breaking news
Oliver Peake
-
WC 2026: ఆసీస్ అవుట్.. వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్
ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. ఉత్కంఠగా సాగిన సెమీస్ మ్యాచ్‌లో ఆసీస్‌ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసి ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్ టోర్నీలో సూపర్ సిక్స్ గ్రూపు-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించగా.. గ్రూప్-2 నుంచి భారత్ , ఇంగ్లండ్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్- ఇంగ్లండ్ మంగళవారం తలపడ్డాయి.థామస్ రూ కెప్టెన్ ఇన్నింగ్స్బులవాయోలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో బెన్ డాకిన్స్ (1) విఫలం కాగా.. జోసెఫ్ మూర్స్ 25 పరుగులు.. వన్‌డౌన్‌లో వచ్చిన బెన్ మేయ్స్ 24 రన్స్ చేశారు. టాపార్డర్ ఇలా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కాగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన థామస్ రూ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.శతకంతో చెలరేగిన థామస్.. మొత్తంగా 107 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 110 పరుగులు సాధించాడు. మిగతావాళ్లలో కలేబ్ ఫాల్కనర్ 40 పరుగులతో రాణించగా.. ఫర్హాన్ అహ్మద్ 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.ఆసీస్ బౌలర్లలో హేడెన్ షీలర్, నడేన్ కూరే చెరో రెండు వికెట్లు తీయగా.. విల్ బైరమ్, ఆర్యన్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్ ఒలీవర్ పీక్ ఒంటరి పోరాటంఓపెనర్ విల్ మలాజుక్ 15, వన్‌డౌన్ బ్యాటర్ 3 పరుగుల చేసి అవుటయ్యారు. మరో ఓపెనర్ నితేశ్ సామ్యూల్ 83 బంతుల్లో 47 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ అలెక్స్ లీ యంగ్ (3), జేడన్ డ్రేపర్ (12) నిరాశపరిచారు.ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్, కెప్టెన్ ఒలీవర్ పీక్ ఒంటరి పోరాటం చేశాడు. 88 బంతుల్లో పది ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న ఒలీవర్ పదో వికెట్‌గా వెనుదిరిగడంతో ఇంగ్లండ్ గెలుపు ఖరారైంది. టార్గెట్ ఛేదనలో 47.3 ఓవర్లలో 250 పరుగులకే పరిమితమై ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఇంగ్లండ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. థామస్ రూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక రెండో సెమీ ఫైనల్లో భారత్- అఫ్గనిస్తాన్ బుధవారం తలపడతాయి.అండర్-19 వరల్డ్‌కప్ ఆసీస్ వర్సెస్ ఇంగ్లండ్ స్కోర్లు👉ఇంగ్లండ్-277/7(50)👉ఆస్ట్రేలియా- 250(47.3). చదవండి: ICC vs PCB: పాకిస్తాన్‌కు భారీ షాక్! -
వరల్డ్‌కప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్-2026 ఎడిషన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఆడబోయే తమ యువ జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ టీమ్‌కు ఒలీవర్ పీక్ సారథ్యం వహించనున్నాడు.ఇక వరల్డ్‌కప్ ఆడే ఆసీస్ యువ జట్టులో ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లకు కూడా చోటు దక్కడం విశేషం. అంతేకాదు ఈ టీమ్‌లో ఇద్దరు శ్రీలంక సంతతి, చైనా సంతతికి ఓ ఆటగాడికి కూడా సెలక్టర్లు చోటివ్వడం గమనార్హం.పాల్గొనే జట్లు ఇవేకాగా వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు అండర్-19 మెన్స్ వరల్డ్‌కప్ (ICC U19 Mens World Cup 2026) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ ఐసీసీ టోర్నీకి నమీబియా- జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇందులో గ్రూప్-ఎ నుంచి ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక పాల్గొంటుండగా.. గ్రూప్-బి నుంచి భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, అమెరికా పోటీపడతాయి.కెప్టెన్ ఎవరంటే?ఇక గ్రూప్-సి నుంచి ఇంగ్లండ్, పాకిస్తాన్, స్కాట్లాండ్, జింబాబ్వే.. అదే విధంగా గ్రూప్-డి నుంచి అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, టాంజానియా, వెస్టిండీస్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా తాజాగా తమ జట్టును ప్రకటించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఆసీస్‌కు లెఫ్టాండర్ బ్యాటర్ ఒలీవర్ పీక్ సారథిగా వ్యవహరించబోతున్నాడు.భారత్‌తో ఫైనల్లో సత్తా చాటిసౌతాఫ్రికాలో 2024లో జరిగిన వరల్డ్‌కప్ టోర్నీలో ఒలీవర్ (Oliver Peake) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 120 పరుగులు సాధించాడు. ముఖ్యంగా భారత్‌తో ఫైనల్లో 46 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆస్ట్రేలియా టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.అంతేకాదు పందొమిదేళ్ల ఈ కుర్ర బ్యాటర్ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఏకంగా ప్రపంచకప్ జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేశాడు.అండర్-19 ప్రపంచకప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టుఒలీవర్ పీక్ (కెప్టెన్), కేసీ బార్టన్, నాడెన్ కూరే (శ్రీలంక సంతతి), జేడెన్ డ్రేపర్, స్టీవెన్ హోగన్, థామస్ హోగన్, బెన్ గోర్డాన్, జాన్ జేమ్స్ (భారత సంతతి), చార్లెస్ లాచ్మండ్, అలెక్స్ లీ యంగ్ (చైనా సంతతి), విల్ మలాజ్జుక్, నితేశ్ సామ్యూల్ (శ్రీలంక సంతతి), హేడెన్ షీలర్, ఆర్యన్ శర్మ (భారత సంతతి), విలియం టేలర్.చదవండి: జింబాబ్వే జట్టులో మాజీ ప్లేయర్ కొడుకులు


