నిండిన గొలుసు చెరువులు | full rain water in chain ponds | Sakshi
Sakshi News home page

నిండిన గొలుసు చెరువులు

Sep 24 2016 6:37 PM | Updated on Sep 4 2017 2:48 PM

కౌడిపల్లి పెద్ద చెరువు వద్ద పనులను పరిశీలిస్తున్న అధికారులు

కౌడిపల్లి పెద్ద చెరువు వద్ద పనులను పరిశీలిస్తున్న అధికారులు

హమ్మయ్య.. 26 ఏళ్ల తరువాత మండలంలోని గొలుసు చెరువులకు జలకళ సంతరించుకుంది. అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలతో శనివారం గొలుసు చెరువులు నిండాయి.

కౌడిపల్లి: హమ్మయ్య.. 26 ఏళ్ల తరువాత మండలంలోని గొలుసు చెరువులకు జలకళ సంతరించుకుంది. అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలతో శనివారం గొలుసు చెరువులు నిండాయి. మహ్మద్‌నగర్‌, కన్నారం, కౌడిపల్లి, వెల్మకన్న, కొట్టాల గొలుసు చెరువులున్నాయి. మహ్మద్‌నగర్‌, కన్నారం చెరువులు నిండి... వాటి వరద మిగతా చెరువుల్లోకి చేరి నిండుతాయి.

1988, 1998, 1990లో వరుసగా మూడు సార్లు చెరువులు నిండి అలుగులు పారాయి. అప్పటి నుంచి 26 ఏళ్లగా నిండుకోలేదు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో శనివారం సాయంత్రానికి మహ్మద్‌నగర్‌, కన్నరం, కౌడిపల్లి, వెలక్మన్న చెరువులు ఆర ఫీటు ఎత్తులో నీరు వస్తే అలుగు పారనున్నాయి.

మినీ ట్యాంక్‌బండ్‌కు మరమ్మతులు
కౌడిపల్లిలోని పెద్ద చెరువు మినిట్యాంక్‌ బండ్‌ అలుగు వద్ద మట్టి తక్కువగా ఉండటంతో గ్రామస్తుల సూచన మేరకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. చెరువు పూర్తిస్థాయిలో నిండింది. అలుగు వద్ద మట్టి తక్కువగా ఉండటంతో ఐబీ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ చాందీరామ్ పరిశీలించి జేసీబీలను తెప్పించి మట్టి వేయించారు. ఏంపీపీ చిలుముల పద్మ నరసింహారెడ్డి, శివాంజనేయులు, సర్పంచ్‌ బీస కాంతపురుషోత్తం, ఎంపీటీసీ గొర్రె శ్యామల రవి, గ్రామస్తులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement