breaking news
odisha and bengal
-
ఒడిశా రైలు ప్రమాదం.. విరాట్ కోహ్లి దిగ్బ్రాంతి
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు, ఓ గూడ్స్ ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 270 పైగా మృత్యువాత పడగా.. 900 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ పెను ప్రమాదంపై భారత క్రికెటర్ విరాట్ కోహ్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపాడు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో ఇంత మంది మరణించడం తన మనసును కలిచి వేసిందని విరాట్ ట్వీట్ చేశాడు. చదవండి: WTC Final 2023: 50 ఏళ్లలో రెండు సార్లు మాత్రమే.. ఆసీసీను భయపెడుతున్న చెత్త రికార్డు Saddened to hear about the tragic train accident in Odisha. My thoughts and prayers go out to the families who lost their loved ones and wishing a speedy recovery to the injured. — Virat Kohli (@imVkohli) June 3, 2023 -
దిశ మళ్లనున్న వాయుగుండం!
ఒడిశా, బెంగాల్ వైపు పయనమవుతుందంటున్న ఐఎండీ సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది గురువారానికి వాయుగుండంగా బలపడే వీలుంది. అయితే ఈ వాయుగుండం ముందుగా అంచనా వేసినట్టుగా కాకుండా వాయవ్య దిశగా పయనించనుంది. దీంతో దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పైగాక ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లపై ఉంటుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఐఎండీ తొలుత వేసిన అంచనాల ప్రకారం.. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారాక కోస్తాంధ్రపై ప్రభావం చూపుతుందని, ఫలితంగా కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భావించారు. అయితే అది అనూహ్యంగా దిశ మార్చుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు వాయు‘గండం’ తప్పినట్టేనని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజులపాటు కోస్తాంధ్రలోని కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగాను, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.