breaking news
Nuti rammohana Rao
-
జర్నలిస్టు వెంకటనారాయణకు పురస్కారం
చెన్నైలో ప్రదానం చేసిన జస్టిస్ నూతి రామ్మోహనరావు కొరుక్కుపేట (చెన్నై): అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ చెన్నై, చందూర్ కుటుంబసభ్యులు, స్నేహితుల ఆధ్వర్యంలో 2017 సంవత్సరానికి ‘ఎన్ఆర్ చందూర్–జగతి పురస్కారం–2017’ను న్యూఢిల్లీకి చెందిన సీనియర్ జర్నలిస్టు ఎస్.వెంకటనారాయణకు ప్రదానం చేశారు. చెన్నైలో శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి నూతి రామ్మోహనరావు ఈ పురస్కారాన్ని అందజేశారు. వెంకటనారాయణ ప్రస్తుతం సౌత్ ఏషియా బ్యూరో చీఫ్, ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా అధ్యక్షుడిగా ఉన్నారు. అవార్డు కింద రూ.50 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని బహూకరించారు. కార్యక్రమంలో కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు ఎంవీనారాయణ గుప్తా పాల్గొన్నారు. -
ఎయిర్‌ఫోర్స్ భూములుపై పిటిషన్లు కొట్టివేత
అర్హులైనవారి దరఖాస్తులపైనే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ కోసం సేకరించిన భూమికి పరిహారం చెల్లించాలంటూ వచ్చే అన్ని అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని మెదక్, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. పరిహారం చెల్లింపు అభ్యర్థనలతో అర్హులైన వ్యక్తుల నుంచి వచ్చే దరఖాస్తులను మాత్రమే ఆధారాలను చూసిన తరువాత పరిగణనలోకి తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి సూచించింది. పరిహారం చెల్లింపు నుంచి తీసుకున్న రూ.7.20 కోట్లను తిరిగి సికింద్రాబాద్, డిఫెన్స్ ఎస్టేట్ అధికారికి చెల్లించాలని మెదక్ కలెక్టర్‌ను ఆదేశించింది. ఆ మొత్తాన్ని మూడేళ్లపాటు తన వద్దనే ఉంచుకుని, ఆ మూడేళ్లలో అర్హులైన వ్యక్తు లు పరిహారం కోసం రాకపోతే, ఆ తరువాత ఆ మొత్తాన్ని రక్షణశాఖ ఖాతాకు మళ్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ఇటీవల తీర్పు వెలువరించారు. వివరాలు... మెదక్ జిల్లా, దుండిగల్‌లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీ ఏర్పాటు కోసం 1960-62 సంవత్సరాల్లో మొత్తం 6807 ఎకరాలు సేకరించింది. ఇందులో 5315 ఎకరాలకు అధికారులు కంచె ఏర్పాటు చేశారు. మిగిలిన భూమి కంచె బయట ఉంది. ఈ నేపథ్యంలో దాచారం గ్రామానికి చెందిన కె.బాలమ్మ మరి కొం దరు అకాడమీ ఎదురుగా ఉన్న భూమి నుంచి అధికారులు తమను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు విచారించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన రికార్డులను తెప్పిం చుకుని పరిశీలించారు. కంచె బయట ఉన్న భూములను గతంలో పరిహారం చెల్లించిన తరువాతనే సేకరించారని తేల్చారు. కాబట్టి పిటిషనర్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదన్నారు. పిటిషనర్లకు జరిమానా విధిస్తూ పిటిషన్లను కొట్టివేశారు.