breaking news
offline retailers
-
ఉచిత బస్సు, వ్యాపారాలు తుస్సు : మడిగెలు ఢమాల్
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ఇరువై ఏళ్లకు పైగా నడుస్తుంది. మొదట్లో నిత్యం విమాన టికెట్లు.. ఆన్లైన్ సర్వీస్.. విదేశాల నుంచి డబ్బులు వచ్చేవి. వీటి కోసం ప్రతీ రోజు కనీసం వంద మంది కస్టమర్లు వచ్చేవారు. కానీ నేడు నెలకు వంద మంది కూడా రావడం లేదు. ఇటీవల టెక్నాలజీలో వచ్చిన మార్పులతో ఆన్లైన్ సెంటర్లకు వచ్చే వారు తగ్గిపోయారు. ఫలితంగా గది అద్దె చెల్లించడం కూడా భారంగా మారుతుంది.ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కిరాణాదుకాణాలు.. సూపర్మార్కెట్లు.. పేరు ఏదైనా వ్యాపారాలు మాత్రం బేజారయ్యాయి. ఒకప్పుడు ప్రతీ రోజు వందలాది మంది వినియోగదారులతో కళకళలాడేవి. నేడు ఆ వ్యాపారసంస్థలు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. మెట్రో నగరాలలో కనిపించే పెద్ద..పెద్ద మాల్స్.. ఆన్లైన్ షాపింగ్‌మాల్స్ నేడు చిన్న చిన్న పట్టణాలకు చేరడంతో వినియోగదారులు అక్కడికే వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెద్ద..పెద్ద షాపింగ్‌మాల్స్.. అన్ని వస్తువులు ఒకే చోట లభించడం.. భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు పెట్టిన బోర్డులు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా మండల కేంద్రాలలో ఉన్న సూపర్మార్కెట్లు.. మెడికల్‌షాపులు .. బట్టలదుకాణాలు మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. చిన్న పట్టణాల్లో షాపింగ్మాల్స్హైదరాబాద్, కరీంనగర్లో కనిపించే పెద్ద షాపింగ్‌మాల్స్ ప్రస్తుతం సిరిసిల్ల, వేములవాడల్లో ఏర్పాటవుతున్నాయి. ఆటోలు పెట్టి గ్రామాల్లో ప్రచారం చేస్తుండడంతో కస్టమర్లు అక్కడికే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. దీని ద్వారా స్థానిక వ్యాపారులకు భారీగా నష్టం ఏర్పడుతుండగా.. వినియోగదారులు సైతం షాపింగ్‌మాల్స్‌లో కనిపించే డిస్కౌంట్లకు ఆకర్షితులై ఒకటి, రెండు వస్తువులు కొందామనుకున్న వారు నాలుగైదు కొనుగోలు చేస్తున్నారు. అంతా ఆన్లైన్లోనే..ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండడంతో ఆన్లైన్లోనే గడుపుతున్నారు. అమేజాన్, ఫ్లిప్కార్టుతోపాటు బడా కంపెనీలు ఈకామర్స్ వెబ్‌సైట్స్‌లలో ఆన్లైన్ షాపింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. దీంతో చాలా మంది ఇంట్లోనే కూర్చుండి ఆర్డర్ పెట్టేస్తున్నారు. టూత్‌బ్రష్ నుంచి నూనె, ఫుడ్, మెడిసిన్, బట్టలతోపాటు మనిషికి అవసరం ఉన్న ప్రతీ వస్తువు దొరుకుతుండడం.. బయటకు వెళ్లే అవసరం లేకపోవడంతో చాలా మంది మహిళలు ఇంట్లో ఉండే ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. దీని ద్వారా మన గల్లీల్లో ఉండే కిరాణాదుకాణాలు, మెడికల్ షాపులు, పండ్ల దుకాణాలు చివరికి పూల దుకాణాల్లో వ్యాపారాలు పడిపోతున్నాయి. ఫలితంగా గల్లీల్లోని దుకాణాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి.ఉచిత బస్సు.. వ్యాపారాలు తుస్సుప్రభుత్వం ఎన్నికల హామీ మహిళలకు ఉచిత బస్సును అమలు చేయడంతో చాలా మంది ఏ చిన్న పనికైనా కరీంనగర్, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్తున్నారు. దీని ద్వారా మండల కేంద్రాల్లో ఉన్న సూపర్మార్కెట్లు, వస్త్రవ్యాపార సంస్థల్లో గిరాకీలు లేక అద్దె చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నారు. (అమ్మా, తిరిగి వస్తానో లేదో.. రెస్క్యూ ఫ్లైట్ పైలట్ ఆవేదన వైరల్)ఏది కొన్న రూ.10కరోనా తర్వాత వ్యాపారాల్లో చాలా మార్పులు వచ్చాయి. గ్రామాల్లో చిరువ్యాపారులు తమ బైక్‌లు, ఆటలలో నిత్యావసరాలు.. ఆవాలు, జీలకర్ర, పప్పులు, ఉప్పు, సబ్బులు వేసుకొని పల్లెల్లో తిరిగి అమ్ముతున్నారు. దీని ద్వారా గ్రామాల్లో కిరాణాషాపులు, మండల కేంద్రాల్లోని సూపర్ మార్కెట్లలో సగం గిరాకీ పడిపోయింది. ఇదీ చదవండి: ఇరాన్ యుద్ధం-ఎల్పీజీ సంక్షోభం, పరిస్థితి ఇదీ!సగం వ్యాపారం పడిపోయిందిఒకప్పుడు నిత్యం దాదాపు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వ్యాపారం జరిగేది. ఇప్పుడు సగానికి పైగా పడిపోయింది. దీంతో అద్దెచెల్లింపులు, గుమస్తాల జీతాలు, నిర్వహణ ఖర్చులు భరించడం ఇబ్బందిగా మారింది. ఇటీవల ఆన్లైన్షాపింగ్స్ ఎక్కువ చేస్తుండడం మాలాంటి వ్యాపారాలు పడిపోయాయి. – సత్యం, వ్యాపారి, ఎల్లారెడ్డిపేటఇది ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ సూపర్‌మార్కెట్. రెండేళ్ల క్రితం ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ షాప్‌లో ఇప్పుడు గిరాకీ అంతంతే ఉంది. నిత్యం రూ.20వేల వరకు వ్యాపారం జరిగేది. ఇప్పుడు రూ.10 వేలకు పడిపోయింది. ఇంటి వద్దే ఉంటూ ఆన్లైన్లో నిత్యావసర సరుకులు బుక్ చేసుకుంటుండడంతో సూపర్మార్కెట్లకు వచ్చే జనం తగ్గిపోయి నిర్వహణ భారంగా మారుతుంది. -
ఆఫ్‌లైన్ రిటైల్‌లోకి బిగ్‌బాస్కెట్
న్యూఢిల్లీ: ఆన్లైన్లో నిత్యావసర సరుకులు విక్రయించే బిగ్‌బాస్కెట్ తాజాగా ఆఫ్‌లైన్ రిటైల్ విభాగంలోకి ప్రవేశించింది. కొత్తగా టెక్నాలజీ ఆధారిత, సెల్ఫ్ సర్వీస్ ’ఫ్రెషో’ స్టోర్‌ను బెంగళూరులో ప్రారంభించింది. 2023 నాటికి దేశవ్యాప్తంగా 200 భౌతిక స్టోర్లు, 2026 నాటికి 800 స్టోర్లు ఏర్పాటు చేయాలన్న ప్రణాళికల్లో భాగంగా దీన్ని ఆవిష్కరించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో హరి మీనన్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యుత్తమ నాణ్యమైన ఉత్పత్తులను పోటీ సంస్థలతో పోలిస్తే మరింత చౌకగా వీటి ద్వారా అందించాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఈ స్టోర్స్‌లో తాజా పండ్లు, కూరగాయలతో పాటు బ్రెడ్, గుడ్లు మొదలైన నిత్యావసరాలు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. బిగ్‌బాస్కెట్‌లో 50,000 ఉత్పత్తుల శ్రేణి నుంచి కొనుగోలుదారులు తమకు కావాల్సినవి ఆన్లైన్లో ఆర్డర్ చేసి, తమ వీలును బట్టి ఫ్రెషో స్టోర్స్ నుంచి వాటిని తీసుకోవచ్చని మీనన్ చెప్పారు. కస్టమర్లు తమకు కావాల్సిన ఉత్పత్తులను తీసుకుని, ఆటోమేటిక్ కంప్యూటర్ విజన్ ఉండే కౌంటర్లో తూకం వేయొచ్చని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సెల్ఫ్ బిల్లింగ్ కౌంటర్లు ఆటోమేటిక్‌గా బిల్లును రూపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. -
సఖ్యతకు నోచుకోని ఈ-టైలర్స్..!
భారత్ లో రిటైలర్ సంస్థలకున్న సఖ్యత ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు ఉండట్లేదట. ఇష్టారీతిలో డిస్కౌంట్ ఆఫర్లు గుప్పిస్తూ భారీగా వ్యాపారాన్ని పెంచుకుంటున్న ఈ-టైలర్స్ కు చెక్ చెప్పేందుకు ప్రభుత్వం ఏప్రిల్ లో కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ పోర్టల్ లో ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండొద్దని ఆదేశాలు జారీచేసింది. వివిధ రాష్ట్రాల పన్నులనూ ఈ-టైలర్స్ భరించాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే వీటిపై పోరాటానికి ఈ-కామర్స్ దిగ్గజాలు ఐకమత్యం లేదని తెలుస్తోంది. ఆఫ్ లైన్ రిటైలర్లకు, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమైన పోరుకు మాత్రం ఈ-కామర్స్ దిగ్గజాలు ఒకే స్వరంలో ఉండటం లేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభావం ఈ-కామర్స్ వ్యాపారాలపై పడనుందని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ-కామర్స్ పరిశ్రమ విశ్లేషకులే దీనిపై పెదవి విరుస్తున్నారని తెలుస్తోంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు మాత్రం దీనిపై స్పందించడం లేదు. ముఖ్యమైన అంశాలపై కంపెనీ, స్టాక్ హోల్డర్స్ అందరితో కలిసే పనిచేస్తుందని స్నాప్ డీల్ ఏదో నామమాత్రంగా సమాధానమిచ్చిందని తెలుస్తోంది. ఆఫ్ లైన్ స్టోర్లు, వారు నిర్ణయించుకున్న ధర కంటే ఇసుమంతైనా తక్కువ చేసి మంచినీళ్ల బాటిళ్లను సైతం విక్రయించవని, ఇదే ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లకున్న ప్రధాన తేడా అని ఈ-టైలర్ ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. మార్కెట్ ప్లేస్ ప్రమోషన్ ను అనుమతివ్వాలని కోరుతూ ఈ కంపెనీలు అసలు కలిసికట్టుగా ప్రభుత్వంతో సంప్రదింపులే జరపడం లేదని తేలింది. ఇటీవలే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అమెరికా ఈ-టైలర్ దిగ్గజం అమెజాన్ స్పాన్సర్ చేసిన లేఖపై కూడా భారత ఈ-టైలర్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లు సంతకం చేయలేదట. దీంతో లాబీ గ్రూప్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ డ్రాప్ట్ లెటర్ ను ప్రభుత్వానికి పంపలేదట. గుజరాత్ ప్రభుత్వ పన్నులకు కూడా వ్యతిరేకంగా ఈ సంస్థలన్ని వేరువేరుగానే కేసులు ఫైల్ చేశాయి. అయితే ఈ-టైలర్స్ కు పోటీగా సమైక్యంగా పోరాడుతూ.. మార్కెట్లో తమ స్థానాలను మెరుగుపర్చుకునేందుకు రిటైల్ సంస్థలు రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్ఏఐ)ను ఏర్పరుచుకున్నాయి. ఈ అసోసియేషన్ బేస్ చేసుకుని ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లపై వ్యతిరేకంగా రెండు కేసులు కూడా నమోదుచేశాయట. ఈ మొత్తం ఈ-టైలర్ల వ్యవహారాన్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ గా షాప్ క్లూస్.కామ్ సంస్థ సహా వ్యవస్థాపకుడు రాధిక అగర్వాల్ అభివర్ణించారు.


