రతి గ్రామంలోనూ వాకింగ్ ట్రాక్ ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. సీతంపేటలో గిరిజన స్పోర్ట్స్ స్కూల్ మంజూరు పై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. కరణం మల్లేశ్వరి మాట్లాడుతూ కోడిరామ్మూర్తి స్టేడియంలో తాత్కాలికంగా వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీని ఏర్పాటుచేసి.. శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాలలో వసతి సదుపాయం కల్పించేందుకు కలెక్టర్ అంగీకరించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో శాప్ ఎండీ పి.రేఖారాణి, బోర్డు సభ్యులు కరణం మల్లేశ్వరి, బి.హనుమంతురావు, సత్యగీత, జయచంద్ర, షఫీ, డిప్యూటీ డెరైక్టర్ దుర్గాప్రసాద్, మోనటరింగ్ అధికారి ఎల్.దేవానందం, డీఎస్డీఓ బి.శ్రీనివాస్‌కుమార్ పాల్గొన్నారు. చంద్రబాబు నామస్మరణ.. చైర్మన్ మోహన్ మాట్లాడిన ప్రతి పలుకులోనూ చంద్రబాబు నామస్మరణ చేశారు. నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు దయవల్లే రాజకీయంగానే ఎంపికయ్యానని వెల్లడించారు. తనతోపాటు బోర్డు సభ్యుల నియామకం కూడా రాజకీయంగానే జరిగిందని అంగీకరించారు. అయినా ఎటువంటి లొసుగులకు అవకాశం లేకుండా నిజాయితీతో పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు.


