breaking news
Nutraceutical
-
ఓటీసీ 'మందు'
చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుల దగ్గరకు వెళ్లడం గతం. ఇప్పుడు ముందుగా గూగుల్‌లో సెర్చ్ చేయడం.. లేదంటే బంధువులు, సన్నిహితుల సలహా తీసుకుని సమీపంలోని ఫార్మసీకి వెళ్లి కావాల్సిన మందులు తెచ్చుకోవడం. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలైతే ఒక అడుగు ముందుకేసి ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అందుకే భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఓవర్ ద కౌంటర్ (ఓటీసీ) ఔషధాల వినియోగం పెరుగుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్వినియోగదార్లకు అవగాహన పెరగడం, అందుబాటు ధర.. వెరసి ఓటీసీ ఔషధాల వినియోగం క్రమంగా అధికం అవుతోంది. మన దేశంలో ఓటీసీ మందుల వ్యాపారం 2020–24 మధ్య సగటున ఏటా 10% పెరిగింది. 2026–30 మధ్య ఇది 13% వృద్ధి చెందుతుందని ఈవై పాథనాన్ నివేదిక చెబుతోంది. భారత్‌లో 2024లో రూ.47 వేల కోట్ల విలువైన ఓటీసీ మందులు అమ్ముడయ్యాయి. అయిదేళ్లలో ఈ విలువ రెండింతలు దాటుతుందని అంచనా.అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్‌లో వీటి వ్యాపారం చాలా తక్కువ. కానీ వృద్ధి వేగం ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఏటా రూ.17.37 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతోంది. అమెరికా, పశ్చిమ యూరప్, జపాన్ ప్రధాన మార్కెట్లు. ఈ దేశాల్లో ఏటా సగటున ఒక్కో వ్యక్తి ఓటీసీ మందులకు రూ.6,300–11,700 ఖర్చు చేస్తున్నారు. భారత్‌లో ఇది కేవలం రూ.270–360 మధ్య ఉంది. జాగ్రత్తగా వాడితేనే..ఓవర్ ద కౌంటర్ (ఓటీసీ) మెడిసిన్ అంటే ప్రి్రస్కిప్షన్ లేకుండా వినియోగదారులకు నేరుగా ఫార్మసీల్లో విక్రయించే ఔషధాలు. తలనొప్పి, జలుబు, అలెర్జీలు, నొప్పి వంటి చిన్న చిన్న సమస్యల చికిత్సలకు ఆసుపత్రులకు వెళ్లడానికి బదులుగా నేరుగా మందుల షాపు నుంచి జనం కొనుగోలు చేస్తారు. ఊళ్లలో అయితే స్థానిక మందుల షాపు యజమానితో నేరుగా పరిచయం ఉండటంతో సమస్య చెబితే మందులు ఇస్తారన్న నమ్మకమూ ఉంటుంది. నిర్దేశించిన సూచనలకు అనుగుణంగా వీటిని జాగ్రత్తగా వినియోగిస్తేనే ప్రభావవంతంగా ఉంటాయి. అతిగా వాడితే దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. చిన్న సమస్యలు ఎక్కువకాలం ఇబ్బంది పెడితే వైద్యులను సంప్రదించాల్సిందే. దేశంలో ఓటీసీ ఔషధాలను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నియంత్రిస్తుంది. ప్రివెంటివ్ కేర్‌కు ప్రాధాన్యం జబ్బులు రాకుండా జనం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జీవనశైలి మారడంతో మధుమేహం, అధిక బరువు, రక్తపోటు వంటి రోగాలు పెరుగుతున్నాయి. వీరితోపాటు కేన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలున్న వారు సపోర్ట్ థెరపీలో భాగంగా సప్లిమెంట్స్ వాడుతున్నారు. వీరికి ఎక్కువ కాలంపాటు సప్లిమెంట్స్ అవసరం. అందుకే న్యూట్రాస్యూటికల్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఎంతో కాలంగా ఔషధ రంగంలో ఉన్న కంపెనీల నాణ్యమైన ఓటీసీ ఉత్పత్తులను కొనేందుకే జనం మొగ్గు చూపుతున్నారు. – ఆళ్ల లీలా రాణి, డైరెక్టర్, లీ హెల్త్ డొమెయిన్ 2024లో ఆరోగ్యం కోసం.. ⇒ స్కిన్‌కేర్, వెయిట్ మేనేజ్మెంట్, ఫిట్‌నెస్‌కు సంబంధించి 2.7 కోట్ల ఆన్లైన్ సెర్చ్‌లు నమోదయ్యాయి⇒ 25 లక్షల మంది ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.⇒ ఆరోగ్య స్థితిని పర్యవేక్షించేందుకు 40% మంది వేరబుల్స్ వాడుతున్నారు -
న్యూట్రాస్యూటికల్స్ విప్లవం.. మస్తుగా కెరీర్ అవకాశాలు!!
Nutrify Today world's first launches nutraceuticals academy: కరోనా తర్వాత ఆరోగ్యరంగంతో పాటు అనుబంధ రంగాలన్నింటిలోనూ పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. అదే విధంగా పోషకాహార రంగం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఔషధాల రూపంలో పోషకాలను అందించే న్యూట్రాస్యూటికల్స్ రంగం శరవేగంగా పురోగమిస్తోంది. ప్రస్తుతం అమెరికా తదితర దేశాల్లో భారత న్యూట్రాస్యూటికల్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలో మన స్వదేశీ సంస్థ న్యూట్రిఫై టుడే ఈ రంగాన్ని మరింత వృద్ధిలోకి తెచ్చే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఒక అకాడమీకి రూపకల్పన చేసింది. నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా.. ప్రపంచంలోనే ప్రప్రధమ న్యూట్రాస్యూటికల్స్ అకాడమీని న్యూట్రిఫై టుడే (https://academy.nutrifytoday.com/) ప్రారంభించింది. పరిశ్రమ వృద్ధితో పాటుగా న్యూట్రాస్యూటికల్స్ విభాగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లకు అవసరమైన నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఇది ఏర్పాటైంది. తొలి దశలో ముంబై, బెంగళూరులలో న్యూట్రిఫీ టుడే అకాడీమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. భారత్, ఆసియా దేశాలే కాకుండా ఆన్లైన్ కరిక్యులమ్ ద్వారా ఇతర దేశాలకు విస్తరించనుంది. గీతం, సెంచురియన్ యూనివర్శిటీ, ఏఐసీసీసీఎంబీ, నేషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసన్ వంటి పలు యూనివర్శిటీలు న్యూట్రిఫీ టుడే అకాడమీతో ఒప్పందాలు ఏర్పరచుకున్నాయి. చదవండి: Health Benefits Of Saffron: కుంకుమ పువ్వు గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా? 100బిలియన్ డాలర్ల పరిశ్రమగా... న్యూట్రిఫై టుడే చీఫ్ క్యాటలిస్ట్ అమిత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘‘న్యూట్రాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ ఫార్ములేషన్‌లో కెరీర్ కోరుకుంటున్న, ఫార్మా, ఫుడ్ టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు తగిన అవకాశాలను న్యూట్రిఫీ టుడే అకాడమీ అందిస్తుంది. రానున్న 2024 నాటికి 5వేల మంది ప్రొఫెషనల్స్‌కు శిక్షణ అందించగలమని అంచనా వేస్తున్నాం. మరోవైపు ప్రస్తుతం ఈ రంగానికి సంబంధించి భారత్ 8 మిలియన్‌డాలర్ల మార్కెట్‌గా ఉంది. అయితే ఇక్కడ నుంచి ఎగుమతులు గణనీయంగా జరుగనున్నాయి.. ఈ రంగంలోని వాటాదారుల అంచనా ప్రకారం 2025 నాటికి ఈ పరిశ్రమ 40బిలియన్డాలర్లను, 2030 నాటికి 100 బిలియన్డాలర్ల విలువ కలిగి ఉంటుంది’’ అని చెప్పారు. ఈ ప్రపంచ ప్రప్రధమ న్యూట్రిఫై టుడే అకాడమీ రూపకల్పనలో డాక్టర్ బాల్కుమార్ మరాఠీ, పూర్వ ఆర్ అండ్ డీ హెడ్ ఆఫ్ యునిలీవర్; బ్రిజెష్ కపిల్, పూర్వ ప్రొక్టర్ అండ్ గాంబెల్ ఇండియా బోర్డ్ మెంబర్ ; నాజ్నిన్ హుస్సెన్, పూర్వ అధ్యక్షుడు ఇండియన్ డైటిటిక్స్ అసోసియేషన్ ఓపినియన్ లీడర్ బేకర్ డిల్లాన్ గ్రూప్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షెల్డన్ బేకర్లు కీలకపాత్ర పోషించారు. చదవండి: అబల కాదు.. ఐరన్ లేడీ! ఆమె చేతిలో పడితే చిత్తు చిత్తే!!


