నిన్న చెల్లెలు.. నేడు అన్న మృతి  | Brother And Sister Deceased With In Two Days At Medak District | Sakshi
Sakshi News home page

నిన్న చెల్లెలు.. నేడు అన్న మృతి 

Dec 15 2020 8:57 AM | Updated on Dec 15 2020 8:57 AM

Brother And Sister Deceased With In Two Days At Medak District - Sakshi

వివరాలు సేకరిస్తున్న ఎస్‌ఐ

సాక్షి, మెదక్‌, కౌడిపల్లి(నర్సాపూర్‌): శోకసంద్రంలో మునిగిన కుటుంబంలో చెరువులోని జేసీబీ గుంత మరింత శోకాన్ని మిగిల్చింది. చెల్లెలు అంత్యక్రియలు పూర్తిచేసుకుని చెరువులోనికి స్నానానికి వెళ్లగా ఆమె అన్న నీటిలో మునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ముందే ఈ సంఘటన జరిగింది. దీంతో కుటంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలంలోని మహ్మద్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది.

స్థానిక ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్‌నగర్‌ గ్రామానికి చెందిన చాకలి గంగయ్యకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. కూతురు అరుణ (30) అందురాలు. ఇంటివద్దే ఉంటుంది. ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉండగా అంత్యక్రియల అనంతరం చెరువులో అందరూ స్నానాకి వెళ్లారు. స్నానం చేసే క్రమంలో నర్సింలు(38) చెరువులోనికి వెళ్లాడు.  చదవండి: (జీవితం మీద విరక్తితోనే చనిపోతున్నా..)

చెరువునీటిలో జేసీబీ గుంత గమనించక పోవడం అతనికి ఈత రాక నీటిలో మునిగి పోయాడు. అప్పటికే అక్కడ ఒడ్డున ఉన్నవారు గమనించి వెళ్లే సరికి మృతి చెందాడు.  మృతునికి భార్య నర్సామ్మతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒకే కుటుంబంలో రెండు రోజులలో ఇద్దరు మృతి చెందడటంతో కుటంబంలో, గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుని భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  చదవండి: (అన్నలారా.. మేమెలా బతకాలి?) 

Advertisement
 
Advertisement
Advertisement