breaking news
officers inspection
-
నిండిన గొలుసు చెరువులు
కౌడిపల్లి: హమ్మయ్య.. 26 ఏళ్ల తరువాత మండలంలోని గొలుసు చెరువులకు జలకళ సంతరించుకుంది. అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలతో శనివారం గొలుసు చెరువులు నిండాయి. మహ్మద్‌నగర్, కన్నారం, కౌడిపల్లి, వెల్మకన్న, కొట్టాల గొలుసు చెరువులున్నాయి. మహ్మద్‌నగర్, కన్నారం చెరువులు నిండి... వాటి వరద మిగతా చెరువుల్లోకి చేరి నిండుతాయి. 1988, 1998, 1990లో వరుసగా మూడు సార్లు చెరువులు నిండి అలుగులు పారాయి. అప్పటి నుంచి 26 ఏళ్లగా నిండుకోలేదు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో శనివారం సాయంత్రానికి మహ్మద్‌నగర్, కన్నరం, కౌడిపల్లి, వెలక్మన్న చెరువులు ఆర ఫీటు ఎత్తులో నీరు వస్తే అలుగు పారనున్నాయి. మినీ ట్యాంక్‌బండ్‌కు మరమ్మతులు కౌడిపల్లిలోని పెద్ద చెరువు మినిట్యాంక్ బండ్ అలుగు వద్ద మట్టి తక్కువగా ఉండటంతో గ్రామస్తుల సూచన మేరకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. చెరువు పూర్తిస్థాయిలో నిండింది. అలుగు వద్ద మట్టి తక్కువగా ఉండటంతో ఐబీ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ చాందీరామ్ పరిశీలించి జేసీబీలను తెప్పించి మట్టి వేయించారు. ఏంపీపీ చిలుముల పద్మ నరసింహారెడ్డి, శివాంజనేయులు, సర్పంచ్ బీస కాంతపురుషోత్తం, ఎంపీటీసీ గొర్రె శ్యామల రవి, గ్రామస్తులు ఉన్నారు. -
ఏజెన్సీలో ప్రబలుతున్న జ్వరాలు.. ముగ్గురు మృతి
సీతంపేట: శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలో జ్వరాలు ప్రబలుతున్నాయి. ఎగువ సీదిగూడ గ్రామంలో 15 రోజుల వ్యవధిలో ముగ్గురు గిరిజనులు మృతి చెందడంతో స్థానికులు భయూందోళన చెందుతున్నారు. బుధవారం సవర సూర్యకుమార్(40) అనే వ్యక్తి మృతి చెందగా, సవర ఎర్రమ్మ, సవర వెంకటరావు అనే గిరిజనులు పదిహేను రోజుల కిందట మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. సూర్యకుమార్ ను పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతను మృతి చెందాడని స్థానికులు ఆరోపించారు. ప్రస్తుతం అదే గ్రామంలో పది మంది వరకు జ్వరాలతో మంచం పట్టారు. వీరిలో సవర రమేష్ పరిస్థితి విషమంగా ఉంది. డిప్యూటీ డీఎంహెచ్‌వో నాయక్, తహశీల్దార్ ఎం.సావిత్రిలు సీతంపేటను పర్యవేక్షించారు.